పురుషోత్తం 21వ సంస్మరణ సభ | గోదావరిఖని

అమరుడు పౌర హక్కుల నాయకుడు పురుషోత్తం 21వ సంస్మరణ సభ..గోదావరిఖని..
***************************************
పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో.. పౌర హక్కుల నాయకుడు అమరుడు పురుషోత్తం 21వ సంస్మరణ సభ..
 -స్నేహసాహితి గ్రంథాలయం-మార్కండేయ కాలనీ:గోదావరిఖనిలో 23 నవంబర్,2021,మంగళవారంన.. (,పెద్దపెల్లి జిల్లా),-3:00 మధ్యాహ్నం మూడు గంటలకు నుండి సాయంత్రం 6:45గంటల వరకు జరిగినది.....

ప్రైవేటు హంతక ముఠాలతో పౌరహక్కుల నాయకులను హత్య చేయడం ద్వారా ఉద్యమాలను ఆపలేరని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నారాయణ రావు పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖని లోని స్నేహ సాహితి గ్రంథాలయం ఆవరణలో జరిగిన పౌరహక్కుల నాయకుడు పురుషోత్తం 21వ సంస్మరణ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజల పక్షాన రాజ్యాంగ పరిధిలో పోరాడుతున్న పౌర హక్కుల సంఘాన్ని చేయాలనుకోవడం, అంతం చేయాలనుకోవడం పగటి కల గానే మిగిలిపోతుందనే సత్యాన్ని పాలకులు గమనించాలని అన్నారు. రాజ్యాంగ0  ప్రసాదించిన హక్కులకోసం దేశవ్యాప్త హక్కుల సంఘాలతో కలసి ఉద్యమిస్తున్న పౌర హక్కుల సంఘాన్ని ఎన్ ఐ ఏ పేరిట ఉపా చట్టాన్ని దుర్వినియోగ పరుస్తూ, ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని పౌరహక్కుల సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజల మౌలిక సమస్యలను ఎత్తుకొని పోరాడుతున్న పౌరహక్కుల నాయకులను, సంఘాలను ఎన్ ఐ ఎ పేరిట తప్పుడు కేసులతో భయపెట్టడం తగదని స్పష్టం చేశారు. కాశ్మీర్లో  హక్కుల నేత పర్వేజ్ పై  నమోదు చేసిన ఉపా కేసును రద్దు చేయాలని, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో బొగ్గుగని కార్మికుల జీవితాలకు ప్రతిబింబంగా నిలిచిన మసి మెరుపు మాదాసి బాణయ్య పుస్తకం అంటూ కొనియాడారు. పుస్తకంలోని ప్రతి విషయం గని కార్మికుల పోరాటాలు, అధికారుల దుర్మార్గాలను కళ్ళకు కట్టినట్టు పేర్కొన్నారని తెలిపారు. ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా గని కార్మికుల జీవితాలను అధ్యయనం చేసినట్లేనని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణ రావు పేర్కొన్నారు...

ఈ సంస్మరణ సభలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ పురుషోత్తం,గోపి రాజన్న, జాపా లక్ష్మారెడ్డి, డాక్టర్ రామనాధం, నర్రా ప్రభాకర్ రెడ్డి, ఆజాం అలీ ల అమరత్వాన్ని, పౌర హక్కుల సంఘం ఉద్యమ చరిత్ర ను,  దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అరెస్టు లు,విచ్చల విడి బూటకపు ఎన్కౌంటర్లు అందులోభాగంగానే, అప్పటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యమంత్రి వెంగళరావు కొనసాగించిన క్రూరమైన నిర్బంధం ఉద్యమ కారుల ఎన్కౌంటర్లు ప్రజా చైతన్యం, సిరిసిల్ల జగిత్యాల పోరాటాలు,ఇక్కడి ప్రజా ఉద్యమాలు, రాజకీయ పార్టీలు అధికారంలోకి రాక ముందు నక్సలైట్లే దేశభక్తులని, వారి ఎజెండా తమ ఏజెండా అని మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ,N T రామారావు తెలుగుదేశం పార్టీ,ప్రపంచ బ్యాంకు పాలసిలకు అనుగుణంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఆయన కాలంలోనే పురుడు పోసుకున్న రాజ్య కనుసన్నల్లో పెరిగిననయీమ్ గ్యాంగ్ హంతక ముఠాలు,బషీర్ బాగ్ కరెంటు నిరసన కారులపై,కాల్పులు, గుర్రల్లో తొక్కించడాళ్లు, గద్దర్ పై కాల్పులు, వరంగల్ డిక్లరేషన్, భువనగిరి సభ, తెలంగాణా జనసభ, మలిదశ తెలంగాణ ఉద్యమం,2001 లో KCR TRS పార్టీ ఆవిర్భావం,అలిపిరి లో చంద్రబాబు పై దాడి , 2004 ముందస్తుఎన్నికల్లో  నక్సలైట్లతో చర్చలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లాంటి ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా కొనసాగించిన చర్చల మోసం, నిర్బంధం ఉద్యకారుల ఊచకోత,  29 నవంబర్,2009 తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రకటన తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన విద్యార్థుల తెలంగాణ ఉద్యమం యావత్ తెలంగాణ ప్రజల ఉద్యమాలు, మిలియన్ మార్చ్ ,సాగర హారం, సకల జనుల సమ్మె-సింగరేణి కార్మికుల నిరవధిక సమ్మె, RTC కార్మికుల సమ్మేళతో ఢిల్లీకి సెగ తగిలి తప్పని సరిపరిస్థితి లో దిగివచ్చిన కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ లో మావోయిస్టుల ఏజెండా ఏ మా ఏజెండా అని చెప్పి 2 జూన్ 2014 అధికారం లోకి వచ్చిన కేసీఆర్ కొనసాగిస్తున్న నిర్బంధం, ధర్నా చౌక్ ఎత్తివేత,హక్కుల ఉల్లంఘన లతో,నల్లధనం విదేశాల నుండి తెప్పిస్తామని, యువత కు పెద్దఎత్తున ఉద్యోగాలు ఇస్తామని ,అవినీతి పాలన ఉండదని చెప్పి 2014 జూన్ లొనే, కేంద్రం లోకి అధికారంలోకి వచ్చిన BJP పార్టీ మోడీ ఆధ్వర్యంలో ఫాసిస్టు పాలనకొనసాగిస్తూ ,అహేరీ కుట్రకేసుతో 90 శాతం వికాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాను అండా సెల్లో జీవిత ఖైదు చేసినారు. 2018 నుండి  భీమకోరేగామ్ కుట్రతో దేశంలోని ప్రముఖ మేధావులైన, ఆనంద్ తెల్ టుంబ్డే,గౌతమ్ నవలాఖ,సుధభరద్వాజ్,వరవరరావు,రోనావిల్సన్, సురేంద్రా గాడ్లింగ్,అరున్ పేరిర, మహేష్ రవాత్, లతో పాటు 17 మంది మేధావులను జైల్లో నిర్బంధించారు. కనీసం సిప్పర్ తాగడానికి కూడా అనుమతివ్వకుండా 82 సంవత్సరాల ఫాదర్ స్టాన్ స్వామిని హత్యచేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో సైన్యం మోహరింపు, bahulajaathi కంపెనీలకోసం వనరుల తరలింపు కు ఆదివాసీలను నిర్వాసితులను చేసి గ్రీన్ హుంట్లు, నిన్నటి మిలిన్డ్ టెల్ టుంబ్డే మరియు మిగితా25 మంది క్రూర హత్యలు,2018 ఏప్రిల్,23 నాటి కసన్ సూర్ -ఇంద్రావతి నది వద్ద జరిపిన ఎంకౌంటర్ ల హత్యాకాండలు,మూడు రైతు వ్యతిరేక చట్టాలు వాటికోసం వీరోచితంగా ఉద్యమిస్తున్న రైతాంగంపై నిర్బంధం,700 మంది రైతుల అమరత్వం, లఖిమ్ పూర్ ఖేరిలో బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు స్వయంగా కారుతో తొక్కించి 4 గురు రైతుల హత్య, తుపాకీ కాల్పులు ఒక జర్నలిస్ట్ తో పాటు మరి 8 మంది వరకు రైతుల  మరణాలు,దేశవ్యాప్తంగా ఎదురౌతున్న బీజేపీ వ్యతిరేకత UP మరియు మిగతా5 రాష్ట్రాల ఎన్నికల నేపధ్యంలో మోడీ మూడు రైతు చట్టాల ను ఉపసంహరించుకోవడం.. KCR ,హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోవడం, వరి ఎస్తే ఉరి లాంటి విధానాలను,వైఫల్యాలను కప్పిపుచుకోవదడానికి,ధర్నా లు దొంగదీక్షలు చేసిండని,BJP కేంద్ర ప్రభుత్వం తెచ్చినమూడు  నూతన వ్యవసాయ చట్టాలు&నూతన విద్యుత్ సవరణ చట్టం రద్దు కొరకు10,11 జనవరి 2021 తేదీలలో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా గోపి రాజన్న స్వగ్రామం కొల్వాయి నుండి జగిత్యాల వరకురెండు రోజుల ప్రచార పాదయాత్ర పెడితే KCR ప్రభుత్వం భగ్నం చేసి 8 మంది పౌర హక్కుల సంఘం నాయకులను అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ల లో నిర్బంధించారు.. పార్లమెంటు లో ఈ రైతు చట్టాల బిల్లుకు kcr మద్దతు తెలిపి,ఇప్పుడు తన ధర్నాలతో మోడీ వచ్చిండని kcr అబద్దాలతో తనే ధర్నాలు చేయాలని ఇంకెవరు నిరసనలు, పోరాటాలు చేయొద్దని నియంతృత్వం ప్రయోగిస్తున్నడని వక్తలు  ఈ సంస్మరణ సభలో మాట్లాడినారు....

1.N. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం, తెలంగాణ.
2.మాదన కుమారస్వామి, సహాయకార్యదర్శి, పౌర హక్కుల సంఘం, తెలంగాణ.
3.శ్రీపతి రాజగోపాల్, ఉపాధ్యక్షుడు, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
4.పుల్ల సుచరిత, సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
5.నార వినోద్, కోశాధికారి,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
6.లక్ష్మణ్, EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
7.బొడ్డుపెళ్లి,EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
8.యాదవనేని పర్వతాలు,EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
9పోగుల రాజేశం,EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
10జాబాలి, ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ.
11గాండ్ల మల్లేశం, TPF పెద్దపెల్లి జిల్లా నాయకుడు..
12.అడేపు సమ్మయ్య, RTC ప్రజా కళామండలి.
13.మార్వాడీ సుదర్శన్, ప్రధాన కార్యదర్శి, దళిత లిబరేషన్ ఫ్రంట్, తెలంగాణ రాష్ట్రం.
14.ముడిమడుగుల మల్లన్న. అధ్యక్షుడు, రైతు సంఘము, తెలంగాణ.
15.ఎరుకల రాజన్న, ఉపాధ్యక్షుడు,రైతు సంఘము, తెలంగాణ.
16.పోరెడ్డి వెంకటరెడ్డి, ప్రజా సంఘాల నాయకుడు.
17.మాదాసి రామమూర్తి, సీనియర్ జర్నలిస్ట్,సింగరేణి తెలంగాణ JAC కన్వీనర్.
18.ఏలేశ్వరం వెంకటేశ్వర్లు. కవి,విమర్శకులు, స్నేహా సాహితీ గ్రంధాలయ వ్యవస్థాపకులు.
19.రాజు,  అధ్యక్షుడు మరియు న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపకులు.
20అశోక్, ప్రధాన కార్యదర్శి,న్యూ ఇండియా పార్టీ .
21పొన్నం రాయమల్లు.ప్రజా సంఘాల నాయకుడు.
22.రాజమౌళి,ప్రజా సంఘాల నాయకుడు.
ఇంకా ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు..

స్నేహసాహితి గ్రంథాలయం-మార్కండేయ కాలనీ:
7:00 రాత్రి... 23 నవంబర్,2021,మంగళవారం
 గోదావరిఖనిలో,పెద్దపెల్లి జిల్లా...

Comments