ఉద్యోగులకు "ద్రోహం" చేసిన "ఒప్పందం" | సి ఎల్ సి

Press note విజయవాడ 06.02.2022.  

 ఉద్యోగ మిత్రులారా!

  Prc ఉద్యమ నాయకత్వానికి, Ap ప్రభుత్వం కి కుదిరిన ఒప్పందం ప్రభుత్వం ఉద్యోగుల కు "ద్రోహం" చేసిన "ఒప్పందం".గా పరిగనిస్తున్నాము. పౌర హక్కుల సంఘం తీవ్రంగా నిరసిస్తుంది. వ్యతిరేకిస్తోంది. ఉద్యోగులు తమ పోరాటం కొనసాగించాలని పిలుపు ఇస్తుంది. పోరాటానికి సిద్దమవుతున్న ఉపాధ్యాయ,ఉద్యోగ సంఘాలు కి మద్దతుని తెలియ చేస్తుంది. 
                                                                                      ఉద్యోగ,ఉపాధ్యాయ కార్మిక, పెన్షనర్ల ఆందోళన ఫలితం గా ప్రభుత్వం దిగివచ్చి3,4 ఫిబ్రవరి2022 తేదీలలో ఉద్యోగ సంఘాల తో చర్చలు జరిపింది . విజయవాడ నడిబొడ్డున ఉద్యోగులు చారిత్రాత్మకమైన మహా ప్రదర్శన చేసిన తర్వాత కూడా డిమాండ్లను సాధించుకోవడంలో విఫలమయ్యారు. చర్చలు సఫలం అని ప్రకటన వస్తోంది ప్రభుత్వం సఫలమైంది ఉద్యోగులు విఫలమయ్యారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం equal work, equal pay ని సాధించుకొనలేక పోయారు. 

1.ఉద్యోగుల డిమాండ్లలో మొదటి డిమాండ్ అయిన ఫిట్మెంట్ కనీసం 27 శాతాన్ని సాధించుకోలేదు.

2ఆశుతోష్ మిశ్రా కమిటీ సిపార్స్ పదకొండవ పిఆర్సి కమిషన్ రిపోర్టు కూడా పూర్తిగా చూడలేకపోయారు. చర్చల లో ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత అప్రజాస్వామికం గా ప్రవర్తించినది.

3 ఉద్యోగుల దీర్ఘకాలిక పోరాటం లో ప్రధాన డిమాండ్ అయిన సి పి ఎస్ రద్దు సాధించ లేదు. దీనిపై చర్చ జరగక పోవడం బాధాకరం.

4. హెచ్ ఆర్ ఎ స్లాబులు రేట్లు పునరుద్ధరించు కోలేక పోయారు.ఉన్న హక్కులను కాపాడుకోలేక పోయారు.

5. వృద్ధులకు ఎంతో ఆసరాగా ఉండే పాత ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పునరుద్ధరించు కోలేక పోయారు

6. సి సి ఏ పైన చర్చ లేదు.ఎందుకు ఇలా చేశారు అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

7. హెచ్ ఆర్ ఏ విషయం లో గ్రామీణ ప్రాంత ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగింది.ఇది ఉద్యోగి బరించరానిది.

8. ఐ ఆర్ ఇచ్చిన తేదీ నుండి మానిటరీ బెనిఫిట్ఇవ్వాలనే డిమాండ్ పై చర్చ చేపట్టలేదు.

9.కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు.సమాన పనికి సమాన వేతనం అనే రాజ్యాంగ, చట్టబద్ద హక్కుని సాధించ లేదు. సుప్రీంకోర్టు అనేక తీర్పులలో సమాన పనికి సమాన వేతనం ఇ వ్వాలని అనేక తీర్పులలో చెపుతున్న ప్రభుత్వాలు అమలు చేయటం లేదు. పోరాటాల ద్వారా నే అమలు చేయించు కోవాలి. ప్రభుత్వం తో ఉద్యోగ సంఘాలు చేసుకున్న ఒప్పందం ఉద్యోగుల కు "ద్రోహం" చేసిన "ఒప్పందం" గా పౌర హక్కుల సంఘం భావిస్తోంది.

    ఉద్యోగులు ఎంతో చైతన్యం తో తమ హక్కులు సాధన కోసం ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధమై చారిత్రాత్మక మహా ర్యాలీ ని నిర్వహించారు. ఈ స్ఫూర్తి ని తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాల నాయకత్వం కొనసాగిస్తోంది అని ఉద్యోగుల తో పాటు సమాజం లోని అన్ని వర్గాలు మద్దతు ఇచ్చి ఎదురు చూశాయి. నాయకత్వం అందరిని నిరుత్సాహ పరిచింది.ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడలు కి బలైనారు. ఉద్యోగులకు ప్రభుత్వాధి నేత సీఎం జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చిన ప్రధాన డిమాండ్ సీపీఎస్ రద్దుని కూడా సాధించ లేక పోయారు.

        ఉద్యోగుల తీవ్ర మనస్తాపానికి,భాధ కు గురిఅవుతున్నారు. ఈ విషయాలను పౌర హక్కుల సంఘం తీవ్రంగా పరిగణిస్తుంది. కొన్ని డిమాండ్ల లో ఉన్న హక్కులను నిలపెట్టు కోలేక పోయారు.ఉద్యోగుల హక్కులు మరింత పటిష్టం గా పరిరక్షించ బడాలి అని బలం గా కోరుకుంటుంది. 

            అందుకు ప్రభుత్వాల ప్రాపకం కంటే ప్రజా మద్దతు చాలా అవసరం అని ఉద్యోగులు,ఉద్యోగ సంఘాలు గుర్తించాలి.ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకోవాలి. పనుల కోసం మీ వద్ద కు వచ్చేవారి తో కలిసి మెలసి గౌరవప్రదం గా వేగవంతం గా పని చేసి పంపండి. మీకు అండ గా నిలబడతారు. ప్రజలు కంటి కి రెప్పలా కాపాడుకుంటారు. మీ నిజాయితీ మిమ్మల్ని అన్నివేళలా నిలబెడుతుంది.

     సాధించింది తక్కువే అయినా నిరుత్సాహం చెందకండి. ఈ ఒప్పందాన్ని నిరసించండి. తీవ్ర నిరసన గళం తో వ్యతిరేకించండీ. మీ పూర్తి డిమాండ్ల సాధన కోసం ఉద్యమించండి. మరింత స్పూర్తితో మీ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమించండి.                    

          భవిష్యత్తు లో మీ సమస్యలు పరిస్కారం కోసం, హక్కుల కోసం మీరు జరిపే న్యాయమైన,ప్రజాస్వామిక మైన ఉద్యమాలకు,పోరాటాలకు మద్దతుగా, అండ గా పౌర హక్కుల సంఘం గా నిలబడతామని తెలియచేస్తున్నాము.

 అభినందనలు తో
                    
             ఇట్లు
  చిలుకా. చంద్ర శేఖర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.    


నంబూరి. శ్రీమన్నారాయణ.
రాష్ట్ర ఉపాధ్యక్షులు.      
                
  T. ఆంజనేయులు రాష్ట్ర సహాయ కార్యదర్శి.                

 పౌర హక్కుల సంఘం CLC.     
   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ

Comments