మిత్రుడు వెంకటేశ్వరరావు ను చంద్ర.రఘునాథ్.సురేష్ మరియు నేను ఈమధ్య విజయవాడ NIA ,కొర్ట్ దగ్గర మాట్లాడు కోవడం జరిగింది, ఇంతలో నే అతని మరణ వార్త వినడం బాధకరం, జోహార్లు వెంకటేశ్వర్లు
- లింగన్న హైదరాబాద్
వెంకటేశ్వర్లు గారికి జోహార్లు వారి కుటుంబానికి సంతాపం సానుభూతి తెలియజేస్తున్నాను
- శ్రీధర్ రాయల
గుంటూరు సియల్ సి కార్య దర్శి వెంకటేశ్వర్లు గారి ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులకు, పౌరహక్కుల ఉద్యమానికి తీరని లోటు.వారి కుటుంబ సభ్యుల కు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జోహార్లు వెంకటేశ్వర్లు గారు.. జోహార్.
- ఆర్. శశికళ
కంచు కంఠం మూగపోఇంది
జోహారులు వెంకన్నకు
- గుంటి రవి
పౌర హక్కుల సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు గారి మృతి పీడిత ప్రజలకు,ప్రజా సంఘాల కు దుఃఖం కలిగించేది. పౌరహక్కులపై తీవ్రమైన దాడి జరుగుతున్న ప్రస్తుత సమయంలో ఆయన మరణం హక్కుల ఉద్యమానికి చాలా నష్టం కలిగించేది.
వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను.
వెంకటేశ్వర్లు అమర్ రహే.
జోహార్ వెంకటేశ్వర్లు
- ఆర్. షామీర్ భాషా
జోహార్లు వెంకన్నకు.మంచి మిత్రుడు, స్నేహశీలి, అప్యాయంగా పలుకరించే వెంకన్న మరణం హక్కుల ఉద్యమానికి తీరని లోటు. హక్కుల కోసం పరితపించిన నేత. కార్మికునిగా ఉద్యోగ ధర్మాన్ని నేరవేస్తునే హక్కుల కోసం పని చేయడం చాలా గొప్ప విషయం.జీవించే హక్కు విలువైనది. జీవించే హక్కును హారించి వేస్తున్న రాజ్యాన్ని ప్రశ్నించడం మరింత ఉన్నతమైనది. అందుకోసం జీవించడం మనిషిలోని పరిపక్వమైన ఆలోచనలకు నిదర్శనం వెంకన్న.
- మువ్వా నాగేశ్వర్ రావు అధ్యక్షులు, ఆల్గోట్ రవీందర్ ప్రధాన కార్యదర్శి పౌర హక్కుల సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
పౌర హక్కుల సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు గారికి జోహార్లు..
పౌర హక్కుల సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న ఎం వెంకటేశ్వర్లు గారు ఈరోజు 17డిసెంబర్,2021న హార్ట్ ఎటాక్ తో అకాల మరణానికి గురైనారు. వారికి వినమ్రనివాళులు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు పౌర హక్కుల సంఘం తెలంగాణ ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది...
-హైదరాబాద్.
పౌర హక్కుల సంఘం తెలంగాణ.
సుదీర్ఘ కాలం పీడిత ప్రజల హక్కుల కోసం నిరంతరం పనిచేసిన నా సహచర ఉద్యమ కారుడు,మిత్రులు గుంటూరు జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు గారి మృతి విషాదకరం,ఆయన మృతి పీడిత ప్రజల కు ,ప్రజా సంఘాల కు తీరని లోటు...వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి....జోహార్...వెంకన్నకు
- సి. వెంకటేశ్వర్లు, కడప
ఎంతటి విషాదం. చురుకుగా పనిచేసే సభ్యుడు. జోహార్లు అమరుడు గుంటూరు వెంకటేశ్వర్లు కి.
- అల్లా భక్ష్
Comments
Post a Comment