ఐలపూర్ గ్రామస్తుడు మామిడి బీరయ్య ఆత్మహత్య పై నిజనిర్దారణ | తెలంగాణ కమిటి

సింగరేణి శ్రీరాంపూర్ 3 బొగ్గుగని లోజరిగిన ప్రమాదంపై హైకోర్టుసిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలి...
యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి పెంపుపై ఒత్తిడి, రక్షణ పర్యవేక్షణ లోపమే, కార్మికులనుబలితీసుకుంది..పౌర హక్కుల సంఘం తెలంగాణ...
శ్రీరాంపూర్ డివిజన్లో ఎస్ ఆర్ పి 3 గని ప్రమాదంలో10 నవంబర్,2021 ఉదయం షిఫ్టులో రూఫ్ ఫాల్ అయి నలుగురు కార్మికులు టీంబర్ మెన్ లు V. కృష్ణా రెడ్డి, బేర లక్ష్మయ్య బదిలీ వర్కర్లు గాదం సత్యనారాయణరాజు,రెంకా చంద్రశేఖర్ లు మరణించడం పట్ల పౌర హక్కుల సంఘం తెలంగాణ వారి కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని మరియు ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది.. ఈఘటనపై హైకోర్టుసిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తుంది...
సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి దాహమే..
 నలుగురు కార్మికులను బలితీసుకుంది...
సింగరేణి యాజమాన్యానికి బొగ్గు ఉత్పత్తి మీద ఉన్న శ్రద్ధ రక్షణ పై లేకపోవడం చిత్త శుద్దితో చేపట్టాల్సిన సేఫ్టీ సమావేశలు జరపకుండా, గనుల పరిరక్షణ పై శ్రద్ధ లేకుండా అధిక ఉత్పత్తి టార్గెట్ల పెంపు లాంటి అంశాలతోపాటు బొగ్గుగనుల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ రోజురోజుకు తగ్గుతున్న కారణం, బ్లాస్టింగ్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు లాంటి ఎన్నో మౌళిక విషయాల లోపం మూలంగా జరుగుతున్న ప్రమాదాల పరంపరలోనిదే ఈ రూఫ్ ఫాల్ సంఘటన చోటు చేసుకున్నట్లుగా ప్రాధమికంగా తెలుస్తున్నది.బొగ్గుగనుల పైన పూర్తి స్థాయి అవగాహన లోపం, కేవలం ఉత్పత్తి మీదనే శ్రద్ధ కేటాయించి, రక్షణ సూత్రాల ఉల్లంఘన ఫలితమే నలుగురు కార్మికులు బలి. గతంలో కూడా అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ KCR మితిమీరిన జోక్యం వల్ల ,గుర్తింపు సంఘం గా 5,అక్టోబర్,2017న TRS అనుబంధ యూనియన్ గా TBGKS సింగరేణిలో గెలవడం నుంచి కుంటు పడుతున్న సేఫ్టీ మీటింగులు, రక్షణ లోపాలపై రివ్యూలు లేకపోవడాలు పేరిగిపోయాయి .ముఖ్యమంత్రి KCR, సింగరేణి CMD శ్రీధర్ లు గత ఏడేండ్లు గా ప్రమాదాల్లో కార్మికులు మరణిస్తే కనీసం వారి కుటుంబాలను పరమర్శించె తీరికలేదు. ఇది అత్యంత అమానవీయ వైఖరి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొగ్గుగనుల్లో ప్రమాదాలు జరిగితే ముఖ్యమంత్రులు కార్మిక కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చేవారు.
రోజు రోజు సింగరేణిలో ప్రైవేటీకరణ పెంచుతూ కాంట్రాక్టు కార్మికుల పై పనిభారంపెంచడం, రక్షణ వైఫల్యాలతో ప్రమాదాలకు గురై కాంట్రాక్టు కార్మికులుకూడా మరణిస్తున్నారు..వీరికి కూడా సరియైన campensation ఇవ్వటం లేదు.సింగరేణిలో ప్రైవేటీకరణ నిలిపి వేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది.
శ్రీరాంపూర్ బొగ్గుగనుల్లో మరణించిన నలుగురు కార్మికుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం మరియు ఉద్యోగంతో పాటు, వచ్చే మిగతా బెనిఫిట్స్ అన్ని అందజేయాలని .పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తుంది...

1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.N.నారాయణ రావు,ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
3.మాదన కుమారస్వామి, సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
4.బుద్దే సత్యం, కన్వీనర్, పౌర హక్కుల సంఘంఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ..
5.A. సారయ్య, కోకన్వీనర్, పౌర హక్కుల సంఘంఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ..
6.J. పోచం,కోకన్వీనర్, పౌర హక్కుల సంఘంఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ....

13 నవంబర్,2021.

Comments