ఎం. వెంకటేశ్వర్లు కి హక్కుల ఉద్యమ జోహార్లు | నంబూరి శ్రీమన్నారాయణ

పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎం. వెంకటేశ్వర్లు కి హక్కుల ఉద్యమ జోహార్లు.

వేల ప్రశ్నలను రాజ్యం పై సంధించిన గొంతుక,వందల సమాధానాలు ప్రజల తరపున చెప్పిన గొంతుక మూగపోయింది. ది17.12.2021 రాత్రి8.30 కి హార్ట్ ఎటాక్ తో గుంటూరు లలిత హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. 

 
             
ఆయన మరణం హక్కుల ఉద్యమానికి, ప్రజా ఉద్యమాలుకి,ప్రజలకు తీరని లోటు. హక్కుల ఉద్యమ నాయకులు ఎం.వేంకటేశ్వర్లు కి హక్కుల ఉద్యమ జోహార్లు. ఆయన మరణానికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాము.ఆయన కుటుంబానికి,బంధు మిత్రులకు విచారాన్ని, సానుభూతిని తెలియచేస్తున్నాము. 
  
 మరణం విషయం నాకు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు నక్కా వెంకట రత్నం ద్వారా తెలిసింది.అప్పుడు IAPL సురేష్ కూడా నా ప్రక్క నే ఉన్నాడు.
చాలా భాధపడ్డాం. మిత్రులు లాయర్ రాజారావు గారికి ఫోన్ చేశాము.ఇప్పుడే ఒంగోలు భౌతిక కాయాన్ని తీసుకు వెళుతున్నారు అన్నారు. రేపు 18.12.2021న సాయంత్రం అంత్యక్రియలు ఉంటాయి అని తెలియ చేశారు. న్యాయవాది కర్నాటి.రామ్మోహన్ గారి మెమోరియల్ మీటింగ్ లో చివరి సారి కలిశాము.మరుసటి రోజు మీటింగ్ లో విషయాలు గురించి ఫోన్లో మాట్లాడుకున్నాం. అదే చివరి చూపు అవుతుంది అని, అవే కడసారి మాటలు అవుతాయి అని ఊహించ లేదు.
        
           నాతో ఆయన ఆఖరి మాటలు మనువు భావజాలాన్ని, మతోన్మాద RSS భావజాలాన్ని చీల్చి చెందాడినవి. కర్నాటి గారి సంతాప సభ జరిగిన మరుసటి రోజు ఫోన్ లో మాట్లాడుతూ నా ప్రసంగానికి అసందర్బం గా అర్ధంతరంగా అడ్డుతగిలిన పరిషత్ న్యాయవాదులు పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సభా మర్యాద తెలియని వారిని మన రాం ప్రసాద్ గారు పిలవటం ఏమిటీ? ఉపా చట్టం,అప్రజాస్వామిక చట్టాల గురించి తెలిసి తెలియని వాళ్ళు న్యాయవాదులు ఏమిటి? మతోన్మాద పాసిస్టు భావజాలం అంతమొందించకుండా ఎలా ప్రజల హక్కుల ను కాపాడగలం? సార్ అని ప్రశ్నించారు. ప్రశ్నల పరం పర ప్రశ్న లో ఆయన దిట్ట. ఆ ప్రశ్నించే గొంతుక నేడు శాశ్వతంగా మూగపోయింది.

    ఆ గొంతుక వేల ప్రశ్నలను ప్రజల హక్కుల కోసం రాజ్యం పై సందించిన గొంతుక. వందల సమాధానాలు ప్రజల తరపున చెప్పిన హక్కుల గొంతుక. అందరి ని ఆప్యాయంగా సార్ అనే పిలిచేవారు. ఎవరైనా వాదన కి దిగితే విషయాలు తెలుసు కోవటం కోసం చాలా గట్టిగా నిలబడి వాదించే వారు. మంచి వాగ్ధాటి. తను నమ్మిన విషయాన్ని బల్లగుద్ది చెప్పినట్లు చెప్పేవారు. విషయం వచ్చినప్పుడే అలా వాదించేవారు. ఆ సమయంలోనే అలా బలం గా వాదించేవారు.

      ఆ తర్వాత అలా వాదించిన వ్యక్తి తోనే ఎంతో స్నేహం గా,ఆప్యాయంగా ఉండే వారు. అది మిత్రుడు వెంకటేశ్వర్లు యొక్క గొప్ప వ్యకిత్వం. తను జీవించటానికి,కుటుంబాన్ని పోషించటానికి APSRTC లో ఉద్యోగం చేసేవారు. కానీ ధ్యాస అంతా ప్రజల హక్కుల కోసం, పౌర హక్కుల ఉద్యమం కోసమే. మిత్రుడు వేంకటేశ్వర్లు APSRTC లో చిన్న ఉద్యోగి గా చేరి నిబద్ధత తో పని చేసి ఆఫీసర్ స్థాయి ఉద్యోగి గా ఎదినాడు. Rtc లో కార్మిక వర్గ మేధావి గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.       

         ప్రజలు అందరూ సమాన విలువ,గౌరవ, మర్యాదలు లతో బ్రతకాలని తన జీవిత కాలం పని చేశాడు.ప్రజల కోసం తను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసే ఆర్గనైజర్ లకు ఆర్ధిక సహకారం కూడా అందించే వాడు. పేద ప్రజలు ని అమితంగా ప్రేమించేవాడు.
       
      మంచి స్నేహశీలి. సమ సమాజాన్ని కోరుకున్నాడు.దాని కోసం ప్రజల మధ్య అసమానతలు పెంచే విధానాలు కి వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం పోరాడిన చరిత్ర హక్కుల ఉద్యమనాయకుడు,మిత్రులు వెంకటేశ్వర్లుది. సుదీర్ఘ కాలం పౌర హక్కుల సంఘం ఉద్యమం లో పనిచేశారు. కృష్ణ జిల్లా అధ్యక్షుడు గా, గుంటూరు జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యులు గా దశాబ్దాలు గా సుదీర్ఘ కాలం పనిచేశారు. 

      పౌర హక్కుల సంఘం ఒక పెద్ద సీనియర్ ఆర్గనైజర్ ని కోల్పోయింది. మిత్రుడు ఎం. వెంకటేశ్వర్లు ఆఫీసర్ స్థాయి ఉద్యోగిగా ఉంటు ఇటీవల నిర్బంధ లో సహితం ధైర్యం గాఉపా చట్టం రద్దు చేయాలని ఉద్యమించాడు. పౌర హక్కుల సంఘం లో నిరాడంబరం గా పని చేసిన ఒక గొప్ప హక్కుల ఉద్యమ నాయకుడు.ఆయన కు వినమ్ర జోహార్లు.                    

             ఇట్లు                                
 పౌర హక్కుల సంఘం CLC. నంబూరి. శ్రీమన్నారాయణ.     
 రాష్ట్ర ఉపాధ్యక్షులు.

Comments