మిత్రులు,IFTU జిల్లా కోశాధికారి శీలబోయిన రాఘవులు కి జోహార్లు*.

*మిత్రులు,IFTU జిల్లా కోశాధికారి శీలబోయిన రాఘవులు కి జోహార్లు*.
             -Clc శ్రీమన్నారాయణ.

          ఏదైనా సలహా కావలసి వచ్చిన కష్టం,ఇబ్బంది కలిగిన అన్నా అని నిండు హృదయం తో ఫోన్ చేసి నవ్వుతూ మాట్లాడే మంచి మిత్రుడు శీలబోయిన రాఘవులు ని కరోనా మింగేసింది. ఇది అత్యంత విషాదకరం. బాధాకరం.కామ్రేడ్ రాఘవులు కి వారి కుటుంబ సభ్యులకు సంతాపం, సానుభూతిని తెలియ చేస్తున్నాము.

  అలుపు ఎరుగని కష్టజీవి. పేద కుటుంబం నుండి రాజకీయం గా ఎదిగినాడు. అకివీడు ప్రాంతం లో పుట్టి,పెరిగినాడు.ఆజాను బాహుడు.ముక్కు సూటి మనిషి.నవ్వుతూ గల గలా మాట్లాడే స్వభావం. చిన్నతనం నుండే కాయకష్టం చేసి బతికినాడు. రైస్ మిల్లు ముఠా వర్కర్ గా పనిచేశాడు.వర్కర్ గా వర్గకసిని నర నరాన నింపుకున్నాడు.వర్గకసి తో దోపిడీ వ్యతిరేక పాటలు పాడేవాడు. ఆకివీడు ప్రాంతం లో అందరికి సుపరిచితడు కామ్రేడ్ రాఘవులు.     


     ఆయన. సాంస్కృతిక రంగలోను,కార్మిరంగంలోను నాయకుడు గా ఎదిగినారు.సమాజంలో అసమానతలు రూపునాపాలని పేదల పక్షాన నిలబడి పని చేశాడు. చివరకు తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారు. తాను చనిపోయే వరకు సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ విప్లవ రాజకీయాల్లో నిలబడి పనిచేశారు. 

   చదువు చిన్నదే అయినా పుస్తక పఠనం తో రాజకీయ చైతన్యం. పెంపొందించుకున్నాడు. మొదట సీపీఎం కి చెందిన ప్రజా నాట్యమండలి, సీటు లలో పనిచేశాడు.ఆ సమయంలో నంద్యాల సుబ్బారావు శిష్యుడు గా మంచి పేరు సంపాదించాడు. 2006-2007 ప్రాంతంలో నంద్యాల సుబ్బారావు గారి తో పాటు cpiml న్యూ డెమోక్రసీ లో చేరినారు. కామ్రేడ్ సుబ్బారావు గారి మరణం తర్వాత ఆకివీడు ప్రాంతంలో IFTU, న్యూడెమోక్రసీ నాయకుడుగా ఎదిగినారు. రాష్ట్ర, జిల్లా కార్యక్రమాలు లో చురుకైన పాత్ర పోషించేవారు.అరుణోదయ సాంస్కృతి సమాఖ్య లో ప్రజా కళారూపాలు ప్రదర్శించేవారు. ఆసంస్థలో జిల్లా నాయకుడుగా కూడా ఎదిగినారు కామ్రేడ్ రాఘవులు.
     మా పౌర హక్కుల సంఘానికి ఆకివీడు, భీమవరం ప్రాంతాల్లో దళితులు పైన దాడులు జరిగినప్పుడు జరిపే నిజనిర్ధారణ లకు, పర్యావరణం పై జరిపే నిజనిర్ధారణ లకు మా టీం తిరిగి వచ్చే వరకు దగ్గర ఉండి భోజనాలు పెట్టించి పంపేవారు.మా సంస్థ పై నిర్బంధం, అణచివేత వచ్చినప్పుడు ఖండిస్తూ కార్యక్రమాలు లో ఉండేవారు. మేము ఉన్నాం అన్న అని ఫోన్ చేసేవారు. చాలా ప్రేమ తో సహకరించేవారు.ఆయనకు గుండె ధైర్యం చొరవ ఎక్కువ గా ఉండేది. అలాంటి మనిషిని కరోనా వైరస్ మింగేసింది. 

    కరోనా వచ్చి ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయిన తర్వాత అరడజను సార్లు మాట్లాడటం జరిగింది. భీమవరం లొనే ఉద్యోగం చేసున్న మిత్రులు విజయరాజ్ గారితో కూడా రాఘవులు గారి గురించి మాట్లాడటం జరిగింది. మందులు ఏమైనా భయట నుంచి పంపాలంటే నేను పంపిస్తాను అన్నారు. ఆ విషయాన్ని కూడా రాఘవులు గారికి చెప్పాను.అవసరం లేదు హాస్పిటల్ లో ఇస్తున్నారు అని ఆయన తెలిపినారు. నిన్న మధ్యాహ్నం మాట్లాడినప్పుడు అంతా బాగానే ఉంది అప్పుడప్పుడు దగ్గు వస్తుంది అన్నారు.మందులు వేసుకుంటున్నాను తగ్గిపోతుంది అన్నారు. బాగా సన్నిహితంగా ఉండే IFTU నాయకులు బద్దా వెంకటరావు గారు డైలీ ఆయన ఆరోగ్యం,వైద్యం పైన పర్యవేక్షణ చేశారు.నాకు తెలిసి కామ్రేడ్ pp, సుధాకర్ అన్నలు కూడా నిత్యం ఫోన్ చేసి ధైర్యం చెప్పేవారు. బంధువులు కూడా అందుబాటులో ఉండి సహకరించారు.  

      కరోనా తగ్గి బయటకు వస్తారు అనుకునే సమయం లో ఈ రోజు 12గంటలకు ఆయన మరణ వార్త వినవలసి వచ్చింది. ఇది ఎంతో బాధాకరం. ఆయన మరణం ఆయన పనిచేస్తున్న IFTU,న్యూడెమోక్రసీ వారికి తీరని లోటు. కుటుంబానికి పూడ్చలేని నష్టం. ఆయన మరణానికి జోహార్లు.

 నా నుండి మా పౌర హక్కుల సంస్థ నుండి సంతాపాన్ని, విచారం, సానుభూతి తెలియ చేస్తున్నాను. 
 
      Clc శ్రీమన్నారాయణ.
          04.05.2021.
  కొవ్వూరు. పశ్చిమగోదావరి జిల్లా.

Comments