సింగరేణి కార్మికుల మృతికి ప్రభుత్వానిదే బాధ్యత!

సింగరేణి అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టుబొగ్గుగని సైడ్ రూఫ్ కూలిన ప్రమాదంలో,ఇద్దరు  అధికారులు మరియు VTC ట్రైనీ మరణానికి సింగరేణి యజమాన్యమే బాధ్యత వహించాలి... పౌర హక్కుల సంఘం తెలంగాణ......

సింగరేణి అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టుబొగ్గు గని కార్మికుల మృతిపై పౌర హక్కుల సంఘం తెలంగాణ ,11 మార్చ్ 2022 శుక్రవారం రోజున నిజానిర్దారణ....
############################
సింగరేణి కాలరీస్ కంపనీ లిమిటెడ్(ప్రభుత్వ రంగ సంస్థ),పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం,రామగుండం డివిజన్ 3 పరిధి లోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు లో  కార్మికులపై  7 మార్చ్,2022 సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు   బొగ్గు సైడ్ మరియు పైకప్పుకూలడంతో ఏడుగురు గల్లంతైన ఘటనలో, సింగరేణి రెస్క్యూ టీం నలుగురిని కూలిన బొగ్గు శిథిలాలనుంచి కాపాడినారు.ఇద్దరు అధికారులు ఒక VTC ట్రైనీ కార్మికుడు మృతిచెందారు. ఈ సంఘటన పై పౌర హక్కుల సంఘం తెలంగాణ,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ మరియు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో 11 మార్చ్,2022 శుక్రవారం ఉదయం 10:00 గంటలకు ALP కాలరీ మేనేజర్,బ్రహ్మాజీ మరియు అడ్రియాల ప్రాజెక్టు ఏరియా,SO to GM బైద్య,ALP కార్మికులను,సింగరేణి కార్మిక సంఘ నాయకులను కలిసి సేకరించిన నిజనిర్దారణ వివరాలు....
పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం,రామగుండం డివిజన్ 3 పరిధి లోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు గనిలో సోమవారం,7 మార్చ్,2022 మొదటి షిఫ్టులో విధులు నిర్వహించేందుకు కార్మికులు 1 సీమ్,86 లెవల్ RA 3 పని స్థలం వద్ద సైడ్ రూఫ్ కూల కుండా రక్షణ పనులు చేపట్టేందుకు  రామగుండం డివిజన్-3,ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ ల పర్యవేక్షణలో, బదిలీ వర్కర్ రవిందర్, FBL(ఫ్రంట్ బకెట్ లోడర్) ఆపరేటర్ వెంకటేశ్వర్లు,ఓవర్ మాన్ నవీన్, సపోర్టుమెన్ వీరయ్య, VTC ట్రైనీ తోట శ్రీకాంత్ వెళ్లినారు.అక్కడి పని క్రిటికల్ గా ఉందని ALP మేనేజర్ బ్రహ్మాజీ ప్రత్యేకంగా ఉన్నాడు., అక్కడ మరికొంత మంది కార్మికులు ఉన్నారు.మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయం లో పనిచేస్తున్న స్థలంలో అనూహ్య మైన శబ్దాలు రావటం తో కాలరీ మేనేజర్ గమనించి కార్మికులను  అప్రమత్తం చేసి తను కూడా పరుగెత్తిన రెప్పపాటు సమయంలోనే, అక్కడి సైడ్ వాల్ భారీ శబ్దంతో  30 మీటర్ల పొడవు,3 మీటర్ల ఎత్తు మరియు 5 మీటర్ల మందం తో బొగ్గు కూలి పడ్డది.కాలరీ మేనేజర్ బ్రహ్మాజీ హెచ్చరికలతో సపోర్ట్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న వీరయ్య, మధు, శశి(బదిలీ వర్కర్లు) ఘటన స్థలం నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు.కూలిన బొగ్గు పెళ్లల కింద సపోర్ట్ మెన్ రవిందర్,రామగుండం డివిజన్-3,ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, FBL(ఫ్రంట్ బకెట్ లోడర్) ఆపరేటర్ వెంకటేశ్వర్లు,ఓవర్ మాన్ నవీన్,VTC ట్రైనీ తోట శ్రీకాంత్ ఉన్నారని తెలుసుకున్న వెంటనే ,మేనేజ్మెంట్ సింగరేణి రెస్క్యూ సిబ్బంది ని ప్రమాద స్థలానికి దింపి సహాయక చర్యలతో అదేరోజు సాయంత్రం ఆరు గంటలకు FBL కేబిన్ లో చిక్కుకున్న ఆపరేటర్ జాడి వెంకటేష్ హార్న్ మోగిస్తే గుర్తించి బొగ్గును తోడి, వెంకటేష్ ను ప్రాణాలతో బయటకు తీసినారు. FBL దగ్గర చిక్కుకున్న ఓవర్మన్ నవీన్ ను అదే రోజు రాత్రి సుమారు పన్నెండు గంటలకు బయటకు తీసుకుని వచ్చారు. మిగిలిన వారిని వెలికితీసే సమయంలో మంగళవారం ఉదయం అరుపులు చేసిన రవిందర్ ను మధ్యాహ్నం మూడున్నర గంటలకు బయటకి తీసినారు.  ASO జయరాజ్  గట్టిగా పారిపొమ్మని అరవడం తో కొద్ది దూరం పరిగెత్తడం వల్ల బొగ్గుపెళ్లలో ఉన్నానని అందుకే రెస్క్యూ బృందం తనను చేతులతో బొగ్గుతోడి తీసినారని రవిందర్ అన్నాడు..మిగతా ముగ్గురు, ASO జయరాజ్, చైతన్య తేజ మరియు VTC ట్రైనీ శ్రీకాంత్ బొగ్గు శిథిలాల కిందనే మృత్యువాత పడ్డారు. 8 మార్చ్ ,2022 మంగళవారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు చైతన్య తేజ, అర్ధరాత్రి ఒంటిగంటకు జయరాజ్ మరియు  9 మార్చ్ 2022,బుధవారం ఉదయం VTC ట్రైనీ శ్రీకాంత్ మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి.

ఆసియా ఖండంలోనే అత్యంత టెక్నాలజీ కలిగిన  ఈ ALP గనిని 2008 లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. 
ప్రస్తుతం ALP గనిలో 1400 పర్మనెంట్నె మరియు 600 ప్రైవేట్ కార్మికులు పనిచేస్తున్నారు. మైనింగ్ చట్టం ప్రకారం VTC ట్రైనీ కార్మికులతో పనులు చేయించరాదు. దానికి విరుద్ధంగా తోట శ్రీకాంత్ ను ఆరోజు గనిలోకి  ఫిట్టర్ హెల్పర్ గా నియమించడం, మేనేజ్మెంట్ విచ్చలవిడిగా కాంట్రాక్టు కార్మికులతో తక్కువ వేతనాలు ఇచ్చి పనులు చెయించుకొన్న అనవాయితిలోనిదే,  శ్రీకాంత్ ను VTC ఆఖరిరోజులో కూడా గనిలోకి పంపి విధులు నిర్వహించే టట్లు చేసినారు. ప్రైవేట్ సంస్థ GMMCO నిర్వహిస్తున్న  నాసి రకం ,రక్షణ లేమి పని వలన, సైడ్ వాల్ కూలడంతో అధికారులైన జయరాజ్ మరియు తేజ లు ,తోట శ్రీకాంత్ మృతువాట పడ్డారు.సింగరేణి సంస్థ స్వంత పనిలో, సింగరేణి కార్మికులు బొగ్గు వెలికి తీసిన సందర్భం లో కూడా ఇటువంటి సైడ్ వాల్  కూలిన ప్రమాదాలు జరిగిన దాఖలాలు లేవు. సింగరేణి సంస్థ కార్మికులు తమ రక్షణను పరిగణలోకి తీసుకుంటూ పనిలో నిమగ్నమౌతారు. ALP లోని ప్రైవేట్ సంస్థ ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వడం విస్మరించి అధికోత్పత్తి రక్షణ లేకుండా లాభాల వేటలో పడటం వలన ఈ ఘటన జరిగింది. ప్రైవేట్ కంపెనీ లాభాల కోసం సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ యాజమాన్యం కావలసిన సహకారం అందిస్తుంది. ప్రైవేటీకరణ పెరుగుతూ ఉంటే కార్మికుల ప్రాణాలకు విలువ తగ్గడం ఒక స్వభావంగా మారుతుంది...

ఈ సైడ్ వాల్ కూలి ప్రమాదం జరగడానికి 15 రోజుల ముందే ఈ జంక్షన్ లో పై భాగం కూలిపోయింది. ఇది పెద్ద ప్రమాదానికి సంకేతం. దాన్ని శాస్త్రీయ పద్ధతి లో నిలువరించి సరిచేయడంలో మేనేజ్మెంట్ నిర్లక్యం వహించింది. దానికి సమీపంలో సైడ్ వాల్ కూలిపోవడాన్ని రక్షణ యంత్రాంగం కనిపెట్టకపోవడం మేనేజ్మెంట్ వైఫల్యం చెందింది. సింగరేణి బొగ్గు గనుల్లో ప్రైవేటీకరణ ఔట్ సోర్సింగ్ వేగవంతం అవడంతో మేనేజ్మెంట్ దృక్పథంలో మార్పు రావడం వలన ఈ ఘటనలకు దారితీసింది. 2014లో తెలంగాణ రాష్ట్రంలో, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత, జనవరి 2015 నుండి సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యత తీసుకున్నాడు. కేసీఆర్ వలన రాజకీయ జోక్యం సింగరేణిలో పెరిగింది. సీఎండీ శ్రీధర్ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను భారీగా పెంచుతూ రోజువారీ టార్గెట్లతో డైరెక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్ లకు ఆదేశాలు జారిచేస్తూన్నాడు. టాప్ మేనేజ్మెంట్ నుండి మైన్ మేనేజ్మెంట్ ద్వారా supervisor లు మరియు కార్మికులపై పని భారం పెంచుతూ తీవ్రమైన మానసిక ఆందోళనలతో సింగరేణి కార్మికులు అధికారులు పనులు చేస్తున్నారు. దీనికి తోడు గుర్తింపు సంఘంగా TRS పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం  అధికారం చేలాయిస్తూ కార్మికుల సంక్షేమం పట్టించుకోకుండా, సేఫ్టీ పిట్ ఏరియా డివిజన్ ,సేఫ్టీ సమావేశం నిర్వహించకుండా ఆ యూనియన్ నాయకులు, కొందరు పైరవీకారులుగా మారి, లైట్ జాబులకు అవినీతికి కేర్ ఆఫ్ గామారారు.. CMD శ్రీధర్,కేసీఆర్ కనుసన్నల్లోనే సింగరేణి సంస్థకు చెందిన  కార్మికుల కష్టార్జితాన్ని తెలంగాణ MLAలు MPలకు డెవలప్ మెంట్ ఫండ్, CSR ఫండ్ పేరున సీసీ కెమెరాల కొనుగోలుకు సింగరేణి సొమ్మును దారదత్తం చేస్తున్నాడు.వేల కోట్ల సింగరేణి కార్మికుల సొమ్మును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మల్లిస్తున్నాడు. బోర్డర్లో దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికునివలె సింగరేణి కార్మికులు పనిచేస్తూ ఈ అప్రకటిత కర్ఫ్యూ లాంటి భయానక వాతావరణంలో కార్మికులు బొగ్గు ఉత్పత్తి కై శ్రమిస్తున్నారు..కేవలం రక్షణను పేపర్ కు పరిమితం చేసి  గ్రౌండ్ లెవెల్లో చిత్త శుద్దిగా మేనేజ్మెంట్ పనిచేయడం లేదు.ప్రశ్నించే కార్మికుల గొంతును అణిచివేస్తూ ఒక నియంత లాగా వ్యవరిస్తున్నాడు. CMD శ్రీధర్ వైఖరితోనే పని ఒత్తిడి, పనిభారం పెరిగిపోతున్న నేపథ్యంలోనిదే ఈ ALP సైడ్ వాల్  ప్రమాదం.CMD శ్రీధర్ తన ఏడుసంవత్సరాల రెండు నెలల  కాలంలో దాదాపు 65 మంది కార్మికులు రక్షణ కొరవడి మరణించారు. సీఎండీ శ్రీధర్ గని కార్మిక మృతుల కుటుంబాలను పరామర్శించకపోవడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తున్నది....

# ALP కార్మికుల మరణానికి మేనేజ్మెంట్ బాధ్యత వహించాలి.
# సింగరేణి మరియు ALP లో ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలి. ..
# జయరాజు, చైతన్య లతో సమానంగా తోట శ్రీకాంత్ మరణాన్ని భావించి వీరి కుటుంబానికి ఒక కోటి రూపాయల నష్టపరిహారం మరియు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి..
# మేనేజ్మెంట్ నిర్లక్ష్య వైఖరి విడనాడి, చిత్తశుద్దితో సేఫ్టీ సమావేశాలు నిర్వహించాలి. 
#సంస్థలో కార్మికుల రక్షణకు అవసరమైన చర్యలను చేపట్టాలి.
# . తెలంగాణ రాష్ట్రా ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు CMD శ్రీధర్, ALP మృతుల కుటుంబాలను పరామర్శించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది...

నిజనిర్ధారణలో పాల్గొన్న వారు....
 1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం,తెలంగాణ.
2.N.నారాయణరావు,ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం,తెలంగాణ.
3.మాదన కుమారస్వామి, సహాయకార్యదర్శి, పౌర హక్కుల సంఘం,తెలంగాణ.
4..GAV ప్రసాద్,అధ్యక్షుడు, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
5.శ్రీపతి రాజగోపాల్, ఉపాధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
6.పుల్ల సుచరిత, సహాయకార్యదర్శి,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
7.నార వినోద్, కోశాధికారి,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
8.యాదవనేని పర్వతాలు,EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
9.పోగుల రాజేశం,EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
10.కడ రాజన్న,EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
11.బొడ్డుపెళ్లి రవి,EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
12..మోటపలుకుల వెంకట్,EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
13.గడ్డం సంజీవ్, EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
14.బుద్దె సత్యం,కన్వీనర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ.
15.A. సారయ్య,కో కన్వీనర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ.
16.J.పొశం,కో కన్వీనర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ.

11 మార్చ్,2022,శుక్రవారం.3:45 pm.
అడ్రియాల ప్రాజెక్ట్, రామగిరి మండలం, పెద్దపెల్లి-జిల్లా.తెలంగాణ-రాష్ట్రం.

Comments