పి. భీమ్ రావు న్యాయవాది గారికి జోహార్లు | తెలంగాణ సి ఎల్ సి

పి. భీమ్ రావు,న్యాయవాది గారికి జోహార్లు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం.తేది 24/02/2022 నాడు హైదరాబాద్ లో అనారోగ్యం తో మరణించారు.అతనిది ఐలపూర్ స్వగ్రామం. కానీ ఆర్మూర్ కోర్టులో ఎక్కువ కాలం న్యాయవాదిగా ప్రజలకు సేవలు అందించిన ఘనత ఆయనది. పేద ప్రజల నిజమైన న్యాయవాది, నిస్వార్థ పరుడు, నిజాయతీ కలిగిన వ్యక్తి, పౌర హక్కుల సంఘం ఉద్యమ నాయకుడు, నిజామాబాద్ జిల్లా కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు గా కామ్రేడ్. పి. భీమ్ రావు గారు.అతను పేద ప్రజల కోసం నిరంతాయంగా తపించిన వ్యక్తి. క్లైంట్స్ ను ఫీజుల కోసం ఏ రోజు ఒత్తిడి చేయలేదు. అత్యాశ పడలేదు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడినాడు. ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు.వారిలో భీమ్ రావు ఒక్కరు. భీమ్ రావు గారికి పౌర హక్కుల సంఘం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున జోహార్లు.

మువ్వా నాగేశ్వర్ రావు, జిల్లా అధ్యక్షుడు, అల్గొట్ రవీందర్ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి.

Comments