ప్రెస్ నోట్ హైకోర్టు నేలపాడు19.11.2021.
ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలో 3 అప్రజాస్వామిక చట్టాల రద్దు కోసం భారత దేశ రైతాంగం జరిపిన పోరాటం సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఉద్యమం అని పలువురు Ap హైకోర్టు న్యాయవాదులు కొనియాడారు. 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి మోడీ ప్రకటించిన నేపద్యలో ఇది రైతుల పోరాట విజయం అని Ap హైకోర్టు న్యాయవాదులు అభివర్ణించారు.ఈ రోజు హైకోర్టు జాతీయ జెండా వద్ద విజయోత్సవ కార్యక్రమం న్యాయవాదులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ రైతులకు జేజేలు పలికినారు. ఈ కార్యక్రమాన్ని CLC న్యాయవాది నంబూరి. శ్రీమన్నారాయణ కో ఆర్డినేట్ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు DNS ప్రసాద్ బాబు, IAPL న్యాయవాదిD. సురేష్ బాబు,AILU న్యాయవాది.నర్రా శ్రీనివాసరావు,PUCL న్యాయవాది సైదారావు, న్యాయవాదులు జడ శ్రావణ్, పాటిబండ్ల ప్రభాకర్,జై భీమ్, రావు,తదితరులు పాల్గొని ప్రసంగించారు. అన్ని అప్రజాస్వామిక చట్టాలను రద్దు చెయ్యాలి అని డిమాండ్ చేశారు.
ఇట్లు
నంబూరి. శ్రీమన్నారాయణ
హైకోర్టు న్యాయవాది.
రాష్ట్ర ఉపాధ్యక్షులు, పౌర హక్కుల సంఘం. CLC.
Comments
Post a Comment