BBI ఇటుక బట్టి యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి | ప్రజా సంఘాలు

*BBI ఇటుక బట్టి యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి* . 

పెద్దపల్లి జిల్లా మరియు మండలం గౌరెడ్డి పేట గ్రామం లోని BBI ఇటుక బట్టిలో తేదీ 03-03-2022రోజున ఒరిస్సా యువతి కీరాబాటి నియర్ వయస్సు( 37) పై అందులో పనిచేసే సూపర్వైజర్ లు అత్యాచారం చేసిన ఘటనలో దోషులను వెంటనే శిక్షించాలి, ఇట్టి ఘటనను తెలిసిన కూడా అడ్డుకొని యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. దాడులకు, అత్యాచారం కు గురైన మహిళలు సుశాంత్ పానిగ్రహ హ్యూమన్ రైట్స్ ఫోరమ్ (HRF)గారికి వీడియో ల ద్వారా తెల్పితే వారు పెద్దపల్లి జిల్లా వివిధ అధికారులకు ట్విట్టర్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇట్టి ఘటన పై పౌరహక్కుల సంఘం (CLC)తెలంగాణ ప్రజా ఫ్రంట్ (TPF)దళిత లైబరేషన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిజానిర్ధారణ చేయడం జరిగింది.దీంట్లో అత్యాచారం జరిగింది అని సఖి కేంద్రం లో స్టేట్మెంట్ లో ఉన్నా కూడా ఏమి జరగలేదని స్థానిక MRO, కార్మిక శాఖ, పోలీస్ శాఖ లు చెబుతున్నాయీ.

జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇటుక బట్టిలల్లో నిత్యం ప్రమాదాలు, హత్యలు, మహిళలు, యువతులపై అత్యాచారాలు జరుగుతున్న కలెక్టర్ గాని సంబంధిత అధికారులు పట్టించుకొకపోవడం దారుణం. గతంలో ఇటుక బత్తిలాల్లో జరిగిన అత్యాచారాలపై హైకోర్టు లో కేసులు వేసిన, సుప్రీం కోర్టు సుమోటా కేసు తీసుకొని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసు ఇచ్చిన కూడా ఏలాంటి స్పందన లేకపోవడం దారుణమైన విషయం.ఇప్పటికైనా గౌరేద్ధిపేట లోని BBI ఇటుక బట్టి యాజమాన్యం పై చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించాలని, జిల్లా వ్యాప్తంగా ఇటుక బట్టీలలో జరుగుతున్న ఆకృత్యాలపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి చే సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

1)GAV ప్రసాద్, జిల్లా అధ్యక్షులు, పౌరహక్కుల సంఘం 2)పుల్ల సూచరిత, జిల్లా సహాయ కార్యదర్శి 3)నారా వినోద్, కోశాధికారి, పౌర హక్కుల సంఘం 4)మోటాపలుకుల వెంకట్, పార్వతాలు, EC మొంబర్స్ 5) గుమ్మడి కొమురయ్య, జిల్లా కన్వీనర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్, పెద్దపల్లి 6)గాండ్ల మల్లేశం, 7)కె. రాజు జిల్లా కమిటీ సభ్యులు,ప్రజా ఫ్రంట్ 8)మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ ఫ్రంట్,9)రామిళ్ల బాపు

Comments