సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి | సి ఎల్ సి


       అయినప్పటికీ ప్రభుత్వాలు అమలు చేయకుండా తాత్సారం చేయడం భారత న్యాయ వ్యవస్థను కించపరచడమే. కాంట్రాక్ట్ లెక్చరర్,ఉపాద్యాయులు ఉద్యోగులు అందరికీ కూడా "సమాన పనికి సమాన వేతనం "తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. రైట్ టు ఈక్వాలిటీ article (14),భారత రాజ్యాంగంలో అందరికీ సమానత్వ ప్రాతిపదికన జీవించే హక్కును ఆర్టికల్ 21ని పొందిపర్చబడినది. ఈ సందర్భంగా ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాము. ఆర్టికల్ 21,14 లను ప్రభుత్వాలు విస్మరించడం వాటి వెలుగులో పనిచేయకపోవడం అత్యంత చట్ట వ్యతిరేకమైన చర్య.

         మేము ప్రభుత్వాలకు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగుల సమ్మెకు పూర్తిస్థాయి మద్దతు సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగులందరూ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపు ఇస్తున్నాము. .

             వివిధ సందర్భాలలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను అమలు చేయకపోతే అత్యున్నత న్యాయస్థానంలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తరఫున హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులను ఫైల్ చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఆ పరిస్థితులు రాకుండా ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం Equal Work-Equal Pay అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.              

ఇట్లు 
పౌరహక్కుల సంఘం CLC
రాష్ట్ర ఉపాధ్యక్షులు
 ఏపీ హైకోర్టు న్యాయవాది

Comments