మావోయిస్టు నాయకుడు రామకృష్ణ మరణంపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాలి | సి ఎల్ సి

మావోయిస్టు నాయకుడు రామకృష్ణ మరణంపై చత్తీస్గఢ్ ,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,ఒడిషా ప్రభుత్వాలు అధికార ప్రకటన తెలియ జేయాలి....పౌర హక్కుల సంఘం.....

 14 అక్టోబర్,2021 సాయంత్రం నుండి తెలుగు,చత్తీస్గఢ్ మీడియాలో, మావోయిస్టు పార్టీ నాయకుడు రామకృష్ణ అనారోగ్యంతో చనిపోయినాడని ,చత్తీస్గఢ్ పోలీసులు ధ్రువీకరించారని స్పెషల్ స్టోరీస్ తో పాటు బ్రేకింగ్ న్యూస్లతో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈరోజు 15 అక్టోబర్,2021, ఇప్పటి వరకు (ఉదయం 11 గంటల వరకు) చత్తీస్గఢ్ ,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , ఒడిశా ప్రభుత్వాలు అధికారికంగా మీడియాలో ఒకప్రకటనచేయలేదు. ఉద్యమకారుల మరణం పై ప్రభుత్వాలు ఒక స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు కుటుంబసభ్యులకు అధికారికంగా తెలియజేయడం కనీస బాధ్యత.కానీ ఇప్పటివరకు మీడియా ప్రచారం గందరగోళం సృష్టించడంతో చత్తీస్గఢ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏమీ తెలియజెప్పకుండా మౌనంగా ఉండడంతో రామకృష్ణ కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రులు తీవ్ర మానసిక ఆందోళనకు గురైతున్నారు.బాధ్యతతో మెలగాల్సిన మీడియా వైఖరి కూడ సరిగ్గా లేదు. ఈ వైఖరి నాగరిక, ప్రజాస్వామిక సమాజంలో సరికాదు.ఈ ఘటనపై వెంటనే చత్తీస్గఢ్ , తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,ఒడిషా ప్రభుత్వాలు రామకృష్ణ ఆరోగ్యం గూర్చి లేదా వస్తున్న మరణవార్త పైన నైన అధికారప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వాల బాధ్యత కూడా.ఉద్యమనేతల పట్ల అసత్య ప్రచారాలతో ప్రభుత్వాలు ఇప్పటికే నిండా మునిగి ఉన్నాయి, కాబట్టి వెంటనే అధికారికంగా ఏ విషయాన్నిఅయిన ప్రకటించాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లు డిమాండ్ చేస్తున్నాయి...

1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.V.చిట్టి బాబు,అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం,ఆంధ్రప్రదేశ్.
3.N. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం తెలంగాణ.
 4.చిలుక.చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం,ఆంధ్రప్రదేశ్.
5.V. రఘునాథ్, కన్వీనర్, CDRO..
6.క్రాంతి చైతన్య,కన్వీనర్, CDRO..

ఉదయం 11:00 గంటలు,15అక్టోబర్,2021.
హైదరాబాద్..

Comments