మిత్రులారా! నిన్న
అనగా 18-11-2021న రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజా సంఘాల కార్యకర్తల ఇళ్లల్లో, మరియు నెల్లూరు లోని అరవింద నగర్లో ఉంటున్న మహిళా సంఘం కార్యకర్తలైన *అన్నపూర్ణ, అనూష ల ఇంట్లో సోదాల పేరుతో N I A*. (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ )
అధికారులు ఉదయం 6 గం :నుంచి మ :2 గం. వరకు ఆణువణువూ గాలించి భయభ్రాంతులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రేపు ( 20-11-2021) ఉదయం 10-30 కు నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు *ప్రెస్ మీట్* ఉంటుంది. ఈ ప్రెస్ మీట్ కు
*అన్నపూర్ణ, అనూష లతో పాటు వారి తల్లి తండ్రులు* పాల్గొంటున్నారు. వీరికి మద్దతుగా *మేము మీరూ మనమందరం* పాల్గొని ఈ *ఫాసిస్టు చర్యలను* ఖండిద్దాం. *ఈరోజు మనం మాట్లాడకపోతే రేపు* *మాట్లాడేందుకు ఏమీ మిగలదు*
. కావున మీరు తప్పక రాగలరని విజ్ఞప్తి చేస్తున్నాము
*నెల్లూరులో అన్నపూర్ణ,అనూష, హైదరాబాద్ లో నర్ల రవి, అనూరాధ; భవాని, అరుణాంక్ లత; వైజాగ్ లో అన్నపూర్ణ, ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో కళ్యాణ రావు ఇళ్ళపై NIA దాడులు జరిగాయి.*
*ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, వామపక్షాలు ఈ అక్రమ దాడులను ఖండించాలి. రేపు మీరే దీనికి బలవుతారన్న నిజాన్ని మరచిపోవద్దు.*.
ఎల్లంకి. వెంకటేశ్వర్లు.
పౌర హక్కుల సంఘం.
నెల్లూరు జిల్లా కమిటీ.
Comments
Post a Comment