*2022- 23 కేంద్ర బడ్జెట్- ఒక విశ్లేషణ.* -నంబూరి శ్రీమన్నారాయణ హైకోర్టు న్యాయవాది రాష్ట్ర ఉపాధ్యక్షులు పౌరహక్కుల సంఘం.
*ఇది రైతు, కార్మిక పేద ప్రజల వ్యతిరేక బడ్జెట్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21,14 కి పూర్తి విరుద్ధం* రాజ్యాంగ లక్ష్యం అయిన సమానత్వ సాదన కు తిలోదకాలు.ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగు పడవు.
****************************
4వ సారి మోడీ ప్రభుత్వం లోఆర్ధిక మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. వారి ప్రతిపాదనలు పరిశీలిస్తే ఇది ప్రజలకు ఖేదం.కార్పొరేట్ లకు ఆమోదం. బడ్జెట్ ని పరిశీలిస్తే చాలా బాధాకరం ఉంది. శ్రమజీవుల,కష్టజీవుల జీవన విధానానికి ,అభివృద్ధి కి బడ్జెట్ మద్దతు లేదు. సంపద సృష్టికర్తలు ని పట్టించుకోకుండా తయారు చేసిన బడ్జెట్ ఇది. క్లుప్తంగా విశ్లేషణ చేద్దాం.
బడ్జెట్ పద్దు: 39,44,909 కోట్లు.
రెవెన్యూ వసూళ్లు:22,04,422 కోట్లు
రెవెన్యూ వ్యయం: 31,94,663 కోట్లు
మూలధన వసూళ్లు:17,40,487కోట్లు
మూలధన వ్యయం:7,50,246కోట్లు
కొత్త ఏడాది స్థూల అప్పులు: 14,95,000కోట్లు
ఇవి స్థూలం గా ఆర్ధికమంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ లెక్కలు. 35% వృద్ది ని కూడా సాధిస్తామని 7.5 కోట్ల మూలధనం సమకూర్చుతామని ఆమె లోక్ సభ లో ప్రకటించారు. బడ్జెట్ ని పరిశీలిస్తే ఈ వృద్ది లో సామాన్యులకు ఇచ్చే వాటా లేక పోవడం గమనార్హం.ప్రత్యేకంగా మహిళలు,చిన్న పిల్లలు,వృద్దులు,సంక్షేమం ఊసే లేదు,యువత ఉద్యోగ ఉపాదికోసం నిన్న బడ్జెట్ ప్రసంగం లో 18 సార్లు మాట్లాడినారు.కానీ బడ్జెట్ లో ప్రత్యేక ప్రాధాన్యం వాటికోసం ఇచ్చింది ఏమి లేదు.ఇది చాలా బాధాకరం.
బడ్జెట్ ప్రవేశ పెడుతూ ప్రభుత్వ ప్రధాన నినాదాలు అయిన గతిశక్తి గురించి, ఆత్మ నిర్భరత గురించి పదే పదే విత్తనమంత్రి లోక్ సభ లో ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వ ప్రాధాన్యం ఏమిటో చెప్పకనే చెప్పినారు.
*మౌలిక సదుపాయాలు*
పేదలకు 80 లక్షల ఇళ్లు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 20 22 23 ఆర్థిక సంవత్సరంలో 80 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశిస్తుందని నిర్దేశించుకున్న ఆర్థికమంత్రి బడ్జెట్లో తెలిపారు దీనికి 48 వేల కోట్లను కేటాయించడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని బడ్జెట్ నిర్దేశించింది వీటిలో పూర్తిగా పేదలకు దక్కేది ఎంతో తేలాల్సి ఉంది భూమి నిర్మాణ సమస్యలు దాటుకుని ఈ లక్ష్యాలను ఈ మేరకు ప్రభుత్వం చేసుకుంటుందో వేచి చూడాలి.
*నల్లా కనెక్షన్లు.*
అదేవిధంగా 3.80 కోట్ల గృహాలకు నల్ల కలెక్షన్ బడ్జెట్ను ప్రతిపాదించారు దీనికోసం 60 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు తెలిపారు శక్తి మంత్రిత్వశాఖకు కేంద్రం 86 వేల 189 కోట్లు కేటాయించింది 69 వేల 52 కోట్లు 24 శాతం నిధులను పెంచారు.దేశంలో పేదలకు ప్రత్యక్షం గా ఉప యోగ పడే ఇల్లు నల్లాలు దేశ ప్రజల అవసరాలకు తగిన విధంగా కేటాయించకుండా నామమాత్రంగానే జరిగాయని బడ్జెట్ లెక్కల్లోనే తెలుస్తున్నది.
*గతి శక్తి నేషనల్ ప్రాజెక్ట్*
ప్రధాన మంత్రి గతి శక్తీ నేషనల్ మాస్టర్ ప్లాన్ ప్రైజెక్టుకింద విశాల రహదారుల నిర్మాణం చేపట్టడానికి బడ్జెట్ ప్రతి పాదించారు. 25 వేల కిలో మీటర్ల మేర రహదారుల విస్తరణకు రూ1.99 లక్షలు కేటాయింపు జరిగింది. కోవిడ్ సాకు తో 2సంవత్సరం లు గా రోడ్ లు వేయలేదు. ప్రస్తుతం ఇందులో కాంట్రాక్టర్లు,
బడా బాబులకు లబ్ది లభిస్తుంది. ఈ యాంత్రీకరణ యుగం లో రోడ్ కూలీలు, కార్మికులు కి దక్కేది పిసరంతే. ఈ రోడ్ల నిర్మాణం లో ఎక్కువ మంది శ్రామికులు ఉపాధి కల్పిచాలి అనే నిబంధనలు బడ్జెట్ లో ప్రస్తావన లేదు.
2022- 23 కేంద్ర బడ్జెట్ మేడి పండులాంటిది.ప్రజలకు భారం కార్పొరేట్ లకు వరం.ఇదొక చెత్త బడ్జెట్. రాజ్యాంగ స్పూర్తి కి విరుద్దం.ప్రజల మధ్య తీవ్రమైన ఆర్ధిక అసమానతలు ని పెంచి పోషించే బడ్జెట్ లలో ఇదొకటి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ లకు అనుకూల మైన 3 వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకున్నాఆ వెలుగులొనే బడ్జెట్ కార్పొరేట్ లకు అనుగుణంగా ప్రతిపాదించారు.ఎకనామిక్ సర్వే కూడా ఇదే విషయాన్ని వెలువరించింది.
వార్షిక కేంద్ర బడ్జెట్ ను నేడు పార్లమెంటు లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు ను ప్రవేశ పెట్టారు.బడ్జెట్ ప్రతిపాదనలు ని రూ39.44,909 లక్షల కోట్ల గా చూపారు. మూడో వంతు అప్పు లే. బాకీలకు ,అప్పులపై వడ్డీ లకు జీతాలు, నాతాలు ,కార్పొరేట్ లకు రాయితీలు పోను
అందనంగా కెటాయింపు లు లేక కొన్ని శాఖ లకు కోతలు కూడా విధించారు. విజన్ లేని న్యూ విజన బడ్జెట్ ఇది. డిజిటల్ మయాజాల బడ్జెట్.
*బడా కార్పోరేట్లకు అనుకూలం*
కార్పొరేట్ దిగ్గజాలు ఆదాని,అంబాని లకు అతి పెద్ద మద్దతు ని బడ్జెట్ లో సమకూర్చారు. కార్పొరేట్లకు ఉపయోగపడే 3 వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది దీనిపైన కార్పొరేట్లు వ్యతిరేకత ఉంది వారిని మరింత మచ్చిక చేసుకోవడం కోసం బడ్జెట్లో వరాలను ఇచ్చారు ప్రధానంగా అదానీ అంబానీ వీళ్లకు కు ఎనర్జీ స్టోరేజీ సదుపాయాలు మౌలిక హోదా కల్పిస్తూ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారు ప్రకటించారు కార్పోరేట్ లబ్దికోసం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసింది అని ఆమె తెలిపారు దీంతో ఈ సదుపాయాలు ఏర్పాటు కారుచౌకగా బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం కార్పొరేట్లకు లభిస్తుంది ఈ నిర్ణయం ముకేశ్ అంబానీ, గౌతమ్ ఆదాని, సునీల్ మిట్టల్ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు భారీగా లబ్ధి చేకూరుతుంది ఎందుకంటే ఈ భాగాలు ఇప్పటికే భారీ ప్రణాళికలు ప్రకటించి ఉన్నారు విదేశీ రుణాలు సేకరణ తక్కువ వడ్డీకే రుణాలు సేకరణతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు డేటా సెంటర్లకు ఇంకా ఇన్ఫ్రా హోదా లభిస్తుంది డిజిటల్ యూనివర్సిటీలు డిజిటల్ బ్యాంకులు డిజిటల్ రూపీ ప్రవేశంతో పాటు శరవేగంగా పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు భారత్ నెట్ ద్వారా మారుమూల ప్రాంతాల వరకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటుతో భవిష్యత్తులో కొద్ది డిజిటల్ సమాచారం ఉందని ఆ డేటాను నిక్షిప్తం చేసేందుకు , పెద్దఎత్తున డేటా సెంటర్లు అవసరమవుతాయని కార్పొరేట్ శక్తులు ముందుగానే ఊహించారు వారి వ్యాపార ప్రయోజనాల కొరకు కేంద్ర ప్రభుత్వం నేడు బడ్జెట్లో మౌలిక హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది గత ఏడాది నవంబర్లో దేశంలో రెండో అత్యంత ధనవంతుడైన గౌతమ్ ఆదాని పునరుత్పాదక ఇంధన శక్తి ఆధారంగా నడిచే గ్రీన్ డేటా స్టోరేజ్ సెంటర్ల ఏర్పాటు ప్రపంచ దిగ్గజం గా ఎదగాలని కోరుకుంటున్నా అని ప్రకటించారు ఆయన ఆశలు ఆశయాలకు అనుగుణంగా బడ్జెట్ లో నేడు ఫైనాన్స్ మినిస్టర్ ఈ సదుపాయాలు కల్పించడం జరిగింది అదానీ గ్రూప్ త్వరలో ముంబై చెన్నై హైదరాబాద్ ఢిల్లీ లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలనుకుంటుంది సునీల్ మిట్టల్ కంపెనీ ఎయిర్టెల్ డేటా సెంటర్ లో ఏర్పాటు లో భారీ ప్రణాళికలు రూపొందించింది 2025 నాటికి గ్రూప్ డేటా సెంటర్లు సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచేందుకు ఐదువేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు ముఖేష్ అంబానీ చెందిన డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్ఫాం కూడా డేటా సెంటర్ల ఏర్పాటు పై దృష్టి సారించింది డేటా సెంటర్ లో ఏర్పాటు పై దృష్టి సారించింది అంతేకాదు ఈ సంవత్సరం ద్వితీయ అర్థంలో ప్రకటించిన ఏడు వేల ఆరు వందల కోట్ల డాలర్ల పెట్టుబడి ప్రణాళికలో భాగంగా మోడీ రాష్ట్రమైన గుజరాత్ లో ని జామ్ నగర్లో రిలయన్స్ ఎనర్జీ స్టోరీస్ సహా నాలుగు గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయబోతోంది వీటికి అయ్యే భారీ పెట్టుబడుల కోసం చౌకగా రుణాలు పొందేందుకు మౌలిక హోదా అవసరం. డేటా సెంటర్లు ఎనర్జీ స్టోరేజ్ మౌలిక సదుపాయాలకు మౌలిక హోదా కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన నేటి బడ్జెట్ లో ప్రకటించారు. ప్రతి సంవత్సరం కార్పొరేట్లు వేల కోట్ల రూపాయలను బ్యాంకుల నుండి తీసుకుంటూ తిరుగు చెల్లింపుల్లో విజయ్ మాల్యా లలిత్ మోడీ తదితరులు లాగా కొడుతున్నారు ప్రజల సంపదను వీరు రుణాల రూపంలో తీసుకుని దేశ సంపదను లూటీ తీసేస్తున్నారు అయినా వారికి వేల కోట్ల రూపాయల రుణాలను అందించే నిర్ణయాలను బడ్జెట్లో ప్రకటించడం అత్యంత ప్రమాదకరం కోవిడ్ కాలంలో చితికిపోయిన టువంటి ఇ చిన్న సన్నకారు రైతులకు చిన్న పరిశ్రమలకు చిన్న వర్తకులకు ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూర్చే కలరు నేటి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పొందుపరచలేదు ఇది అత్యంత దుర్మార్గం దేశం అభివృద్ధి కొద్దిమంది చేతుల్లో లేదు 90 శాతం గా ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు వారి అభివృద్ధికి వారి సంక్షేమానికి వారి ఆరోగ్యానికి నేటి బడ్జెట్లో ఏ విధమైనటువంటి కేటాయింపులు లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. 2022-23బడ్జెట్ రాజ్యాంగ వ్యతిరేక బడ్జెట్.
*బలిపీఠంపై పబ్లిక్ సెక్టార్.*
2022 23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్ సభ లో ప్రకటించారు. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ లైన్ ని టాటా గ్రూప్ కి అప్పగించారు ప్రభుత్వంపై ఉన్న ఎయిర్ ఇండియా అప్పును51 వేల కోట్ల రూపాయలు చెల్లింపులకు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి.విమానయాన రంగం ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లడంతో ప్రభుత్వ రంగం చేతిలో లేకుండా పూర్తి ప్రైవేటీకరణ జరిగినట్లు అయింది ఏలియా పూర్తిగా కనుమరుగై పోయింది ఇది మన దేశ భక్తి పాలకులు దేశభక్తి. డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం 65 వేల కోట్ల రూపాయలుగా ప్రకటించారు 1 921 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.75 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల నుండి ఉపసంహరించుకున్నారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ పరిశ్రమలను అభివృద్ధి చేయవలసినది పోయి వాటిని పెట్టుబడులను సైతం స్మరించుకోవడం సమాజ సంక్షేమానికి విరుద్ధం ప్రమాదకరం ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేసే ఏ ప్రజాస్వామిక ప్రభుత్వమైనా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రతి సంవత్సరము ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు ఉండాలి ప్రభుత్వ రంగ సంస్థలను గత ప్రభుత్వాలు ప్రోత్సహించాయి 1947లో బ్రిటిష్ వాడు నుండి భారత పాలకులకు అధికార మార్పిడి జరిగేంతవరకు జరిగిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగినది బిజెపి ప్రభుత్వాలు ఏర్పాటు అయిన తర్వాత మే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకాలకు పెడుతున్నారు అది మోడీ ప్రభుత్వ హయాంలో మరింత బాహాటంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టారు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నేడు లక్షల కోట్ల రూపాయలు లో జరుగుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థల పూర్తిగా ప్రైవేటీకరించడం అభివృద్ధి నిరోధకం. ఇది సామాజిక సంక్షేమానికి నష్ట కరం. అందుకే 2022- 23 బడ్జెట్టు సమాజ సంక్షేమ వ్యతిరేక బడ్జెట్.
*అసమానతలు పెంచే బడ్జెట్ వలన సమాజం అంధకారం అవుతుంది*
* గ్రామీణ ఉపాధి కి 25%తగ్గింపు.దీని పై ఆధారపడి బీద, బిక్కి బతుకు తున్నారు. పని దొరకని గ్రామీణ ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు గ్రామీణ ఉపాధి పథకం పై ఆధారపడి కొన్ని నెలలు బతుకుతున్నారు. ఇలాంటి పేదలకు ఆసరాగా ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి పథకం 25% తగ్గించడం అమానవీయం. పేదలకు ఆసరాగా ఉండేటటువంటి మరిన్ని పథకాలను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించాలి. అలా కాకుండా ఉన్నటువంటి గ్రామీణ హామీ ఉపాధి పథకం కూడా కోత విధించడం పౌరుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి శ్రద్ధ ఏపాటిదో తెలుస్తుంది.బీద,బిక్కి జనాల్ని ప్రభుత్వం పౌరులుగా పరిగణించడానికి ఇష్టపడటం లేదా అని ప్రశ్న ఉదయిస్తుంది మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ప్రాధాన్యత ఇస్తూ పేదలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పలు అనుమానాలు కలిగిస్తున్నాయి. సమాజాన్ని ముందుకు తీసుకు పోక పోయినా పర్వాలేదు కానీ చాతుర్వర్ణ వ్యవస్థ మనుగడ సాగించిన కాలం వైపు తీసుకు వెళ్ళటం అత్యంత ఆందోళనకరంగా కనిపిస్తుంది.ఆనాడు రాజులు,మంత్రివర్గ అనుచలే బతికాను. ప్రజలు అందరు కట్టు బానిసలు.ప్రజాస్వామ్య పాలనలో కూడా అదేనా? అందులో భాగంగానే బడ్జెట్లో పేదలకు అన్యాయం. ఇలాంటి చర్యలు వలన ఆ ఆలోచన ప్రజల్లో కలుగుతుంది ఇదే విధానం బిజెపి ప్రభుత్వం కొనసాగిస్తే భారతదేశం భవిష్యత్తు అందకారం గా మారిపోతుంది.
*ఒక చోట పోగు చేయబడి సంపద అంతా శ్రమ జీవులదే*. ఆ సంపద ప్రజలకు దక్కకుండా కొద్దిమందికే దక్కితే ఆ సమాజం అభివృద్ధి సాధించడం అసాధ్యం సంపద సృష్టించిన ప్రజలకు సమాన వాటా దక్కిన అప్పుడే నిజమైన అభివృద్ధి సాధించినట్లు అని మహనీయులు కార్ల్ మార్క్స్. తన పరిశోధనాత్మక పెట్టుబడి గ్రంథము లో సమసమాజ నిర్మాణమే మానవ సమాజం ఎదుర్కొంటున్న ఆర్ధిక,రాజకీయ, సామాజిక,సాంస్కృతిక, తదితర సమస్యలన్నిటికీ పరిష్కారం అని తెలియజేశారు రాజకీయ అర్థశాస్త్రం గా ప్రసిద్ధి చెందిన పెట్టుబడి గ్రంథం లో ప్రవేట్ ఆస్తి లేకుండా చేయాలని శ్రమ దోపిడీ లేని సమ సమాజాన్ని నిర్మించాలని తెలియజేశారు. దానికి విరోధం గా ఆడంష్మిత్ తదితరులు పెట్టుబడి దారులకు అనుగుణంగా చెప్పిన లాభం పెట్టుబడి దార్లదే అణా సూత్రీకరణలో బడ్జెట్ ప్రాణాకలు ఉన్నాయి. దేశ ప్రజలు అభివృద్ధి కి వ్యతిరేక మైన బడ్జెట్.
*వ్యవసాయం పంటలకు కి గిట్టుబాటు లేదు* అహర్నిశలు దేశ అభివృద్ధి కి కృషి చేసే రైతన్నల ఆదాయ పెంపు ప్రస్తావన లేదు.వ్యవసాయ రంగం లో కార్పొరేట్ లకు అవకాశాలు ఇవ్వటానికి మొగ్గుచూపుతున్నారు. రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామని కేంద్రం చెప్పిన గడువు ఈ సంవత్సరం వచ్చింది కానీ తాజా బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు రైతు కుటుంబం నెలవారి ఆదాయం సగటున 2015 16 సంవత్సరాల లో 800059 రూపాయలు ఉన్నట్లు కేంద్రం అప్పట్లో తెలిపింది. ఇది రెట్టింపు కావాలంటే ప్రస్తుత ధరల ప్రకారం ఈ ఏడాది ఇరవై ఒక్క 146 రూపాయలకు చేరాలి కానీ 2018 ఇది 19 కేంద్రం జరిపిన అధ్యయనం ప్రకారం పదివేల 218 రూపాయలుగా ఉంది 2015 19 మధ్య నమోదైన పెరుగుదలను దృష్టిలో లెక్కించిన ప్రస్తుతం 2022లో ఆదాయం 29 55 రూపాయలు దాటడం లేదు జాతీయ నమూనా సర్వే ప్రకారం రైతు చూస్తే రైతులు పంటల పై వచ్చే ఆదాయం వచ్చే ఆదాయం పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నట్లు తేలిందని సర్వే వివరించింది
*రైతు ఆదాయం రెట్టింపు(డిఎఫ్ఐ)లేదు:* రైతు ఆదాయం రెట్టింపు
ఎలా చేయాలి అనే అంశంపై కేంద్రం 2015లో జాతీయ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ రాష్ట్రంలో రైతుల ఆదాయం 2022-23 నాటికి ఎంత పెరగాలో గణాంకాలతో వివరించింది. వాటి ప్రకారం తెలంగాణలో 2015 -16 లో రైతు కుటుంబ ఆదాయం సగటున రూ86291లు గా ఉంది రూ 63490 రూపాయలు. మిగతాది ఇతర పనులు చేయటం ద్వారా సంపాదించినది ప్రస్తుత ధరల ప్రకారం ఇది 2022-2023 కల్ల రూ 2,01,431లు పెరిగితే రెట్టింపైనట్లు. ఇందులో పంటల సాగు పై
రూ 1,56,522లు మిగతాది ఇతర పనులపై పై రావాలి ఇదే కాలవ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో రూ104092 నుంచి రూ 233876 లు కి రైతు ఆదాయం పెరగాలి. తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆదాయం ఈ స్థాయిలో పెరిగిన దాఖలాలు లేవు.
*ఆత్మనిర్బర్ భారత్ కింద వ్యవసాయానికి లక్ష కోట్ల నిధి ఏది?*
కేంద్ర బడ్జెట్ మొత్తం నిధుల్లో వ్యవసాయం అనుబంధ రంగాలకు 2021- 22 లో 3. 97 శాతం కేటాయించగా 20- 22 23 బడ్జెట్లో 3.5 శాతానికి తగ్గించారు. ఆత్మ నిర్మల్ భారత్ కింద వ్యవసాయానికి లక్ష కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి 20 నెలల్లో కేవలం 6627 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మాత్రమే అనుమతించా రు. రైతుల ఆదాయం రెట్టింపు చేసింది ఏమీ లేదు. రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్రం నిర్దిష్ట పథకాలు ఏవీ పెద్దగా బడ్జెట్లో ప్రతిపాదించలేదు. అమలు చేయలేదు దీనికితోడు ఇప్పటికే ఉన్న పలు వ్యవసాయ అభివృద్ధి పథకాలకు నిధులు నిధులు విడుదల చాలా వరకు తగ్గిపోయింది రైతుల ఆదాయం పెరగాలంటే అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు భారీగా పెరగాలని DFI కమిటీ 2015 లోనే సూచించింది. 2015 16 నుంచి ప్రైవేట్ పెట్టుబడులు బేటా 6.6 శాతం ఉంది అంటే 2015 23 మధ్య కాలంలో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు 46,300 కోట్లు రావాలి. ఒక ప్రభుత్వ పెట్టుబడులు వృద్ధిరేటు 6.2 శాతం ఉండాలి అంటే ప్రభుత్వాలు రూ1,02, 300 కోట్ల పెట్టుబడి పెట్టాలి.వెనుకబడిన రాష్ట్రాల్లో ఇది ఎక్కువ ఉండాలి
*రైతుల పంటలకు కొనుగోళ్ల మద్దతు ఏది?*
*కేంద్రం బడ్జెట్లో రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలను ప్రకటించలేదు* వ్యవసాయ రంగంలో లో ఆహార పంటలు పండించే వలసిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదని పిస్తుంది ఆదాయాలు లేక ప్రజలు తీవ్ర మైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు పెరిగిన ధరలతో సతమతమవుతున్న కూరగాయలు పండించే రైతుకు మద్దతు ధర ఇవ్వకపోవడం తీవ్ర మైన తప్పు ప్రజల్ని అన్ని రకాల ఆదుకోవాల్సిన అటువంటి ప్రభుత్వాలు ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించాలి ఆకలి దారిద్య్రం లేని సమాజాన్ని సృష్టించాలి రాజ్యాంగ లక్ష్యం అది ఆకలి ఆత్మహత్యలను నిలువరించాలి ఆకలి ఆత్మహత్యలు లేని సమాజం ఉండాలి అంటే వ్యవసాయ రంగం మద్దతుగా ప్రభుత్వాలు నిలబడాలి గోధుమ, అరటి, చెరకు కూర కాయలు,అపరాలు, పప్పు దినుసులు వంకాయలు, బెండకాయలు, బీరకాయలు బీట్రూట్, క్యారెట్ తదితర పంటలు పండించే అటువంటి రైతులకు సబ్సిడీలు ప్రకటించాలీ. బ్ ఈ బడ్జెట్లో సబ్సిడీలు,భీమా వ్యవసాయ రంగానికి సంబంధించి చి కావాల్సిన మద్దతు ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది.
*వైద్య ఆరోగ్య రంగంలో నిదుల కోత:* ఇది ప్రజా ఆరోగ్యాన్ని విస్మరించటమే. ఆరోగ్య వంతమైన సమాజం లేకుండా అభివృద్ధి సాధ్యంకాదు.
*డిజిటల్ షోకులతో బడ్జెట్*
ఆ దిశ గా ఒక అడుగు కానీ అది70% ప్రజలకు చేరువ కాదు.100%డిజిటలైజ్ తో పోస్టల్,బ్యాంకింగ్ సేవలు.డబ్బులు ఉన్నవాడు కి మాత్రమే.
*పేదలకు అందని డిజిటల్ విద్య.*
ప్రపంచ స్థాయి ప్రమాణాలు తో ఇంటి గుమ్మం దగ్గరకు డిజిటల్ విద్య చేరుతుంది అని ప్రకటించారు. పేద విద్యార్థుల కుటుంబాలకు ఎలాచేరుస్తారో ప్రకటించలేదు. తిండికి కర కట లాడే వారి కుటుంబాల కు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లు ఉండవు. డిజిటల్ విద్య పేరుతో వారికి విద్యను దూరం చేయడమే వారికి విద్య అవసరం లేదని నా ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లు ఉన్నది
ఆచరణ లో పేదలకు డిజిటల్ విద్య చేరువ కాదు. విద్యార్థులు డిజిటల్ విద్య ను అందుకోవటం కష్టం.డిజిటల్ విద్య అందించటానికి పేద విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి.ఆ ఊసే బడ్జెట్ లో లేదు.
*డిజిటల్ కరెన్సీ అమలుకు పచ్చ జెండా*.ఇక డిజిటల్ రూపీ.క్రిప్టో కరెన్సీవంటి డిజిటల్ ఆస్తులు బదిలీ పై30% పన్ను బాదుడు.
ఉద్యోగుల కు ఊరట లేదు.చాలా కాలం నుండి ఆశిస్తున్న స్టాండర్డ్ డెడక్షన్ ప్రకటించ లేద.ఆదాయపన్ను చెల్లింపు దారులకు రాయితీ లు లేవు.చిన్న ఉద్యోగుల, కాంట్రాక్టు,, ఔట్ సోర్సింగ్, ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రస్తావనలేదు.ప్రైవేటు ఉపాద్యాయులు భద్రత ప్రస్తావన లేదు. వారి సంక్షేమం గురించిన ఊసే లేదు.
*బడా కంపెనీ లకు రాయితీలు-చిన్న పరిశ్రమలక చేతి కి అందని క్రెడిట్
అదానికి గౌడౌన్లు అంబానీ కి ల్యాండ్ లైన్లు.కార్పొరేట్ లకు ఊతం.5G స్పెక్ట్రమ్ వేలానికి లైన్ క్లియర్. 5G డిజైన్ లెడ్ మాన్యుఫాక్చరింగ్ PLI కింద రు4000 కోట్ల రూపాయలు కేటాయించారు. తర్వాత వేలం లో అమ్మేస్తున్నారు. ప్రభుత్వ టెలికాం రంగం BSNL కి ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలు యువతకు లభించే అవకాశాలు ఉన్నాయి.ప్రభుత్వం అటు మాట మాత్రం గా అయిన దృష్టి సారించటానిమి సిద్ధం గా లేదు. కార్పొరేట్ లకు అప్పగించాలని ఉవ్విళ్లూరుతుంది.
ప్రభుత్వ పరిశ్రమలు ఆస్తులు ఆమమేకం ద్వారా 65 వేల కోట్లు ఆర్జన లక్ష్యం గా నిర్ణయించారు. వాటిలో పనిచేసే ఉద్యోగుల,కార్మికుల సంక్షేమం గురించిన ఊసే లేదు.
*ఆంధ్రప్రదేశ్ కి మొండి చెయ్యి* ప్రత్యేక హోదా లేదు.కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైన్ ఊసు లేదు. రాయలసీమ ఉత్తరాంద్ర లకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు. జనరల్ బడ్జెట్ లోను రైల్వే రంగం లోను తెలుగు రాష్ట్రాల కు ఒరిగింది ఏమి లేదు.పోలవరం ప్రాజెక్ట్ కిరావలసిన నిధులు30వేల కోట్ల ప్రస్తావన లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నేతలు కేంద్రం తో మిలాఖత్ వలన ఇలా జరిగింది అని ప్రజలు భావిస్తున్నారు.
*దక్షిణాది నదుల అనుసంధానం;*
మొదటి సారి కెన్-బెత్వా up, mp రాష్ట్రాల మద నదులు అనుసంధానం కి ఓ ముందడుగు పడింది.ఆ ఉమ్మడి ప్రాజెక్టు కు రూ44605లు కోట్లు కేటాయింపు జరిగింది. ప్రస్తుతం సంవత్సరం సవరించిన బడ్జెట్లు నాలుగు వేల 300 కోట్లు వచ్చే సంవత్సరం 1400 కోట్లు కేటాయించారు నిర్మాణ వ్యయంలో 90శాతం కేంద్రం 10% యూపీ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది అని ప్రకటించారు గతంలో ఆ ప్రాజెక్టుకు నేరుగా బడ్జెట్లో కేటాయింపులు చేయడం ఇక్కడ గమనార్హం అయితే గోదావరి నదుల అనుసంధానం ప్రతిపాదనలు ఒడిశాలోని మహానది గోదావరి కృష్ణ కావేరి నదుల అనుసంధానం కూడా బడ్జెట్లో ప్రస్తావన చేశారు ఈ నదుల అనుసంధానం చేయాలని నిర్ణయించారు మొదట గోదావరినదిపై జనం పేట నుంచి తర్వాత అకినే పల్లి వద్ద నుంచి ప్రతిపాదించి చివరకు ఇచ్చంపల్లి నుంచి నీటిని ఖరారు చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక ముసాయిదా 2019లో భాగస్వామి రాష్ట్రాల కి పంపినారు.ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీలు మధ్యలో తెలంగాణలోని నాగార్జునసాగర్కు తీసుకువెళ్లడం సాగర్ నుంచి పెన్నా నదిపై ఉన్న సోమశిల మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ఆయకట్టుకు ఇవ్వటం తర్వాత సోమశిల నుంచి కావేరి నది ఆనకట్ట వరకు అనుసంధానం చేసి తమిళనాడు ఇవ్వడం మొత్తం ఒకే అనుసంధానం.
కానీ కేంద్ర మంత్రి 3 అనుసంధానాలు గా పేర్కొన్నారు రాష్ట్రాల నుంచి నీటిని తీసుకోవడానికి వీల్లేదని చత్తీస్ఘడ్ అంటే మొదట నీటి లభ్యతపై తమ అవసరాలు తీరిన తర్వాత తీసుకెళ్లాలని తెలంగాణ ఏపీ అంటున్నాయి తమకు వాటా ఇవ్వాలని కర్ణాటక తమిళనాడు మాత్రమే ఉంది ఆంధ్రాకి అందవు. తమిళ నాడు కి ఒట్టి నీళ్ల మూటే.
లక్షల కోట్లున్న LIC ని బలిపీఠంపై నిలిపారు. ఎల్ఐసి ఈ సంవత్సరం పూర్తిగా ప్రైవేటీకరణ చేసేటటువంటి ఆలోచనలు ప్రభుత్వం ఉంది ప్రభుత్వ రంగ సంస్థ ల స్థానంలోకి కార్పొరేట్ లను తీసుకు రావటం ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది.
*ఉద్యోగ రక్షణ లేదు.* ప్రభుత్వ కొత్త కొలువులు కల యువత కలలు గానే మిగిలినాయి.ఇంటికి ఒక ఉద్యోగం మాటలు గాలి లో నీటి బుడగలు అయ్యాయి.
*రైల్వే బడ్జెట్:* రైల్వే కేటాయింపు 2022- 23 లో బడ్జెట్14036713 కోట్లు, మొత్తం మూలధనం వ్యయం2022- 23లో 2.45 లక్షల కోట్లు. గత బడ్జెట్ కేటాయింపుల కంటే 30,312 కోట్లు సవరించిన అంచనాల కన్నా 20,311 కోట్లు అధికం.
👍*400 వందే భారత్ రైళ్లు:* ప్రయాణికుల జేబులకు చిల్లు: మెరుగైన విద్యుత్ సామర్థ్యంతో ప్రయాణం చేస్తూ పని చేస్తూ ప్రయాణికులకు గొప్ప అనుభూతిని పంచుతాయి ఏ విధంగా మూడేళ్లలో తయారు చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు తేలికపాటి అల్యూమినియం 50 టన్నుల లో వీటిని రూపొందిస్తారని తెలిపారు నీతో పోలిస్తే తక్కువ వినియోగించుకుంటాయి అని చెప్పారు రు ఈ కొత్త రైలు ఎప్పటిలాగా పట్టాలు ఎక్కుతాయి విషయం ఆర్థికమంత్రి స్పష్టంగా తెలపలేదు ప్రస్తుతం భారతదేశంలో రైల్వే ప్రయాణికులకు కావలసినటువంటి ఈ విధంగా గా మంచి సౌకర్యాలతో శుభ్రమైన స్వచ్ఛమైన వాతావరణంలో లో కోచ్ బెర్త్ బెర్త్ లు లేవు వాటిని పరిశుభ్రంగా ఉంచగలిగితే ప్రయాణికులు చాలా సంతోషంగా ప్రయాణించగలదు అపరిశుభ్రమైన ఇటువంటి వాతావరణంలోనే భారతీయ రైల్వే ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు అంతేకాదు రైలులో ప్రయాణం చేసే సాధారణ టికెట్ ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్న ప్రయాణాలు కొనసాగిస్తున్నారు ప్రతి రైలు లో ఉన్నటువంటి అవసరం భారతీయ రైల్వే శాఖకు ఉన్నది ప్రజల ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచాలని ఉన్నటువంటి అవసరమున్నది వాటిపై దృష్టి పెట్టకుండా అనుభూతులు కలిగించే టువంటి తీసుకొస్తున్నామని చెప్పటం ఇది కేవలం ప్రయాణికులకు ఉపయోగపడేదే కానీ సామాన్య మధ్యతరగతి ప్రయాణికులకు ఉపయోగపడే అంశం కాదు దీనిపై కోట్ల రూపాయలను వెచ్చించి తీసుకు వస్తున్న విధంగానే ప్రస్తుతం ఉన్న రైళ్లలో సాధారణ మధ్యతరగతి ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ఈ బడ్జెట్లో సాధారణ ప్రయాణికులు ఊసేలేదు
*వ్యవసాయం మరియు గ్రామీణ రంగంపై:*
రైతులు, వ్యవసాయ కార్మికుల అవసరాలు విస్మరించబడ్డాయి. మోడీ పాలనలో, కుటుంబ ఆదాయానికి వ్యవసాయ ఆదాయం 48% నుండి 37%కి పడిపోయింది, కార్మిక వేతనం ధరలకు అనుగుణం గా పెరగ లేదు. నక్క కి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉన్నది.రైతులు,కార్మికులు, పేద ప్రజలకు పనికి రానిది 2022-23 బడ్జెట్.
👍 కార్పొరేట్ మరియు ఎఫ్‌డిఐ ఇన్వెస్టర్లలో జనాన్ని పెంచడానికి ప్రభుత్వ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్లాన్ చేయలేదు. తక్కువ శ్రమశక్తి తో లాభాలు గడించటానికి ప్రైవేతీకరణ,యాంత్రీకరణ పెరు తో పెట్టుబడుదార్లకు మద్దతుని ప్రకటించారు మోడీ ప్రభుత్వం లోని ఆర్ధిక శాఖా మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు – ఫుడ్ ప్రాసెసింగ్ కోసం, FP కంపెనీల కోసం ఫుడ్ అగ్రిగేషన్ కోసం ODOP, మెగా ఫుడ్ పార్కులు, eNAM మొదలైనవి.*
ప్రభుత్వ పరిశ్రమ లు ఉన్న వాటిని అమ్మేస్తున్నారు. కార్మిక సంక్షేమం కోసం కొత్త పరిశ్రమల ఊసే లేదు.
* కోవిడ్ సమయంలోMREGA, PDS గణాంకాలు, నిరుద్యోగులకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు తగినంత లేవు. బడ్జెట్ లో కోట్లాదిమందిగా ఉన్న యువ బారత్ కి తగిన ప్రాధాన్యత లేదు.
* ఆహార పంటల వైవిధ్యీకరణలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. పర్యావరణానికి హాని కలిగించే రసాయన కారక వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులు లో మార్పురావాలి.మనిషి ఆరోగ్యం గా,బలంగా జీవించాలి అంటే ఆహార ఉత్పత్తులు ప్రాధాన్యత పెరగాలి. ఆకలి, దారిద్య్రం లేని సమాజం కోసం బడ్జెట్ రూప్ కల్పన జరగలేదు.కార్మికులు, కూలీల జీవన ప్రమాణాలు మెరుగుదల కోసం బడ్జెట్ లో ప్రాధాన్యత లేదు. యధా మామూలు గానే ఇది కార్పొరేట్ అనుకూల బడ్జెట్. *సాగు నీరు, త్రాగునీటి ప్రాధాన్యత లేదు*
* ఇరిగేషన్ అభివృద్ధి కోసం అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత ఇవ్వలేదు.నదుల అనుసంధానం తో వ్యవసాయ సాగునీటి కి కావలసిన కాలువల ప్రస్తావనలేదు.నదుల అనుసంధానం ద్వారా పరిశ్రమ లు కి నీటి సరఫరా చేయటానికేనా? అనే అనుమానం సహజంగానే ప్రజల్లో కలుగుతుంది. ప్రజలకు సాగునీరు, త్రాగునీరు ప్రణాళికలు ని విస్మరించి నారు.
*- రసాయన రహిత సహజ సేద్యాన్ని ప్రోత్సహించడం అనేది ఒక కంటి తుడుపుచర్య. ఇది కూడా కార్పొరేట్ లు ఆక్రమిస్తారు. ఉత్పాదకత పడిపోవడం, ఎరువుల సబ్సిడీని రద్దు చేయడం.* వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తుంది.85%గా గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంది.
కోవిడ్ సంక్షోభ సమయంలో ఆహార సరఫరా మరియు ఉపాధి కల్పనను పెంచామని ప్రభుత్వం పేర్కొంది,ఆసమయంలో ఉపాధి ని కోల్పోయిన వారు దేశంలో కోట్లమంది ఉన్నారు.ప్రైవేటు రంగం లో ఉన్న ఉపాద్యాయులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పరిశ్రమల్లో పని చేసే కార్మికులు వారు 60% ఉపాధి కోల్పోయినారు.
*గ్రామీణ ఉపాధి హామీ పథకం* ఈ బడ్జెట్లో గ్రామీణ ఉపాధిహామీ పధకాన్ని 25 వేల కోట్ల కి తగ్గించబడింది. ఇది దుర్మార్గం.గ్రామీణ పేదల పొట్ట కొట్టడమే.ఇది పేద ప్రజలు ఆకలితో చంపే పధకం తో ఉన్న బడ్జెట్. ఈ విషయం MREGA, PDS గణాంకాలు పరిశీలిస్తే అర్ధమవుతుంది. 2015-16లో పీడీఎస్ ప్రజా పంపిణీ వ్యవస్థ ఆఫ్‌టేక్ 63.7 మిలియన్ టన్నులు కాగా, 2016-17లో 60.1 మి.ట. మార్చి 2020 నుండి నవంబర్ 2021 వరకు, అంటే 21 నెలల కాలంలో NFSA కింద 80 కోట్ల మంది కార్డ్ హోల్డర్‌లకు అదనంగా 60 మిలియన్ టన్నులు మాత్రమే సరఫరా చేయబడింది. ఇది 21 నెలల్లో ఒక వ్యక్తికి మొత్తం 75 కిలోలు మాత్రమే పని చేస్తుంది, అంటే కార్డ్ హోల్డర్‌కు నెలకు 3.5 కిలోలు, అంటే కేవలం 60% పెరుగుదల. Mnrega గణాంకాలు కూడా ప్రభుత్వం తప్పు అని రుజువు చేస్తున్నాయి. FY 2020లో సగటు ఉద్యోగాల తరం ఒక కార్మికునికి 34.76 రోజులు మాత్రమే మరియు FY 2021లో ఒక కార్మికునికి 27.16 రోజులు మాత్రమే, అంతకు ముందు కాలంలో ఇది ఒక వ్యక్తికి 42 రోజులు అదనంగా ఉంది.అంటే ఉపాధి అవకాశాలు తగ్గించ బడ్డాయి.
*జాతీయ ఆహార భద్రతా మిషన్*(నూనె గింజలు) కింద పంటల వైవిధ్యీకరణ మరియు నూనెగింజల ఉత్పత్తిని పెంపొందించడాన్ని బడ్జెట్ ప్రచారం చేశారన్నది స్పష్టంగా అబద్ధం. 2013-14లో నూనెగింజల మొత్తం ఉత్పత్తి 7.8 మిలియన్ టన్నులు కాగా, 2019-20లో 7.9 మిలియన్ టన్నులుగా నమోదైందని సర్వేలో తేలింది. ప్రభుత్వం పామాయిల్ ఉత్పత్తిని మాత్రమే ప్రోత్సహిస్తోంది, దీని వినియోగం కొన్ని ఆరోగ్య సంబంధిత మరియు అనేక పర్యావరణ సంబంధిత సమస్యలను కలిగి ఉంది.పర్యావరణం లేకుండా మనిషి తో పాటు జీవరాసులు మనుగడ కూడా కష్టం. కార్పొరేట్ ల లబ్ది కోసం మనిషి ప్రాణాలను కూడా ప్రమాదం లో పడేస్తూ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. ఆహార భద్రతా చట్టంFOOD SECURITY ACT వెలుగులో బడ్జెట్ లేదు అనేది స్పష్టం. ప్రజల ఆహార భద్రతను కార్పొరేట్ ల లాభాల కోసం ఫణం గా ప్రభుత్వాలు పెడుతున్నాయి.వారి ప్రయోజనం కోసమే బడ్జెట్.
గత రెండు సంవత్సరాల్లో కోవిడ్ సమయంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మంచి పనితీరు 3.6 మరియు 3.9%గా ఉందని సర్వే మరియు బడ్జెట్ ప్రశంసించాయి, గత 5 సంవత్సరాలలో పశువులు మరియు మత్స్య సంపద సంవత్సరానికి సగటున 8.15% వృద్ధి చెందింది. భారత CACP అంచనా ప్రకారం 22 పంటలకు సగటు ఉత్పత్తి వ్యయం కంటే 1.5 రెట్లు MSP చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పిడిఎస్ ఆహార నిల్వల కోసం కిలో బియ్యం రూ. 43 మరియు గోధుమలకు కిలోకు రూ. 30 చొప్పున భారీగా చెల్లించాల్సి వచ్చిందని, ఇది పిడిఎస్‌ను మూసివేయాలనే దాని నిర్ణయాన్ని సూచిస్తోంది. డిబిటి బదిలీలకు మారుతున్నట్లు బడ్జెట్ ప్రకటించింది.
*సెజ్ లకు మద్దతు*
ప్రత్యేక హబ్‌ల ద్వారా మరింత యాంత్రీకరణను ప్రోత్సహిస్తామని వారు పేర్కొన్నారు. అంటే ఒరిస్సా లోని దింకీయా ఏరియాలో 7 వేల ఎకరాలు ఎకనామిక్ కారిడార్ సెజ్ కి లు వ్యవసాయ భూములు ని జిందాల్, పోస్కోఇచ్చి ప్రోత్సహించినట్లు., ప్రోత్సహించడం జరుగుతుంది. అది కూడా రైతుల భూములను కబ్జా చేయటం కోసమే. ఆంద్రప్రదేశ్ లో FPOలు మరియు e-NAM మరియు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్, మెగా ఫుడ్ పార్కులు, ఆధునిక ల్యాబ్‌లు మొదలైన వాటి ద్వారా మార్కెటింగ్ ప్రచారం చేయబడుతుంది. ODOP అనేది ఉత్పత్తి స్పెషలైజేషన్ మరియు స్థానిక వ్యవసాయ వాణిజ్యానికి సహాయం చేయడం పేరుతో ప్రచారం చేయబడుతుంది, అయితే వాస్తవానికి ఇది ముడిసరుకు కార్పొరేట్ ఫుడ్ ప్రాసెసర్ల కోసం సముదాయం.ఇది కార్పొరేట్ లకు ఉపయోగ పడేది.
*వ్యవసాయ ఉత్పాదకత పడిపోతుంది*
ఉత్పాదకత పడిపోతుందని ఇప్పటివరకు అన్ని ప్రయత్నాలు రుజువు చేసినప్పటికీ ప్రభుత్వం కూడా సహజ రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది అని చెపుతుంది.కానీ ఈ నష్టం కారణంగా రైతు ని ఆడుకోవటానికి రైతులకు పరిహారం సహాయం కోసం బడ్జెట్ లోఎటువంటి కేటాయింపులు లేవు.
బడ్జెట్ యాంత్రికంగా DFI నెరవేరుతుందని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుందని పేర్కొంది. అయితే వీటిలో ఏ ఒక్కదానికి కూడా నేరుగా రైతులకు ఆర్థిక సాయం చేసే పథకం లేదు.ఆచరణ కార్పొరేట్ లను తృప్తి పరచటానికి లో కార్పొరేట్ లకు ఉపయోగకరమైన 3 రైతు చట్టాలు కి అనుగుణంగా బడ్జెట్ లో ప్రతిపాదనలు కనిపిస్తున్నవి.
*ఇరిగేషన్*
నికర నీటిపారుదల ప్రాంతం ఇప్పటికీ నికర విత్తన విస్తీర్ణంలో 49% ఉంది మరియు సూక్ష్మ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించడమే ఏకైక ప్రణాళిక అని ప్రభుత్వం చెపుతుంది ఇవి రెండూ మూలధనంతో కూడుకున్నవి మరియు పనిచేయడానికి అధిక కార్మికులు అవసరం. వీటిని ఏర్పాటు చేయటానికి బడ్జెట్ కేటాయింపులు లేవు.
గ్రామీణ ప్రాంతాలకు డెయిరీ మరియు ఫిషరీస్ గ్రోత్ ఇంజన్‌లుగా ఉన్నాయి, అయితే ఈ రంగాల నుండి మంచి ఆదాయాన్ని పొందేందుకు రైతులకు సహాయపడే ప్రతిపాదన మళ్లీ లేదు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఒక భావి వృద్ధి రంగంగా గుర్తించబడింది, ఇందు లో 13% కంటే ఎక్కువ మంది సంఘటిత కార్మికులు మరియు మరో 51 లక్షల మంది అసంఘటిత కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా ఎఫ్‌డిఐని ప్రోత్సహించడం గురించి మాట్లాడుతుంది, గత 7 సంవత్సరాలలో ఈ రంగం ఇప్పటికే 4990 మిలియన్ డాలర్లను ఆకర్షించిందని ప్రగల్భాలు పలుకుతోంది. FDI ల వలన భారత ఆర్థిక రంగం మెరుగు పడుతుంది అనే వాదన ఆచరణ లో అటకెక్కింది. పలువురు ఆర్థిక ప్రముఖులు హెచ్చరిస్తున్న విషయం కూడా లెక్క చేయటం లేదు. వారికి ఊడిగం చేయటమే లక్ష్యం గా పెట్టుకున్నారు. ఇదేమి దేశభక్తి అర్ధం కావటం లేదు.మాటల్లో దేశ భక్తి. చేతల్లో విదేశి భక్తి.
అంతిమంగా వారు వృద్ధికి ఇంజన్‌లుగా పెట్టుబడులు లేకపోవడాన్ని నిందించారు. మరియు 'వ్యవసాయ విలువ వ్యవస్థతో పాటు సముచితమైన పాలసీ ఫ్రేమ్‌వర్క్ మరియు ప్రభుత్వ పెట్టుబడిని పెంచడం ద్వారా ప్రైవేట్ కార్పొరేట్ రంగం రద్దీగా ఉండాలి' అని ప్రతిపాదిస్తున్నారు. వ్యవసాయ విలువ వ్యవస్థ వృద్ధికి సహాయపడటానికి కార్పొరేట్లు, భారతీయ మరియు FDIలను ఆహ్వానించడానికి ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని దీని అర్థం. 3 వ్యవసాయ చట్టాలు చేస్తున్నది ఇదే. ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు లేదు. మరొక విషయం ఏమిటంటే, వ్యవసాయానికి క్రెడిట్ అవుట్ ఫ్లో ఇప్పుడు రూ. 15.75 లక్షల కోట్లకు పైగా ఉంది, అంటే మూలధన వస్తువులను కొనుగోలు చేయడానికి రైతులపై ఎక్కువ అప్పులు ఉన్నాయి. రైతులు మరింత అప్పులు పాలు అవుతారు.
మోదీ హయాంలో వ్యవసాయం ఎలా నష్టపోయిందో ఎకనామిక్ సర్వే కొంత అవగాహన కల్పిస్తుంది. ఈ గణాంకాలు అన్ని మేము స్వంతంగా చెప్పుతున్నవి కాదు. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ఆధారంగా ఎకనామిక్ సర్వే తెలుపు తున్నవి.
*మాట తప్పిన మోడీ ప్రభుత్వం:*
పార్లమెంటు లో2020 బడ్జెట్ సమావేశాలు లో ఆర్ధికమంత్రి వర్యులు శ్రీమతి నిర్మల సీతారామన్ గారు ప్రకటన ను ఒకసారి చూద్దాం.
*' ప్రజలకు మంచి ఆదాయం అందించే ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండాలి వ్యాపారాలు సవ్యంగా సాగాలి .ఆదివాసీలు, దళితులు మైనార్టీలు మహిళలు వృద్ధులు బాలబాలికలు, యువత, కార్మికులు, కర్షకులు అందరికీ వెన్నుదన్నుగా నిలవాలి. మొత్తం గా భారతీయుల జీవన ప్రమాణాలను మెరుగు పరచాలి. 2020 బడ్జెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మల సీతారామన్ గారి ఉపన్యాసం.* మరి గడచిన రెండు సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎవరికి వెన్నుదన్నుగా ఉన్నదో మనకు చాలా స్పష్టంగా తెలుసు. ఢిల్లీ సరిహద్దుల్లో తమ హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేసిన రైతాంగాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. మూడు చెరువుల నీళ్ళు తాగించారు.వందల మంది రైతులు5 మరణానికి కారణమైనారు. కార్మికులకు లేబర్ కోడ్ ల పేరుతో జీవన ప్రమాణాలు దిగజార్చినారు. ఆదివాసీలకు అడవి పైన పూర్తి హక్కులు లేకుండా చేశారు. సమాజంలో మనువాదులు ఎస్సీ ఎస్టీలు జీవించే హక్కులు ని కాల రాశారు. అత్యంత నీచంగా వారిపై దాడులు హత్యలు చేయడం జరిగింది. వారి అభివృద్ధికి ఏ మేరకు ప్రభుత్వం ఆర్ధిక చేయూత ఇచ్చిందో అందరికీ బాహాటంగానే తెలుసు. మహిళలు రెండో తరగతి పౌరులుగా ఉండాలనే మనువాడ భావనను దేశవ్యాప్తంగా అందించారు. బాల బాలికలకు రక్షణ లేని పరిస్థితి. వృద్ధులు మహిళలు బతకలేని పరిస్థితి. కోవిడ్ కాలంలో యావత్ భారతీయ సమాజం అనేక కష్టాలను నష్టాలను చవిచూసింది. ఈ పరిస్థితులను చక్కదిద్ది బడ్జెట్లో ప్రజలకు అండగా వెన్నుదన్నుగా నిలబడతారని ప్రజలు ఎదురు చూశారు. కానీ రిక్తహస్తమే మిగిలింది. 2020 బడ్జెట్ లో ప్రకటన లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం చేరుకోవడంలో విఫలమైనది. ప్రజలకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి ప్రకటన హామీలను, మాటను కేంద్ర ప్రభుత్వం లోని ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీమతి నిర్మల సీతారామన్ గారు నిలబెట్టుకోలేక పోయారు. ప్రజల సేవ ని మరచి కార్పొరేట్ల సేవలో తరించి పోతున్నారు.వారి అడుగులకు మోడీ ప్రభుత్వం మడు గులు ఎత్తుతున్నారు. ఇది భారతీయ సమాజానికి తీవ్ర ప్రమాదకరం. తీవ్ర నష్టం. ప్రజల ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ నిర్ణయం వారి విధానం ఏ మాత్రం ఉపయోగపడదు.
*సంపన్నుల పై పన్నులు వేయకపోవడం సమాజ అభివృద్ధికి విఘాతం;*
ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెడుతూ కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొత్త పన్ను లు ఏవి వేయవద్దని తెలిపారని తెలియజేశారు ప్రజలపై కొత్త పన్నులు మోడీ గారు వేయవద్దని ఆదేశించినట్లు ప్రకటించారు సరే సామాన్యులపై పన్ను వేయవద్దు సంతోషం. అసలుపేద, మద్య తరగతిక, సామాన్యులపై పన్ను లు ఎవరు వేయమన్నారు? పన్ను సంపన్నుల పైన వేస్తారు లాభాలు ఆర్జించే ధనిక వర్గం పైన, కార్పొరేట్ లపైన, సంపన్నుల పైన టాక్స్ లు వేయక పోవడం అంటే అది ఎవరికి ఉపయోగపడుతుంది. ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది ఇది పేదలను మోసం చేయటం కాదా ? ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ఎగ్గొట్టి కార్పొరేట్ లకు ఉపయోగ పడటమే. అవుతుంది.ప్రజల పైన పన్నులు వద్దు. కార్పొరేట్ సంపన్నుల ఆస్తులు జప్తి చేసి సంపద సృష్టి కర్తలు అయిన కష్ట జీవులకు పంచండి. ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టండి. ప్రజల మధ్య ఆర్ధిక అసమానతలు రూపు మాపటానికి తీసుకునే చర్యలు లో ఇదొకటి గా ప్రభుత్వం గుర్తించాలి.
*రక్షణ రంగం బడ్జెట్;*
బడ్జెట్ లో రక్షణ శాఖ కు 2022-23 సంవత్సరం కి రూ 5,25,166 కోట్ల కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రత్యేకించి కేటాయించింది ఇది స్థూల జాతీయోత్పత్తి జిడిపిలో 2శాతం గా ఉంది. గత బడ్జెట్ లో చేసిన కేటాయింపు 4.7 లక్షల కోట్ల కన్నా ఇది 9 8 శాతం అధికం. స్వదేశీ సంస్థల అ నుంచి ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు గొప్ప ప్రాధాన్యత ఇచ్చారు రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రైవేటు సంస్థలకు చోటు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. రక్షణ కేటాయింపుల్లో పెట్టుబడి 15 23 69 కోట్లు కేటాయించారు సమకూర్చుకునేందుకు గత బడ్జెట్ తో అంచనాల తో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. ఇది ప్రజల పై అధిక భారమే అవుతుంది.
*అప్రజాస్వామిక బడ్జెట్*
2014 మరియు 2021 మధ్యకాలంలో, SAS (NSSO యొక్క సిట్యుయేషనల్ అసెస్‌మెంట్) ప్రకారం నికర ఆదాయంలో వ్యవసాయం యొక్క సహకారం 48% నుండి 37%కి తగ్గింది. ప్రభుత్వాల పాలసీ వలన తగ్గింది. అయితే కార్మికుల నుండి వచ్చే ఆదాయం 32% నుండి 40%కి పెరిగింది. కానీ కార్మికులు వేతనాలలో పెరుగుదల లేదు. కోవిడ్ సమయం లో వలస కార్మికులు ని, అసంఘటిత రంగ కార్మికులు ని భవన నిర్మాణ రంగం,సిమెంట్, ఇసుక,తాపీ,కార్పెంటర్,ఏలెక్ట్రికల్,వెల్డింగ్, వడ్రంగి తదితర కార్మికుల ను ఆదుకోలేదు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు, ప్రైవేట్ ఉపాద్యాయులు బాధలు వర్ణనాతీతం. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కోవిడ్ కారణాలు చూపి చాలా చోట్ల యాజమాన్యాలు జీతాలలో కో త విధించారు. కొన్నిచోట్ల అసలు జీతాలే ఇవ్వలేదు. ఇంకొన్ని చోట్ల ఉద్యోగుల ను, కార్మికులు ని విధుల నుండి తొలగించారు.వీరు దేశవ్యాప్తంగా కోట్ల లో ఉన్నారు. వీరికి తిరిగి ఉపాధి కల్పించటానికి బడ్జెట్లో ఏ విధమైన ప్రణాళికలు లేవు. ఈ బడ్జెట్ వల్ల దేశం లో పేదలు ఆకలి,అనారోగ్యం దారిద్ర్యం మరింత పెరుగుతుంది. ధనవంతులు మరింత ధనవంతులు గా పెరుగుతారు. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 21,14 కి విరుద్ధమైన బడ్జెట్.ప్రజలు జీవించే హక్కులకు,సమానత్వ సాధనకు విరుద్ధం. ప్రజల మధ్య అసమానతలు మెండు గా పెంచి,సామాన్య,మధ్య తరగతి ప్రజలను దారిద్య్రంలో కి నెట్టే అప్రజాస్వామిక బడ్జెట్ ఇది.
-- నంబూరి. .శ్రీమన్నారాయణ. హైకోర్టున్యాయవాది. రాష్ట్ర ఉపాధ్యక్షులు.
పౌర హక్కుల సంఘం CLC.
01. 02.2022. 02.01.2022
Comments
Post a Comment