ప్రజాస్వామ్య హక్కులను హరించే నిరంకుశ చట్టాలను రద్దు చేయాలి | కర్నూలు జిల్లా

*ప్రజాస్వామ్య హక్కులను హరించే నిరంకుశ చట్టాలను రద్దు చేయాలి*
 
 *ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక డిమాండ్*
తమ సహజమైన,రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను వాడుకోకుండా, తమకు కావలిసిన వాటిని సాదించుకోవడం కోసం అడిగిందే తడవుగా ఈ దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించే నిరంకుశ, నల్ల చట్టాలైన UAPA, NIA, AFSPA లాంటి వాటిని వెంబడే రద్దు చేయాలని కోరుతూ సోమవారం కర్నూల్ నగరంలో *ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక* ఆధ్వర్యంలో రాజ్ విహార్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సుమారు 150 మందితో ర్యాలీ నిర్వహించి కలెక్టరు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక భాగస్వామ్య సంఘమైన రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు అరుణ్ మాట్లాడుతూ... హక్కుల ఉల్లంఘన అనేది తీవ్రమైన నేరం అని, ప్రజలు తమ అవసరాలు తీరనపుడు గొంతెత్తడం సహజమని అది ఎలా నేరంగా పరిగణించబడుతుందని అన్నారు. గతంలో ఈ దేశంలో తెచ్చిన కొన్ని చట్టాల వల్ల అమాయకుల ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. భీమా కోరేగావ్ కేసులో చనిపోయిన ఫాథర్ స్థాన్ స్వామి మరణం అలాంటి కోవకి చెందుతుందని అన్నారు. అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యగానే అందరు పరిగణించాలని అన్నారు. ప్రముఖ న్యాయవాది ఓంకార్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రజలకు తమ అవసరాలను నిర్భయంగా అడిగే, ప్రకటించే హక్కు కల్పించినప్పుడు, ప్రజలు చేసే డిమాండ్లకు దేశ ద్రోహాన్ని ఎలా అంటగడతారని ప్రశ్నించారు. పౌర హక్కుల సంఘం నాయకులు అల్లా బకాశ్ మాట్లాడుతూ.. ఈ దేశంలో ఒక నియంత పాలన నడుస్తుందని, అది ఈ దేశ ప్రజల యొక్క అవసరాల్ని పట్టించుకోకుండా కేవలం పెట్టుబడిదారుల అవసరాల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుందని అన్నారు. ఈ నిరంకుషానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసే ఉద్యమకారులు, కళాకారులపైన అక్రమంగా కేసులు బనాయించి సంవత్సరాల తరబడి వాళ్ళను నిర్బందిచడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. RCC నాయకులు రాజు మాట్లాడుతూ.. ఎక్కడ ఏ చిన్న సమావేశం జరిగిన పోలీసులు బెంబేలెత్తిపోయి ఆ సమావేశంలో పాల్గొన్న వారి పూర్తి వివరాలు సేకరించి,తర్వాత వాళ్ళని, వారి కుటుంబాలను హింసలు పెట్టడం న్యాయమేనా.. ఇదేనా ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఈ దేశాన్ని పాలించే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. సీమ విద్యార్థి సంఘం నాయకులు లాజరస్ మాట్లాడుతూ.. ప్రజలు ఈ నిరంకుశ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు ఇచ్చారు. POP నాయకులు శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఈ నిరంకుశ నల్ల చట్టాలు రద్దు అయ్యేంతవరకు అందరూ కలిసికట్టుగా పోరాడకపోతే రేపు రేపు జీవించే హక్కును కూడా కోల్పోతామని అన్నారు.అందుకే అందరం కలిసి ఈ నల్ల చట్టాల పైన ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని అన్నారు. రైతు ఐక్య వేదిక నాయకులు శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. పోరాడితేనే మన హక్కులు దక్కుతాయన్నారు. కానీ ఆ పోరాటల్ని అణిచివేత కోసం ఉన్న ఈ చట్టాలు రద్దు అయితే తప్ప పోరాటాలు ఉండవని అన్నారు.SDoPI నాయకులు జహంగీర్ మాట్లాడుతూ.. పాలకులు ఈ దేశంలో మతం పేర, కులం పేర విభజించి పాలించే సూత్రాన్ని అమలుచేస్తున్నారన్నారు. అందుకు నిదర్శనమే ఈ దేశంలో హక్కులకోసం ప్రజలు, ప్రజా సంఘాలు పోరాడితే దేశ ద్రోహులని ముద్రవేసి హింసించి, చావులకి గురిచేస్తున్నారని అన్నారు. BBJSS నాయకులు మనోహర్ మాట్లాడుతూ కింది కులాల పరిస్థితి మరీ అద్వాన్నంగా తయారయ్యిందని, బ్రతకడం కోసం పోరాడకపోతే రేపు మన ఉనికే ప్రమాదంలో ఉంటుందని అందుకే ఈ చట్టాలకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలని కోరారు. కలెక్టర్ కార్యాలయం దగ్గర దాదాపు 2 గంటలపాటు జరిగిన ఈ ధర్నాలో రైతుకూలి సంఘం నాయకులు సుంకన్న, PDSU విజృంభన నాయకులు మధు, రాయలసీమ కళావేదిక నాయకులు రాంచరణ్, అంజలినాయుడు, ఏఐటీయూసీ నాయకులు రామకృష్ణరెడ్డి,SDPI నాయకులు చాంద్ పాషా, పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియా నాయకులు జహంగీర్, BC విద్యార్థి సంఘం నాయకులు మోహన్, RJAC నాయకులు కోనేటి వెంకటేశ్వర్లు,KNPS నాయకులు A.V. సుబ్బారాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Comments