ప్రొఫెసర్ శేషయ్య, లక్ష్మారెడ్డి గార్ల సంస్మరణ సభ | కడప జిల్లా

07/11/2021 న ఆదివారం నాడు రాయచోటి ఎన్. జీ.ఓ హోమ్ నందు పౌర హక్కుల సంఘం కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్య దర్శి ఆర్.రవిశంకర్ అధ్యక్షతన జరిగిన ప్రొఫెసర్ శేషయ్య,లక్స్మా రెడ్డి గార్ల సంస్మరణ సభలో రాష్ట్ర అధ్యక్షులు చిట్టీ బాబు అధ్యక్షతన జరగిన పౌర హక్కుల ఉద్యమ ధృవతార ,అమరుడు ప్రొఫెసర్ ఎస్.శేషయ్య గారి మొదటి సంస్మరణ సభలో పాల్గొన్న శేషయ్య సహచరి ఆర్.శశి కళ " పౌర హక్కుల ఉద్యమ ధృవ తార- శేషయ్య జ్ఞాపకాలు ,రాష్ట్ర సహాయకార్య దర్శి సి.వెంకటేశ్వర్లు " రాజ్యాంగం_ పౌర హక్కులు" అనే పుస్తకాలను ఆవిష్కరించారు... వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ పౌర హక్కుల కోసం తనజీవితాంతం పోరాడిన శేషయ్య అపర మేధావి,ఆయనలో దాగి ఉన్న జ్ఞాన ఘనిని భావితరాలకు అందించే క్రమంలో ఆయన రాసిన అనేక రచనలను పుస్తకాల రూపంలో తీసుక వస్తున్నామని,ఆయన ఆలోచనలను,ఆశయాలను కొనసాగించినపుడే ఆయనకు నివాళులు అర్పించిన వారం అవుతాయన్నారు.

    శేషయ్య గారి సహచరి శశికళ శేషయ్య గారి గురించి ఆమె మాట్లాడుతూ కర్నూల్ జిల్లా నందికొట్కూరు అనే మారుమూల గ్రామంలో పేద కుటుంబం లో జన్మించి తొమ్మిదేళ్ళ వయస్సులోనే కుటుంబానికి చేదోడుగా వ్యవసాయ కూలీగా,పెయింటర్ గా ఇంటింటికీ పాలు పోస్తూ చదువుకొని ఉన్నతమైన న్య్యాయ శాస్త్ర విద్య చదువుకొని అనంతపురం యూనివర్శిటీ లో ఆచార్యులుగా కొనసాగారు...తన విద్యార్థి దశలోనే RSU రాజకీయాల కు ఆకర్షితులై ,తను పిన్న వయసులోనే ,పేదరికం అనుభవించడం వలన ప్రజల తరపున తన శక్తి కి మించి పనిచేశాడు...పీడిత ప్రజల హక్కుల కోసం దాదాపు నాల్గు దశాబ్దాలుగా పోరాడారని కొనియాడారు...సంస్థ సంక్షోభ సమయంలో ఆయన బాధ్యతలు తీసుకున్న ప్పటి నుండి ఎన్ని నిర్బాందాలు ఉన్నా,బెదిరింపులు వచ్చినను ఏ నాడూ ఆయన భయపడలేదు స్వయంగా ఇంటీ మీద దాడులు జరిగినను చివరివరకు పీడిత ప్రజల వైపే ఉన్నాడని పేర్కొన్నారు...పౌర హక్కుల సంఘం లోని ప్రతి నాయకుడు,కార్యకర్త లను తన కుటుంబ సభ్యులు గానే భావించారు,రాష్ట్రంలో ఎక్కడ హక్కుల ఉల్లంఘనలు జరిగిననూ వెంటనే స్పందించే వారని ,క్రమంగా దేశంలో ఉన్న అన్ని హక్కుల సంఘాలను ఒకే వేదిక పైకి తెచ్చి CDRO సంస్థ కు కన్వీనర్ గా ఎన్నిక్యారు...తన చివరి శ్వాస వరకు భారత దేశ పీడిత ప్రజల హక్కుల కోసం నిరంతరం పనిచేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడుతూ,ఆయన ఆశయాలను కొన సాగించి నపుడే నివాళులు అర్పించిన వారం అవుతామన్నారు...
     ముఖ్య అతిధి గా పాల్గొన్న
      
   ఆంధ్ర ప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్ గారు మాట్లాడుతూ జాతీయ విద్యావిధానం సారాంశంలో కెంద్ర విద్యావిధానం అన్నారు ,విద్యారంగం లో ప్రవేట్ పెట్టుబడికి సకల సౌకర్యాలు సమకూర్చడానికి చట్టం ద్వారా ఏర్పాటు చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం,రాష్ట్రాల ప్రమేయం లేకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారానే విద్యా విధానాన్ని ఫాసిస్ట్ విధానానికి అనుగుణంగా మనువాద న్ని,చొప్పించడం, అన్ని రకాల రిజర్వేషన్స్కు స్వస్తి చెప్పడం దీన్ని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.సీనియార్టి,మెరిట్లను అరేసేస్ భా వ జాలనికి ఉపకరించే విధంగా మార్చడమే ఈ నూతన విద్యావిధానం అని పేర్కొన్నారు.కేంద్రీకరణ,మార్కెట్ సౌలభ్యం,అక్రమ చోరబాటు,ప్రామాణీకరణ అనే పని ముట్ల ద్వారా ఫాసిజాన్ని పాదు కొనేటట్లు చేయడమే బి.జే.పి ఉద్దేశమన్నారు. ఫెడరలిజానికి సమూహ అంతర వైవిధ్యానికి, కాలాల మధ్య మార్పుకు, సంస్కృతిలో పరిణామాన్ని వ్యతిరే కించేదే కొత్త విద్యావిధానం.ప్రగతి శీల శక్తులు ఈ నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు.

   విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.వరలక్ష్మి మాట్లాడుతూ సమాజం లో సగబాగమున్న స్త్రీల పై జరుగుతున్న హింస గురించి ఆందోళన వ్యక్తం చేశారు...పనిచేసే ప్రదేశాల్లో,విద్యాలయాల్లో వారికి రక్షణ లేకుండా పోతున్నది..దీనికంతటికీ పోర్న్ వీడియో లు,పాచ్యాత్య సంకృతి అనిపిర్కొన్నారు...సంఘటనలు జరగడానికి మూలాలు రూపు మాపకుందా ,తాత్కాలిక చర్యలు తీసుకుంటే ఆగిపోవని పేర్కొన్నారు.

  ఈ కార్యక్రమంలో మైనార్టీ హక్కుల నాయకుడు సగీర్ ,పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి. రెడ్డయ్య,సహాయ కార్యదర్శి ఏం.రవిశంకర్,కోషాధి కారి వంగిమల్ల రమణయ్య,చైతన్య మహిళా జిల్లా కార్యదర్శి ఆర్.ఝాన్సీ,పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

            ఆర్.రవిశంకర్
జిల్లా కార్యదర్శి,
పౌర హక్కుల సంఘం,
కడప జిల్లా కమిటీ
07/11/2021.

Comments