గెడ్డం శ్రీను హంతకులను తక్షణం అరెస్ట్ చేయాలి | పచ్చిమ గోదావరి జిల్లా

ప్రెస్ నోట్. కొవ్వూరు.21.10.2021
*******************************
20.10.2021 న తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామం లోని షెడ్యూల్ క్యాస్ట్ కి చెందిన పాలేరు గెడ్డం శ్రీను హంతకులను తక్షణం అరెస్ట్ చేయాలని పౌరహక్కుల సంఘం నిజ నిర్ధారణ బృందం డిమాండ్ చేసింది.
        ఈరోజు బృందం మలకపల్లి గ్రామం లోని వారి ఇంటి వద్ద గెడ్డం శ్రీను తల్లిదండ్రులు ని పరామర్శించినారు. వారు తల్లిదండ్రులుగెడ్డం అబ్బులు,వెంకాయమ్మ ని ఓదార్చినారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి. శ్రీమన్నారాయణ మాట్లాడుతు బృందం నిజ నిర్ధారణ లో ఇది హాత్యే నని ఆత్మహత్య కాదని నిర్దారణ అయింది అన్నారు. హంతకులు ఆత్మహత్య గా చిత్రీకరణ గా చేసే ప్రయత్నం చేశారు అన్నారు.కొట్టి చంపి కొన ఊపిరి తో ఉన్నప్పుడు పురుగుల మంది నోట్లో పోసి ఆత్మహత్య గా చిత్రీకరణ చేశారు అన్నారు. శవం పైన ఉన్న గాయాలు,మర్మాంగం పైన ఉన్న దెబ్బలు చూసిన ప్రజలు చాలా స్పష్టంగా ఇది హత్య అని మా విచారణలో ప్రజలు తెలియ చేశారు అని అన్నారు.
      ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల sc లు హత్యకు గురికాబడినప్పుడు పోలీసులు, రెవెన్యూ యంత్రాగం దర్యాప్తు చట్టప్రకారం జరపకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నారు. గెడ్డం శ్రీను కేసులో 174 కేసు గా నమోదు చేయడం సరికాదని అన్నారు. 
 డిమాండ్స్:
1)తక్షణం ఐపీసీ 302 గా ఆల్టర్ చేసి కేసుని నిష్పక్షపాతంగా విచారణ చెయ్యాలి అని అన్నారు.

2) జ్యూడిషియల్ ఎంక్విరీ కి ఆదేశించాలి అని బృందం డిమాండ్ చేసింది.

3) Sc కమిషన్ సీరియస్ గా జోక్యం చేసుకుని దోషులను తక్షణం పట్టుకుని అరెస్ట్ చేయాయటానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

4) కేసు విచారణ కు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయాలని సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణ లో కేసు విచారణ జరపాలని ప్రభుత్వాన్ని బృందం డిమాండ్ చేసింది.   

5) ప్రభుత్వం చట్ట ప్రకారం న్యాయం చేసి కుటుంభాన్ని ఆదుకోవాలని, 5ఎకరాలు భూమిని కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసి ఇవ్వాలని బృందం డిమాండ్ చేసింది.

6) రాష్ట్రంలో ఇప్పటి వరకు sc,st లపై జరిగిన దాడులు, హత్యలు,హత్యాచారాల పై ప్రభుత్వం తీసుకున్న చర్యలు పైన శ్వేత పత్రం విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం నిజ నిర్ధారణ బృందం డిమాండ్ చేసింది. 
               
              ఇట్లు 
పౌర హక్కులసంఘం CLC
 నిజ నిర్ధారణ బృందం. 

నిజ నిర్ధారణ బృందం సభ్యులు:
1.నంబూరి. శ్రీమన్నారాయణ
రాష్ట్ర ఉపాధ్యక్షులు
పౌర హక్కుల సంఘం.
ఆంధ్రప్రదేశ్.

2.నక్కా. వెంకటరత్నం.
జిల్లా అధ్యక్షులు
పౌర హక్కుల సంఘం.
పశ్చిమగోదావరి జిల్లా.

3.ఈమని. మల్లిక
కమిటీ సభ్యులు
పౌర హక్కుల సంఘం
పశ్చిమగోదావరి జిల్లా.
21.10.2021 కొవ్వూరు.

Comments