తెలంగాణకు పారిశ్రామిక గుండెకాయ అయిన సింగరేణి బొగ్గు గనుల్లో లక్ష పది వేల మంది కార్మికులు ఒకప్పుడు పనిచేసేవారు. నేడు కార్మికులను సగానికి పైగా తగ్గించి పూర్తి యాంత్రీకరణ వైపు, ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వాలు కొనసాగిస్తూ, బొగ్గు గనుల భవిష్యత్తును అంధకారం చేస్తున్నాయి. భారత దేశంలో సింగరేణి బొగ్గు గనులతో పాటు వెస్టర్న్ కోల్డ్ ఫీల్డ్స్, సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్ ఇంకా అనేక రకాల బొగ్గు విభాగాలు పని చేస్తున్నాయి. అన్నింటిలోకి సింగరేణి బొగ్గు గనుల్లోనే కార్మికుల హక్కులు ఎక్కువగా ఉన్నాయి. అవి గత రెండు దశాబ్దాలుగా సింగరేణి కార్మికులు అనేక ప్రాణ త్యాగాలు చేసి, సమ్మెలు చేసి సాధించుకున్నవి.
కానీ నేడు కార్మిక సంఘాలను బలహీన పరిచే విధంగా తీవ్రమైన నిర్బంధాన్ని కొనసాగిస్తూ ఉపరితల గనుల్లోనూ, భూగర్భ గనుల్లోనూ తీవ్ర స్థాయిలో ప్రవేటీకరణ కొనసాగిస్తూ కార్మికులకు హక్కులు లేకుండా చేస్తున్నారు, అందులో భాగంగానే తెలంగాణలోని కోయిగూడెం బ్లాకును, సత్తుపల్లి బ్లాకును, కళ్యాణికని బ్లాకును, శ్రావణపల్లి బ్లాకులను వేలం పాట ద్వారా ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. దాన్ని వ్యతిరేకిస్తూ,కార్మిక సంఘాలు ఐక్యం గా ఏర్పడి 72 గం||ల అనగా 9,10,11 తేదీల్లో ఇచ్చిన సమ్మెను కేంద్ర ప్రభుత్వం గుర్తించి, వేలంపాటను నిలిపివేసి ప బ్లిక్ రంగాన్ని ప్రైవేటు పరంగా కాకుండా కాపాడాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని పౌరహక్కుల సంఘం డిమాండు చేస్తుంది.
మొన్నటికి మొన్న ఏవై తే మూడు రైతు వ్యతిరేక చట్టాల రద్దుకై ఏడాది కాలం ఉద్యమం నిర్మించి, రైతు చట్టాలను వెనక్కు తీసుకునేలా చేసారో, అదే వెలుగులో సింగరేణి కార్మికులు, భారతదేశంలోని మిగతా బొగ్గుగని కార్మికులందరూ కలిసి కార్మిక పోరటాన్ని కొనసాగించి విజయం సాధించాల్సిన అవసరం ఉంది.
అక్టోబర్ 11 న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ʹబొగ్గు గనుల వేలం పైʹ ప్రకటనను జారీ చేసింది.ʹ కోల్ మైన్స్ స్పెషల్ ప్రొవిజన్ ఆక్ట్ 2015", "మైన్స్ మినరల్స్ (డెవలప్ మెంట్ రెగ్యులేషన్) ఆక్ట్ 1957 మార్గదర్శకంగా దేశ వ్యాప్తంగా 88 బొగ్గు బ్లాక్ లను వేలం వేస్తున్నట్లుగా తెలిపింది. అందులో జార్ఖండ్ , ఒడిశా, ఛత్తీస్ గడ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని బ్లాక్ లతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కంపెనీకి చెందిన నాలుగు గనులు కూడా ఉన్నాయి.
సింగరేణి సంస్థ 766 కోట్ల రూపాయలు వెచ్చించి భూగర్భ పరిశోధనను పూర్తిచేసింది. పర్యావర ణ అనుమతులను పొందిన వెంటనే బొగ్గుగని తవ్వకాలకు సిద్ధం చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోయగూడెం బ్లాక్ -3,ఖమ్మం జిల్లా సత్తుపల్లి బ్లాక్-3, మంచిర్యాల జిల్లా కళ్యాణ్ ఖని బ్లాక్ -6, శ్రావణ్ పల్లి బ్లాక్ కూడా ఉన్నవి.అయితే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రకటించడంతో సింగరేణిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏఐటీయూసీ, సీఐటియు, ఇష్టూ యితర కార్మిక సంఘాలు గనుల మీద బొగ్గు గనుల వేలం పాటను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్ర మాలు చేసినవి. ప్రభుత్వ సంస్థల ద్వారానే బొగ్గు ఉత్పత్తి పనులను కొనసాగించాలని డిమాండ్ చేసినవి.
అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఓపెన్ బిడ్డింగ్ ప్రాతిపదికగానే బొగ్గు గనుల కేటాయింపుకు మొగ్గు చూపుతోంది. దానివలన ప్రభుత్వ సం స్థలైన ʹʹకోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) లు కూడా వేలం పాటలలో పాల్గొని బొగ్గు గనులను దక్కించుకోవాలి.
ప్రపంచంలో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, చైనా దేశాల్లో భారత దేశం కూడా ఒకటి. 2018 ఏప్రిల్ 1 నాటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు భూగర్భంలో 1200 మీటర్ల లోతు వరకు జరిపిన అన్వేషణ ప్రకారంగా 319,02 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. గడచిన 2020, 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ కోల్ ఇండియా లిమిటెడ్ మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లు 647,017 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినవి. ప్రైవేటు కంపెనీలు 24,280 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినవి.
భారత్ లో అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయలేదు.బొగ్గు సంస్థలకు అందించే బడ్జెట్ సపోర్ట్ ను ఉపసంహరించుకుంది. కనీసం పన్నుల చెల్లింపులలో రాయితీని ఇవ్వడం లేదు. కోల్ ఇండియా లిమిటెడ్ 2020 -2021 ఆర్థిక సంవత్సరంలో రాయల్టీ, సేల్స్ టాక్స్,కోల్ సెస్,ఎంట్రీ టాక్స్, క్లీన్ ఎనర్జీ సెస్, ఎక్సైజ్ డ్యూటీ, జి.ఎస్.టి మొదలగు పన్నుల పేర రూ. 44,075,81 కోట్లు చెల్లించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ(సి.ఎస్.ఆర్) పేర రూ.449,31 కోట్లు చెల్లించింది. నికర లాభాలుగా రూ.12,702,17 కోట్లు సాధించింది. సింగరేణి కంపెనీ 2014 - 2015 ఆర్థిక సంవత్సరం నుండి 2018 - 2019 వరకు ర్నూ 27467.71 కోట్లు , డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ పేర 2018 ఏప్రిల్ నుండి 2020 ఆగస్ట్ వరకు రూ.2,262,85 కోట్లు చెల్లించింది. సి.ఎస్.ఆర్ పేర 2020-2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 20 కోట్లు కేటాయించింది.
ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థలు అంతర్గత లాభాలతో,స్వయం కృషితో నిర్దేశిత బొగ్గు ఉ త్పత్తి లక్ష్యాలను అధిగమించి పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతున్నవి. ప్రభుత్వ పరంగా దేశీయ బొగ్గు ఉత్పత్తికి సహకారము లేనందున విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. 2019 -2020 ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రేలియా, కెనడా ,యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మొజాంబిక్, ఇండోనేషియా ,సింగపూర్, సౌత్ ఆఫ్రికా, రష్యా మొదలగు దేశాల నుండి దిగుమతి చేసుకున్న 247 మిలియన్ టన్నుల బొగ్గుకు రూ.1,52,7321కోట్లు చెల్లించారు.
అయితే 2020 - 2021 లో మాత్రం 13.50 శాతం తక్కువగా బొగ్గును దిగుమతి చేసుకున్నారు.అంటే 214,995 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకొని రూ.1,16,037,2 కోట్లు చెల్లించడం జరిగింది.బొగ్గు దిగుమతి తగ్గడం వలన బొగ్గు కొరత ఏర్పడింది. దేశీయంగా బొగ్గు కొరత ఉన్నప్పటికీ కూడా విదేశీ సంబంధాల దృష్ట్యా భారత్ పొరుగు దేశాలైన నేపాల్ బంగ్లాదేశ్ లకు 8 లక్షల టన్నుల బొగ్గును ఎగుమతి చేయడం జరిగింది. ప్రస్తుత బొగ్గు కొరతకు ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం అలాగే బొగ్గు బ్లాక్ లను వేలం వేసే ప్రక్రియను వేగిరం చేయడానికి దేశీయ బొగ్గు ఉత్పత్తిని తగ్గించాలని ప్రభుత్వ బొగ్గు సంస్థల పై ఒత్తిడి చేయడం కూడా బొగ్గు కొరత ఏర్పడింది.
స్వయంగాʹ కోల్ ఇండియా లిమిటెడ్ʹ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ బొగ్గు ఉత్పత్తిని తగ్గించాలంటూ తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. బొగ్గు ఇంధనంగా 53.34 శాతం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (ʹ(సిఇఎ)వారు చెప్పిన 2020 నవంబర్ 30 నాటి లెక్కల ప్రకారంగా బొగ్గుతో సెంట్రల్ సెక్టార్ లో 59,790 మెగావాట్లు, స్టేట్స్ సెక్టార్ లలో 65,631 మెగావాట్లు, ప్రైవేటు సెక్టార్ లో 74,173 మెగావాట్లు, మొత్తం 1,99,594 మెగావాట్లతో 53734 శాతం విద్యుత్ ఉ త్పత్తి అవుతుంది.లిగ్నైట్ ఇంధనంగా సెంట్రల్ సెక్టార్ లో 3,140 మెగావాట్లు, స్టేట్స్ సెక్టార్ లో 1,290 మెగావాట్లు,ప్రైవేట్ సెక్టార్ లో 1,830 మెగావాట్లు మొత్తం 6,260 మెగావాట్లతో 167 శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గ్యాస్ ఇంధనంగా సెంట్రల్ సెక్టార్ లో 7,23,791 మెగావాట్లు, స్టేట్స్ సెక్టార్ లో 7,11,985 మెగా వాట్లు, ప్రైవేట్ సెక్టార్ లో 1,830 మెగా వాట్లు మొత్తం 24,95,651 మెగావాట్లతో 667 శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. డీజిల్ ఇందనంగా స్టేట్స్ సెక్టార్ లో 23/01 మెగావాట్లు, ప్రైవేట్ సెక్టార్ లో 27,370 మెగావాట్లు మొత్తము 50,971 మెగా వాట్లతో 0.14 శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా శిలాజ ఇంధనములతో మొత్తం 2,31,32,072 మెగా వాట్లతో 61.82 శాతం థర్మల్ విద్యుత్ ఉ త్పత్తి జరుగుతుంది. ఇక శిలాజ రహిత ఇంధనాలతో మరియు పునరుత్పాదక వనరులతో సెంట్రల్ సెక్టార్ లో 18.1 శాతంగా 6,780 మెగావాట్ల అణు విద్యుత్, సెంట్రల్ సెక్టార్ లో 15,34, 672 మెగావాట్లు, స్టేట్స్ సెక్టార్ లలో 26,95,850 మెగావాట్లు, ప్రైవేట్ సెక్టార్ లో 3,394 మెగావాట్లు మొత్తం 45,69,922 మెగావాట్లతో 12.21శాతం జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సౌర శక్తితో మరియ గాలితో సెంట్రల్ సెక్టార్ లో 70,16,791 మెగావాట్లు, స్టేట్స్ సెక్టార్ లలో 2,38,153 మెగావాట్లు, ప్రైవేట్ సెక్టార్ లో 86,38,527 మెగావాట్లు మొత్తం 90,39,911 మెగావాట్లతో 24.16 శాతం సోలార్,విడ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ కేంద్రాలలో శిలాజ ఇంధనాలతో, శిలాజ రహిత మరియు పునరుత్పాదక వనరులతో 3,88,134 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నది.
వేలంపాటలో బొగ్గు గనులను అమ్మడం ద్వారా బొగ్గు కొరత సమస్య పరిష్కారం కాదు. వేలం పాటతో బొగ్గు గనులను కొనుగోలు చేసిన బహుళజాతి సంస్థలు, ప్రైవేటు సంస్థలు భవిష్యత్తులో కృత్రిమంగా బొగ్గు కొరతను సృష్టించే అవకాశము ఉన్నది. దానితో బొగ్గు ధరలు, విద్యుత్తు వినియోగ ధరలు పెరిగి ప్రజల మీద మోయలేని భారం పడే ప్రమాదం ఉన్నది.
ఇప్పుడు ప్రభుత్వ పరిశ్రమల ద్వారా మార్కెట్ గుత్తాధిపత్యం పెరగకుండా నిలువరించబడుతుంది. వ్యవసాయం, గృహ వినియోగ విద్యుత్ బిల్లుల చెల్లింపులలో సబ్సిడీ అలాగే ధరల నిలకడతో ప్రజలు ప్రయోజనాన్ని పొందుతున్నారు. ప్రభుత్వ పరిశ్రమల ద్వారా సంపద వికేంద్రీకరించబడి సామాజిక అభివృద్ధి జరుగుచున్నది. కాని బిజెపి ప్రభుత్వము సహజ వనరులను, ప్రభుత్వ పరిశ్రమలను అమ్మే ప్రక్రియను వేగిరం చేసింది.
రానున్న 2021-22 నుండి 2024-25 నాటికి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అమ్మి 6 లక్షల కోట్లు సమీకరించుకుంటామని ప్రకటించింది. అయితే బొగ్గు గనులను అమ్మే విషయంలో మాత్రం కార్మిక వ్యతిరేకత రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ? బొగ్గు పరిశ్రమలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం పై, ఓపెన్ బిడ్డింగ్ ప్రతిపాదికన బొగ్గు గనులను కేటాయించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 72 గంటలు, 48 గంటలు, 24 గంటలు మూడు పర్యాయాలు కార్మిక సంఘాల పిలుపుతో సమ్మెలు జరిగినవి. అలాగే ఆందోళన నిరసన కార్యక్రమాలు కూడా జరిగినవి.
అందు గురించే కేంద్ర ప్రభుత్వము కుట్రపూరితంగా బొగ్గు కొరత పేరుతో 88 బొగ్గు బ్లాకులను వేలంపాటలో అమ్మడానికి ప్రయత్నిస్తుంది.
కోల్ ఇండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ ఆగస్ట్, సెప్టెంబర్ నెలలలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు నిల్వలు తరిగిపోవడం సహజమేనని అలాగే ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదని పేర్కొనడం గమనార్హం. రానున్న చలికాలంలో బొగ్గు డిమాండ్ తగ్గే అవకాశం ఉన్నదని చెప్పారు. బొగ్గు ఉత్పత్తి క్రమంగా పెరుగుతుందని త్వరలోనే బొగ్గు నిల్వలు కూడా పెరుగుతాయని భరోసా ఇచ్చాడు. అలాగే సింగరేణి కంపెనీలో కూడా బొగ్గు ఉత్పత్తి పెరిగింది.2021 సెప్టెంబర్ లో 44,84,188 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా 47,94,788 టన్నుల బొగ్గు ఉత్పత్తి పెరిగి 107 శాతం ఉత్పత్తిని సాధించింది. కాబట్టి బిజెపి ప్రభుత్వము 88 బొగ్గు బ్లాకులను వేలం పాటతో అమ్మే ప్రక్రియను ఉపసంహరించుకుని కోల్ ఇండియా సింగరేణి కంపెనీలకు బొగ్గు గనులను కేటాయించి బొగ్గు ఉత్పత్తికి సహకరించాలని కార్మికులు కోరుకుంటున్నారు.
బొగ్గు బ్లాకులప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ 9,10,11 తేదీల్లో సమ్మె చేయడానికి నోటీసు అందజేసిన విప్లవకార్మిక సంఘాల జేఏసీ నిర్ణయానికి పౌరహక్కుల సంఘం మద్దతిస్తూ సమ్మె విజయవంతం చేయాల్సిందిగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తుంది. సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ 49 శాతం వాటాలను రాష్ట్ర ప్రభుత్వం కొని సింగరేణిని రాష్ట్రం ప్రభుత్వం నడిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడిన 13 వేలకోట్ల రూపాయలను చెల్లించాలి. కొత్త బావులు, కొత్త ఉద్యోగాలకు ఆ నిధులను కేటాయించాలి.
రాంపూర్, మణుగూరు ప్రమాద బాధితులకు రూ. 1కోటి ఎక్సేషియా చెల్లించాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. సింగరేణి ప్రమాదాల పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. సింగరేణి అధికారులతో సహా దోషులపై చర్యలు తీసుకోవాలి. మణుగూరు ఓసీ ప్రమాదానికి కారకుడుగా నిందించి ఆపరేటర్ కీబుకు ఇచ్చిన డిస్మిస్ ఆర్డర్ ను రద్దుచేయాలి. సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాలు కాంట్రాక్ట్ కార్మికులకు 2013 జనవరి నుండి ఇవ్వాల్సిన హైపవర్ కమిటీ వేతనాల ఏరియల్స్ ను వెంటనే చెల్లించాలి. 2019 నుండి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.
కరోనా వల్ల మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు 15 లక్షల ఎక్సేషియా చెల్లించాలి. కరోనా బాధితులకు 18 రోజుల వేతనం ఇవ్వాలి. కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల బోనస్, స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఎన్.సి.డబ్ల్యూఏ ప్రకారం హక్కులు, సౌకర్యాలు అమలు చేయాలి. సింగరేణి నిర్వాసితులకు కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలి. మెడికల్ అన్ ఫిట్ అయిన ఆపరేటర్, మైనింగు స్టాప్ ట్రేడ్స్ మెన్ లకు సూటబుల్ జాబు ఇవ్వాలి. సింగరేణిలో రక్షణ చర్యలు కట్టుదిట్టంగా అమలుచేయాలి. కార్మికుల మెడ పై కత్తిలా ఉత్పత్తి టార్గెట్ ను పెట్టి ఒత్తిడి చేస్తున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలి. సేఫ్టీ కమిటీలో అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. మారు పేర్లతో పనిచేస్తున్న కార్మికుల పేర్లను సవరించాలి అనే డిమాండ్లతో సాగుతున్న సమ్మె విజయవంతం కావడానికి దేశవ్యాప్తంగా ఉన్న హక్కుల సంఘాలు తమ మద్దతును తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నక్క నారాయణ రావు
మాదన కుమార స్వామి
పౌర హక్కుల సంఘం
07-12-2021
Comments
Post a Comment