చట్టభద్ద పాలనను అందించాలి | సి ఎల్ సి

పత్రికా ప్రకటన

   చట్టభద్ద పాలనను ఆయా రాజకీయ పార్టీలు అనుసరించక పోవటమే "గుడివాడ కాసినో "ఘటన. అధికారం లోకి రాగానే పోలీసులను తమ అనుచరులు గా భావించి ప్రత్యర్థి వర్గాల పై ఉసి కొలపుతున్నారు. చట్టభద్ద పాలన కోరేవారి పై తప్పుడు కేసులు పెట్టటం  అనవాయితీగా వస్తున్నది. అదే తీరును గుడివాడ లో వై. ఎస్. ఆర్. సి. పి నేడు పాటిస్తుంది. కాసినోను నిర్వహించింది సత్యం. అది స్థానిక మంత్రి కనుసన్నలో నిర్వహించడం జరిగింది. కాని అది నిరూపన కాదు.  ఆ సత్యాన్ని తెలియజేయడానికి, నిజ నిర్దారణకు వెళ్ళేవారికి ప్రభుత్వం  అనుమతి ఇవ్వదు. ఆ సత్యం ప్రతిపక్షానికి కూడా తెలుసు. ప్రచారం ప్రధానం.


జూదమ్ ద్వారా  ప్రజా ప్రతినిధులు, మంత్రులు సంపాదనకు అలవాటు పడ్డారు. ఈ వ్యవస్థను ఈ రాజకీయ పార్టీలే నిర్మించు కొన్నాయి. ఇంత దుమరాం, రాజకీయ ఆరోపణలు, చాలంజ్ లు జరుగుతున్నా ముఖ్యమంత్రి నోరు మేదపరు. ప్రభుత్వం లోని ఒక మంత్రి ఫై వచ్చిన ఆరోపణలు నిజం కాదని, అవి రాజకీయ మైనవని ప్రభుత్వం అనుకుంటే వెంటనే రిటైర్డు జిల్లా న్యాయమూర్తిచే న్యాయ విచారణ జరిపించాలి.

   -     వి. చిట్టిబాబు, చిలుక చంద్రశేఖర్.
అధ్యక్ష, కార్యదర్శులు,
పౌర హక్కుల సంఘం, ఏ. పి.

Comments