Posts

అమృత మృతి ఫై న్యాయ విచారణ జరిపించాలి!

జూలకల్లులో డప్పు రమేష్‌ అంత్యక్రియలుడప్పు రమేష్‌ అంత్యక్రియలలో పాల్గొన్న బంధుమిత్రుల కమిటీ సభ్యులుతరలివచ్చిన పౌర హక్కుల, బంధుమిత్రుల కమిటీపిడుగురాళ్ల, మార్చి19 : డప్పు రమేష్‌ అంత్యక్రియలు శనివారం గుంటూరు జిల్లా  పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామంలో బంధుమిత్రుల కమిటీ, పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో  జరిగాయి. డప్పు రమేష్‌ ప్రజా ఉద్యమంలో నడిపిన క్రియాశీలక పాత్రను సంఘ నేతలు వివరించారు. రెండు తెలుగురాష్ట్రాలతోపాటు మరుకొన్ని రాష్ట్రాల్లోనూ డప్పు రమేష్‌ పాటలతో చైతన్యం తీసుకొచ్చి ఎందరో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటంలో అండగా ఉన్న రమేష్‌ను గుర్తుచేసుకుంటూ హాజరైన ప్రతి ఒక్కరూ జోహార్లు అర్పిస్తూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. పౌరహక్కుల సంఘం తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు జి. లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి నారాయణ, కుమారస్వామి, ఏపీ పౌరహక్కుల సంఘం నేతలు చిలుకా చంద్రశేఖర్‌, విరసం సంఘ బాధ్యులు పినాకపాణి, పికెసీసీపి నాయకులు బల్ల రవిందర్‌, పీడీఎం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను, కార్యదర్శి వై. వెంకటేశ్వరరావు, ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి, కెఎన్‌పిఎస్‌ నాయకులు దుడ్డు ప్రభాకర్‌, కృష్ణ అమరవీరుల బంధుమిర ల కమిటీ తెలంగాణా, ఆంధప్రదేశ్‌ అధ్యక్షురాళ్లు అంజమ్మ, పద్మకుమారి, తెలంగాణా విద్యార్థి సంఘం నేతలు గోపి, ప్రజా కళామండలి అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు జాను, కోటి తదితరులు పాల్గొన్నారు. 

సింగరేణి కార్మికుల మృతికి ప్రభుత్వానిదే బాధ్యత!

కస్టడీ మరణాలకు నష్టపరిహారం బాధ్యత ఆ యా కస్టడీ అధికారులదే

BBI ఇటుక బట్టి యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి | ప్రజా సంఘాలు

నాగరాజు ఆత్మహత్య పై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి | సి ఎల్ సి, తెలంగాణ

హిందుత్వ ముసుగు | ఎన్. శ్రీమన్నారాయణ

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి | సి ఎల్ సి

ఉద్యోగులకు "ద్రోహం" చేసిన "ఒప్పందం" | సి ఎల్ సి

పేదలకు ద్రోహంచేసే బడ్జెట్ | ఎన్. శ్రీమన్నారాయణ

సాగు భూమి పై హక్కులు దున్నేవారికే కల్పించాలి | CDRO