ఊపా చట్టం రద్దు కొరకు ఉద్యమించడమే హక్కుల నేతకు నిజమైన నివాళి | కర్నూల్ జిల్లా

" ఊపా చట్టం రద్దు కొరకు ఉద్యమించడమే హక్కుల నేతకు నిజమైన నివాళి"
___________________________   
      పౌర హక్కుల నేత ప్రో. శేషయ్య మొదటి వర్ధంతి సందర్భంగా కర్నూల్ లో " ఊపా చట్టం రద్దు సభ" నేడు స్థానిక యస్. టి.యు. సలాంఖాన్ భవనం లో జరిగింది. పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అల్లా బకష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలుగా తెలంగాణ హై కోర్టు న్యాయవాది పౌర హక్కుల సంఘం నాయకులు సురేష్ కుమార్, పౌర హక్కుల సంఘం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్ర శేఖర్, రచయిత్రి, విప్లవ సంఘం కార్యవర్గ సభ్యురాలు, ప్రో. శేషయ్య సహచరి శశికళ గారలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, దేశం లో నేడు పౌర హక్కులు ప్రమాదంలో పడ్డాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్నాయని, నాలుగు దశాబ్దాల క్రితం తయారుచేయబడిన UAPA చట్టం తన రూపాన్ని మార్చుకుంటూ, మరింత దుర్మార్గంగా తయారైందని, తెలిపారు. అధికారంలోకి వస్తున్న అన్ని పార్టీలు ప్రజల ప్రశ్నించే గొంతులను నొక్కివేయడానికి UAPA ఊపా చట్టాన్ని వినియోగిస్తున్నా యని, గత కాలంగా వేలాది మందిని ఈ చట్టం బలి తీసుకున్నదని, తక్షణమే ఈ చట్టం రద్దు కొరకు ప్రజలు ఉద్యమించ వలసిన అవసరం వుందని పిలుపు నిచ్చారు.
      ఈ సదస్సు లో " ప్రో. శేషయ్య గారి జ్ఞాపకాలు " " భారత రాజ్యాంగం - పౌర హక్కులు" " భారత ప్రథమ సంగ్రామ పోరాటం లో హిందూ ముస్లిమ్స్ ఐక్యత " పుస్తకం ఆవిష్కరిస్తూ డిసెంబర్ 19 స్వతంత్ర పోరాట వీరులు అశ్వాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ ఉరితీయబడ్డ రోజని ఈ వీరుల చరిత్ర ను ప్రభుత్వం అని శేషయ్య గారి సహచరి రచయిత్రి మాట్లాడుతూ R. శ శి కళ గారు ఆవిష్కరించారు. Eఈ కార్యక్రమంలో SDPI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ వారిస్ గారు మాట్లాడుతూ, UAPA చట్టం రద్దు కొరకు సమైఖ్య ఉద్యమాలను చేపట్ట వలసిన అవసరం వుందని పిలుపు నిచ్చారు. చివరగా పౌర హక్కుల సంఘం అధ్యక్షులు కరీం భాష వందన సమర్పణ చేశారు.
....పౌర హక్కుల సంఘం,
కర్నూల్ జిల్లా శాఖ.
19/12/2021.

Comments