NIA దాడులను ఖండించండి | ప్రజా సంఘాలు

ఏపీ, తెలంగాణాలో NIA దాడులను ఖండించండి!

         నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)ఆధ్వర్యంలో ఈరోజు 18-11-2021న ఉదయం 6 గంటల నుండి ఈక్రింది ప్రజా సంఘాల కార్యకర్తల ఇండ్లపై దాడులు చేసి, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, హార్డ్ డిస్కులు, పుస్తకాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇళ్లలోకి ఎవరినీ, ప్రెస్ వాళ్లను కూడా అనుమతించకుండా, వందలాది మంది పోలీసులను పహారాగా ఉంచి, పరిసరాల ప్రజలను, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 
          రెండు తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజల పరిష్కారం కోసము, న్యాయబద్ధ హక్కుల సాధనకు...రాజ్యాంగబద్ధంగా ఈ ప్రజా సంఘాలు బహిరంగంగా తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
           *NIA దాడులకు గురైనవారు.* 
    1)కె.రవిచందర్, అధ్యక్షుడు, తెలంగాణ ప్రజా ఫ్రంట్(TPF), ఎల్బీనగర్- హైదరాబాద్ 2)నార్ల రవి, & 3)బి. అనురాధ, హిందూత్వ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదిక, నాగోల్- హైదరాబాద్ 4)బి.పద్మ, న్యాయశాస్త్ర విద్యార్థిని- హైదరాబాద్ 5)అరుణాంక్ లత, కవి, హైదరాబాద్ 6)పద్మ కుమారి, & 7)భవాని --అమరుల బంధుమిత్రుల సంఘం, హైదరాబాద్ 7)జి.కళ్యాణ రావు,విప్లవ రచయితల సంఘం, ఆలకురపాడు, ప్రకాశం జిల్లా 8)మాచర్ల మోహన్ రావు, చేనేత సంఘం నాయకుడు, చీరాల, ప్రకాశం జిల్లా 9)అరసవెల్లి కృష్ణ, విప్లవ రచయితల సంఘం- విజయవాడ 10)డప్పు రమేష్, ప్రజాకళాకారుడు-విజయవాడ 11)ఎం శ్రీనివాసరావు,విరసం, &12)అన్నపూర్ణ, చైతన్య మహిళా సంఘం-విశాఖపట్నం 13)రమణయ్య, అమరుల బంధుమిత్రుల సంఘం, నెల్లూరు.

NIA వారు ఇచ్చిన స్వాధీన పంచనామా ఆధారంగా Cr. No: 179/2019చత్తీస్గఢ్ రాష్ట్రం, నగర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరియా గ్రామంలో 28.07.2019 నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మరియు ఒక పౌరుడు మృతిచెందారని, ఆ కేసులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజాసంఘాల నాయకుల ఇండ్ల పైన దాడులు జరిగినాయని ప్రాధమికంగా తెలియవచ్చింది.


1. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మేధావుల పై,ప్రజాసంఘాల కార్యకర్తల పై అక్రమంగా నమోదుచేస్తున్న UAPA కేసులు ఎత్తివేయాలి.

 2. UAPA లాంటి నల్లచట్టాలను రద్దుచేయాలి.

3. విచారణ పేరుతో NIA కార్యాలయానికి ప్రజాసంఘాల నాయకులను పిలిపించుకొని గంటలతరబడి వేధింపులకు గురిచేసారు.
ఇకముందు ఇటువంటి వేధింపులను నిలిపివేయాలి.

4. ప్రజా సంఘాల పై ఇప్పుడు జరుగుతున్న ఈ ముడవ విడుత దాడిని తక్షణమే నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కమిటీలు డిమాండ్ చేస్తున్నది.

1. గడ్డం లక్ష్మణ్. CLC President, TS
2. చిట్టిబాబు AP CLC President
3. N. నారాయణరావ్. CLC General Secretary, TS
4. CH. చంద్రశేఖర్ AP CLC General Secretary.

18.11.2021

Comments