అక్రమ అరెస్టులను ఖండిద్దాం | శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం జిల్లాలోని ప్రజాసంఘాల కార్యకర్తల, ప్రజల అక్రమ అరెస్టులను ఖండిద్దాం

వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళతో అదే గ్రామానికి చెందిన రెయ్యి శ్రీను (నాయుడు)గత 12 సంవత్సరాలుగా సంబంధంలో వుండి, తిరస్కరించడంతో జ్యోతి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫలితం కనిపించక స్థానిక ప్రజాసంఘాలకు ఫిర్యాదు చేయగా, పోలీసుల సలహా మేరకు వూరి పెద్దల సమక్షంలో ఎన్ని సార్లు సమావేశాలు ఏర్పాటు చేసినా రాకపోవడంతో శాంతియుతంగా ర్యాలీ చేస్తుండగా శ్రీను కుమారులు చెప్పులతో ర్యాలీలో పాల్గొన్న వారిని కొట్టారు. ప్రజా సంఘాల వారిపై అసత్యప్రచారాలు చేయడంతో నిరసన కార్యక్రమం చేస్తున్న ప్రజలపై కత్తులతో దాడి చేశారు. వారి దాడినుంచి రక్షించుకోడానికి ప్రజలు వారిని పట్టుకుని వారి యింట్లోనే పెట్టి తలుపులు మూసివేసిన సంఘటనను వక్రీకరించి, మాజీ మావోయిస్టులైన ప్రజాసంఘాల వారు తమపై దాడి చేశారని ఫిర్యాదు చేయగా ప్రజా సంఘాల కార్యకర్తలపై, ప్రజలపై, బాధిత కుటుంబ సభ్యులపై కేసు పెట్టి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అరెస్టు అయినవారిలో అనేకులు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

దానేషు,పౌరహక్కుల సంఘం, కంఠు, ప్రజాకళామండలి, అరుణ, ఉత్తరాంధ్ర మహిళా సంఘం, వీరాస్వామి, పిడిఎమ్ మొదలైనవారిని అరెస్టు చేశారు.

రామాకృష్ణాపురం భూసామస్య మీద ఇంతకుముందు జరిగిన పోరాటానికి సంబంధించి అరుణ, కంఠులకి పిటి వారంట్ తీసుకువచ్చారు. కంఠుపై పిడుగురాళ్ల లో పెట్టిన UAPAకేసులో కూడా పిటి వారంట్ జారీ చేశారు. ఇవాళ కోర్టులో అందరికీ బెయిల్ నిరాకరించబడింది.

ప్రజా సమస్యలపై పోరాడుతున్నవారిపై ఆక్రంకేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని అందరమూ ఖండిద్దాం!

అరెస్టు చేసినవారీనందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలి!

Comments