పౌర హక్కుల సంఘం రథ సారథి, అమరుడు ప్రొఫెసర్ ఎస్.శేషయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా కమిటీ ఆయనను స్మరించుకుని ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శేషయ్య గారు తన విద్యార్థి దశ నుండి సామాజిక స్పృహ కల్గి , సమాజం లో నెలకొని ఉన్న అస మానతలను రూపు మాపుటకు ఎనలేని కృషి చేశారు.
.పీడిత ప్రజల హక్కుల కొరకు చివరి వరకు పోరాడారు...రాయలసీమ భూస్వామ్య ముఠాలకు వ్యతిరేకంగా పోరాడారు.దళితుల,ముస్లింల ,మహిళ ల పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడటమే గాకుండా వారికి మద్దతు గా నిలబడ్డారు.. సమాజం లో అణగారిన ప్రజల హక్కుల కొరకు నిరంతరం పనిచేశారు అని కొనియాడారు.
రాయలసీమ లో కరువు పోవాలంటే నీటి ప్రాజెక్ట్ లు సత్వరమే నిర్మించాలని బలంగా కోరుకునేవారు. సమసమాజం కొరకు ప్రజా ఉద్య మాల ద్వారా సాధ్య మవుతుంది అని బలంగా విశ్వసించారు....పీడిత ప్రజల హక్కుల కొరకు పరితపించిన ఆయన మృతి ప్రజలకు,ప్రజా సంఘాల కు,ముఖ్యంగా పౌర హక్కుల సంఘం నకు తీరని లోటని పేర్కొన్నారు...ఆయన ఆశయాలు కొనసాగించిన పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన ట్లు అవుతుందని పేర్కొన్నారు...ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆర్.రవి శంకర్,సహాయ కార్యదర్శి ఏం.రవి శంకర్,ఉపాధ్యక్షులు పి. రెడ్డయ్య,కోశాధికారి వంగిమళ్ళ రమణయ్య,కార్య వర్గ సభ్యులు y.పుల్లయ్య,ముస్లిం మైనార్టీ నాయకులు ఖాదర్ బాషా,దళిత నాయకులు వెంకటరమణ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు...
Comments
Post a Comment