హిజాబ్ ధారణ ముస్లీం మహిళలు కి రక్షణ ఐతే ధరించటం తీసి వేయటం వారి ఇష్టం. హిజాబ్ లకు రక్షణ కల్పిచటం రాజ్యాంగ వ్యవస్థ ల భాద్యత.
- CLC శ్రీమన్నారాయణ
భారతదేశంలో మరోసారి హిందూ ముస్లిం వివాదం పాలక పార్టీ తమ విద్యార్థి విభాగం ద్వారా సృష్టించింది. పాఠశాలలు కళాశాలలో సాంప్రదాయ దుస్తులు ధరించే అంశాన్ని ఎంచుకుని గొడవులే లేని విద్యార్థుల మధ్య గొడవలు రేకెత్తించింది. రాజకీయ లబ్ధి కోసం ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్టాల్లో హిందువులు ఓట్ల కోసం గేలం వేసింది. రాజకీయ వ్యూహాలలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోఆర్మ కర్మ తెలియని యువత లో మనువు భావజాలాన్ని నర నరానా నింపింది.వారిని పావులు గా వాడి "హిజాబ్" అంశాన్ని లేవదీసినది.
దేశ వ్యాప్తంగా పాఠశాలలు,కళాశాలలో ప్రధానం గా కర్ణాటక యూపీ, గుజరాత్ తదితర రాష్ట్రం లలో హిందు,ముస్లీం తగాదా గా హిజాబ్ సమస్యని సృష్టించింది.పసిహృదయాలను పాషాణం చేసింది.హింసను ప్రేరేపించింది. ఇదేమిటి అంటే డ్రెస్ కోడ్ అని ఏమార్చు తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభ లో డ్రెస్ కోడ్ వస్తుంది. డ్రెస్ కోడ్ సమస్య కాదు. డ్రెస్ కోడ్ అంటే విద్యాలయాల్లో ఉండే విద్యార్థులు అందరికి సంబంధించిన డి. ప్రత్యేకంగా హిజాబ్ ధరించే ముస్లింలపై దాడి ఎంచుకోవడం అంటే ఈనాడు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలలో మతాన్ని రెచ్చగొట్టి ఓట్లను దండు కోవడం కోసం పన్నాగం. వాళ్లకి ఎన్నికల్లో ఓట్లు ఎలా దండుకోవాలి అనే సమస్య. అసలు సమస్య హిందువుల ఓట్లను రాబట్టడం
సమస్య.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్లను రాబట్టుకోవటానికి ముస్కాన్ లను టార్గెట్ చేసుకుని " హిజాబ్" సమస్యను లేవనెత్తినారు. ఇది ఒక పెద్ద కుట్ర. అందుకే ఇంతకాలం లేని హిజాబ్ సమస్య ను ఇప్పుడు తీసుకు వచ్చింది. ఇది చట్టవ్యతిరేకమైనది.రాజ్యాంగ విరుద్ధం. ఎన్నికల నియమాల ఉల్లంఘన. అనైతికం.దుర్మార్గం.
భారతీయులు తమ సాంప్రదాయ దుస్తులను ధరించడం కొత్తేమి కాదు.రాజులు కాలం నుండి వందల సంవత్సరాల వివిధ సంస్కృతులు తో నిండి ఉన్న భారతీయ సమాజం తమ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా దుస్తులను ధరిస్తుంటారు. సిక్కులు, పారశీకులు, జైనులు, క్రిస్టియన్లు, ముస్లిం, హిందువులు అనేక రకాల మతాల సంస్కృతులు,సాంప్రదాయాలు, కట్టుబాట్లు కలిగినటువంటి భారతీయ ప్రజలు తమ సంస్కృతులతో కూడిన దుస్తులను ధరించటం వందల సంవత్సరాలుగా ఉన్నది.
భారత సమాజం లో అన్ని మతాల సాంప్రదాయాలు, సంస్కృతులు మహిళలు ని కట్టు బానిసలు ని చేశాయి. కొన్ని వందల సంవత్సరం ల పాటు వంట ఇంటి కి పురుషుల సేవ కి పరిమితం చేశాయి. శూద్రులు,అస్పృష్యు లు తో పాటు స్త్రీల ని విద్య కు దూరం చేశారు.దానికి కారణం కూడా ఈ మనువాద భావజాలమే.
హిందువులు, మహిళలు, సన్యాసులు తో సహా కాషాయ వస్త్రాలను నెత్తి పైన చీర కొంగు ని వేసుకుని కప్పుకోవడం ఒక సాంప్రదాయ. హిందూ సాధారణ మహిళలు సైతం తన చీర కొంగును నెత్తి పైన వేసుకుని కనిపిస్తుంటారు. ఇది ఈనాటి సాంప్రదాయం కాదు. కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్న సాంప్రదాయం.హిందూ మహిళ చీర కొంగు చాటున తన ముఖాన్ని దాచుకోవడం ఎప్పటినుండో వచ్చినటువంటి సంప్రదాయం.
హిందూ మహిళ ఇంటి బయటకు రాకుండా చీరను కొంగుతో ముఖాన్ని కప్పుకుని చాటు గా ఇంటి లోపల నిలబడి మాట్లాడుతారు.ఈ సంస్కృతి ఇప్పటికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలలో కొనసాగుతున్నది. ఈ సాంప్రదాయాన్ని తీసుకువచ్చింది కూడా మనువాద భావజాలమే. సగటు హిందు భారతీయ స్త్రీ ని కట్టుబానిస గా చేసి వంట ఇంటి కుందేలు గా కట్టిపడేసింది. ఈ మను సంస్కృతే.
ఇలాంటి చేడు సంస్కృతి కి వ్యతిరేకం గా చాలా మంది హిందు సంస్కర్తలు పోరాడినారు. మహిళలు తెగించి తిరగబడి బయటకు వస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఇలాంటి మనువులకు బయపడుతూనే ఆడపిల్లలను చదువు, ఉద్యోగం కోసం బయటకు పంపిస్తున్నారు.ఇలాంటి ముష్కరులు ని చూసే తమ పిల్లల ప్రాణాలు కాపాడుకోవడం కోసం కొంతమంది భయంతో పాఠశాలలకు కళాశాలలకు ఉద్యోగాలు కి పంపించడం లేదు. ఇది వాస్తవం.
అలాగే ముస్లిం కుటుంబాలకు చెందిన కొంతమంది తల్లిదండ్రులు బాలికలు ని తమ పిల్లల భవిష్యత్ కోసం పరదాల చాటున పత్వాలను సహితం దిక్కరిస్తూ తమకు అందివచ్చిన అవకాశాలు ని అంది పుచ్చుకుంటు అన్ని రంగాల్లోను ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది.గడప దాటి బయటకుపంపిస్తున్నారు. చదువు కుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. ఫలితమే నేడు అన్ని రంగాలలో మహిళలు పనిచేస్తున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్లు నిలబడుతున్నారు. మహిళలుతమ అభివృద్ధి,స్వేచ్ఛ, స్వాతంత్ర్యల కోసం స్వతంత్రం గా ఎన్నో ఏళ్ళ నుండి ఇంటి లోను, ఇంటి బయట పోరాటం చేస్తూనే ఉన్నారు. కొంతమంది ధైర్యం చేసి చదువు కోసం ఉద్యోగాల కోసం పంప లేకపోతున్నారు ఇలాంటి ముష్కరులకు భయపడే వారు తమ పిల్లల భవిష్యత్తును కూడా వదులుకున్నారు
ఒక వైపు అన్ని మతాల బాలికలు,మహిళలు స్వేచ్ఛ, స్వాతంత్ర్య ల కోసం, వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.వారికి అడ్డు గా ఉన్న సాంప్రదాయాలు,కట్టుబాట్లు కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.ఉద్యమిస్తున్నారు.ప్రత్యేకంగా ముస్లిం మహిళలు రాజకీయాలు లో ఇందిరా గాంధీ,క్రీడల్లో సానియా మీర్జా, సైన్స్ లో సునీత చావ్లా లు వలె ముందుకు దూసుకుపోతున్నారు
మరో వైపు తమ రాజకీయ లబ్ధికోసం ఎన్నికల్లో ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చుని రాజేస్తున్నారు.ఇది భారత దేశ సమగ్రత, సమైక్య తలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. బీజేపీ అధికారంలో ఉన్న సంవత్సరం లలో మతపరమైన వివాదాలు తోనే పాలన ఉన్నది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎదో ఒక మత వివాద అంశాన్ని లేవ నెత్తుతున్నారు. మనువాదులు కాలం చెల్లిన మనువాడ సంస్కృతి తో మెజార్టీ హిందు మత సెంటిమెంట్ ని రెచ్చగొడుతున్నారు.అబద్ధపు ప్రచారాలు తో ముస్లిం, క్రిస్టియన్ల పైకి దాడులకు పాల్పడుతున్నారు. నిజమైన హిందువులు ఏవరు ఇలాంటి అమానుష దుశ్చర్యలకు పాల్పడటం లేదు. రాజకీయ లబ్ధికోసం ఉన్మాదులే ఇలాంటి ఆగడాలకు ఆజ్యం పోస్తున్నారు.దేశ ప్రజల మధ్య మత ఘర్షణ లు తీసుకువస్తున్నారు. ఇది దేశ ప్రజల లౌకిక భావనకు విఘాతం. ఐక్యత విచ్చితి కి దారి తీస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో మనదేశ ప్రతిష్ట దెబ్బతింటుంది.
మనది లౌకిక భారత దేశం.రాజ్యాంగం లోని ఆర్టికల్ 25 ప్రకారం మత ప్రమేయం లేని రాజ్యం. అన్ని మతాలను సమానం గా గౌరవించాలి. ఇతర మతాల ను కించపరచ కూడదు.దూషించ కూడదు. పరమత సహనం పాటించాలి. ఆర్టికల్స్25,26,27,28 లలో మత స్వాతంత్య్ర గూర్చి వి స్పష్టంగా వివరించబడింది.నచ్చిన మతాన్ని స్వీకరించి వచ్చును. ఆచరించ వచ్చును.
"హిజాబ్" ధరించడం భారత రాజ్యాంగం ఆర్టికల్ 26 ప్రకారం వారి హక్కు. ముస్లిం మహిళలు రక్షణ హిజాబ్ ధరించట లో ఉన్నది. హిజాబ్ ధరించటం ద్వారా వాళ్ళను వాళ్ళు రక్షించుకుంటున్నారు. వాళ్లను ఇలాంటి అల్లరి మూకల నుండి రక్షించుకునేందుకు హిజాబ్ ధారణ చేస్తున్నారు. హిజాబ్ వారి రక్షణ కవచం.
వారి రక్షణ కవచం పై దాడి చేసే హక్కు ఏ ఒక్కరికి లేదు.
భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 29 అల్ప సంఖ్యాక వర్గాల హితములకు రక్షణ కల్పిస్తుంది.హిజాబ్ ఉంచుకోవడం తీసివేయటం వారి ఇష్టం. వారికి హితమైనది ఏదైనా ఇతరులకు నష్టం లేకుండా చేసే హక్కు వారికి ఉన్నది.హిజాబ్ ధరిస్తే ఇతరుల కు వచ్చే నష్టం ఏమి లేదు. ఇక్కడ హిజాబ్ ధారణ ఎవరికి సమస్య కాదు. వేలాది,లక్షలాది,కోట్లాది మంది ముస్కాన్ లు హిజాబ్ దరిస్తున్నారు. ఆఖరి కి హిజాబ్ సమస్య సృష్టించిన వారికి కూడా సమస్య కాదు. ఈ సమస్య సృష్టికర్తలు అసలు సమస్య ఎన్నికలు జరిగే 5 రాష్ట్రల లో ఓట్ల సమస్య. ఆ ఓట్ల కోసం సామాన్యుల మత సెంటుమెంట్ ని ఆయుధం గా వాడుకుంటున్నారు.
ఒకసారి మతాన్ని,మరోసారి కులాన్ని, ఇంకోసారి ప్రాంతాన్ని,ఒకొక్క సారి భాష ని, కొన్నిసార్లు దేశాన్ని సెంటిమెంట్ లు రెచ్చగొట్టి ప్రజల ని ఉపయోగించు కుంటున్నారు. ఒక్కొక్క ఒకసారి అధికారం లోకి రావటానికి దేశభక్తి ని ఉపయోగించారు.అసలు దేశమంటే భక్తే లేని పాలన చేశారు. దేశ సంపద మొత్తాన్ని అమ్మేస్తున్నారు దేశీయ విదేశీ బడాబాబులకు భారత మాత ని తాకట్టు పెడుతున్నారు.
పాకిస్తాన్ బూచిని చూపినారు. అధికారం కోసం అవసరం లేని కార్గిల్ యుద్ధం చేశారు. వారి దేశభక్తి వెంటనే యుద్ధం లో చనిపోయిన జవాన్ల శవ పేటికల అవినీతి తో బయట బడింది. అయిన మెరుపు దాడులు ఆ దాడులు ఈ దాడులు అని ప్రజల్ని రచ్చగొట్టి మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. పాలకులు ప్రాభవం కోల్పోతున్న ప్రతిసారి అధికారం లోకి రావటానికి హిందు మత సెంటిమెంట్ ని అంత్యంత వ్యూహాత్మకత తో వాడుకుంటున్నారు.
ప్రజలు జీవించే హక్కుల కోసం ,స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం, స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు కోసం, భావప్రకటనా స్వేచ్ఛకు ప్రజలకు హక్కుల కొరకు రాజ్యాంగం హక్కుల కొరకు పరిపాలన చేయాలనే ఆశ లేదు. పరిపాలకులకు ధ్యాస లేదు. ఆలోచనలు అసలే రావు. ప్రజలు ఎవరైనా పాలకులు సుపరిపాలన చేయాలని చట్టాన్ని రాజ్యాంగాన్ని అమలు చేయాలని అని అడిగితే వారి పైన తప్పుడు కేసులు బనాయించడం. UAPA చట్టాన్ని ప్రయోగించటం కవులు, రచయితలు,మేధావులు, జర్నలిస్టులు, సామాజిక కార్య కర్తలనుసహితం దేశ ద్రోహులు, టెర్రరిస్టులు లేదా కమ్యూనిస్ట్లు లేదా నక్షలైట్లు అని ముద్ర వేయటం సర్వ సాధారణ మైనది.
ప్రజల హక్కులు గురించి మాట్లాడిన,ప్రశ్నించిన ప్రగతిశీల శక్తులను, ప్రజలను,ప్రజా ఉద్యమ కారులను నేరస్తులు, టెర్రరిస్టలు గా ముద్ర వేసి కేసులు పెడుతున్నా రు. జైలులో అక్రమంగా నిర్బంధించడం. ప్రజల హక్కుల కోసం ప్రశ్నించే మేధావులు ని సంవత్సరాల తరబడి జైళ్లలో నిర్బంధించడం. అన్సారీ, కల్బుర్గి,గౌరి లంకేష ల లాంటి మేధావులను హత్య చేసినట్లు హత్యలు చేయించడం. పాలకులకు పరిపాటిగా మారింది.
ఒక చట్టం, రాజ్యాంగం ఒక న్యాయ వ్యవస్థలేదు.కోర్టులను గౌరవించాలి అని ఆలోచన అసలే లేదు. న్యాయ వ్యవస్థ సైతం పాలకులు చెప్పినటువంటి మాట వినాలి. వారి మాటే శాసనం గా ఉండాలి అని ఆలోచించే పాలకులు అధికారంలోకి రావడం ప్రమాదకరంగా మారింది.ఇంకా బరి తెగించి రాజ్యాంగాన్ని మార్చేస్తాం. మను రాజ్యాంగాన్ని తీసుకువస్తాం అని బాహాటంగా ప్రకటిస్తున్నారు. భారత దేశ ప్రజలు భవిష్యత్ అంధకారంలోకి నెట్టి వేయబడింది. సమాజంలోని ఈ దుస్థితిని మళ్ళీ ప్రజలే తీర్చిదిద్దాలి.
ప్రజలు వారి పాలన తో విసిగి పోయిన ప్రతిసారి హిందు మత సెంటిమెంట్ తో మతోన్మాదం ని రెచ్చగొడుతున్నారు. ఓట్ల లబ్ది పొందుతున్నారు. ప్రజల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారు. సమాజం లో విలువలను ధ్వంసం చేస్తున్నారు. ఇది అత్యంత అమానుషం.అమానవీయం.
అధికారంలోకి రావడం కోసం సమాజం లోని విలువలను నాశనం చేయడం. హిజాబ్ లాంటి వివాదాలుసృష్టించడం రాజ్యాంగ వ్యతిరేక చర్య. ఎన్నికల నియమావళి కి విరుద్ధం. రాజనీతి కి వ్యతిరేకం.అనైతికం. దుర్మార్గం. ప్రజలు ఈ అరాచకం చర్యలు చేసే మూకలు పట్ల ఏమరుపాటుగా ఉండాలి.
మన లౌకిక రాజ్యాంగపు విలువలను పరిరక్షించుకోవాలి. హిందూ- ముస్లిం భాయి భాయి అని జీవించిన గతకాలపు ప్రాభవాన్ని మళ్లీ పునరుద్ధరించు కోవాలి.మతోన్మాదు ల దుష్ప్రచారం లను ఎండ గడుతూ మతసామరస్యాన్ని, మత సహనాన్ని పాటించాలి. భారతీయ సమాజపు లో దాగి ఉన్న ప్రజల యొక్క శాంతి స్వభావాన్ని కాపాడుకోవాలి.
రాజ్యాంగంలోని దేశ సమగ్రత, సమైక్యతను మరింత పెంపొందించుకునేవిధం గా ప్రజల ఐక్యత మరింత బలపడాలి. హిజాబ్ ల పేరుతో ముస్కాన్ లపై అల్లరి మూకల అరాచకాలను నిలువరించేందుకు యువత, ప్రజలు సిద్ధపడాలి.
"హిజాబ్" ముస్లీం మహిళల రక్షణ. దాన్ని వారు ధరించటం, తీసి వేయటం వారి ఇష్టం. ఆర్టికల్ 25,26,21 ప్రకారం వారికి రక్షణ కల్పించటం రాజ్యాంగ వ్యవస్థ ల భాధ్యత.పౌర హక్కులను,రాజ్యాంగ హక్కులు ని కాపాడ వలసింది రాజ్యాంగ వ్యవస్థ లు అయిన శాసన,కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలది. రాజ్యాంగ వ్యవస్థ లు ప్రక్కదారి పడితే రాజ్యాంగ హక్కుల అమలు కు పోరాడావలసింది,ఉద్యమించవలసింది ప్రజలే. అంతిమం గా ప్రజలే ప్రజాస్వామ్య పరిరక్షకులు.
రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం - లౌకిక రాజ్యాంగ విలువల ను పరిరక్షించుకుందాం.
-శ్రీమన్నారాయణ.నంబూరి.
Ap హైకోర్టు న్యాయవాది.
పౌర హక్కుల సంఘం.
Comments
Post a Comment