ప్రొఫెసర్ శేషయ్య మొదటి సంస్మరణ సభ 17వ తేదీ గుంటూరు లో | సి ఎల్ సి

ఆదివారం నాడు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ శేషయ్య సంస్మరణ సభ.

రాష్ట్రంలో పౌర హక్కుల ఉద్యమానికి వెన్నంటి ఉండి తుదికంటా ఆశయాల కోసం పోరాడిన పౌర హక్కుల నేత, న్యాయవాద ప్రొఫెసర్ శేషయ్య మొదటి సంస్మరణ సభ 17వ తేదీ ఆదివారం స్థానిక బ్రాడీపేట సిపిఎం కార్యాలయం కొరటాల సత్యనారాయణ సమావేశ మందిరంలో రోజంతా దొరుకుతుందని సభకు అధిక సంఖ్యలో ప్రజలు, ప్రజా, పౌరహక్కుల సంఘాల నేతలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశులు పిలుపునిచ్చారు.

గురువారం స్థానిక అరండల్ పేట సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో వివిధ ప్రజా సంఘాల నేతలతో కలిసి ప్రొఫెసర్ శేషయ్య సంస్మరణ సభ గోడ పత్రికలను, కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సి ఎల్ సి జిల్లా కార్యదర్శి వెంకటేశులు మాట్లాడుతూ సిఎల్ సి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు V. చిట్టిబాబు అధ్యక్షత వహించే ఈ కార్యక్రమంలో అఖిలభారత విద్యాహక్కు సమాఖ్య చైర్మన్ ప్రొఫెసర్ జగ్ మోహన్ సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొని "వ్యవసాయం కార్పొరేటీకరణ-రైతాంగ ఉద్యమం" అంశంపై ప్రసంగిస్తారన్నారు. ప్రొఫెసర్ శేషయ్య సహచరి ఆర్ శశికళ "పౌర హక్కుల ఉద్యమ ధృవతార" పుస్తకాన్ని, పి ఎల్ సి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు క్రాంతి చైతన్య "రాజ్యాంగం- పౌర హక్కులు" అనే పుస్తకాలను ఆవిష్కరిస్తారని చెప్పారు. జాతీయ విద్యా విధానంపై ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్, సి ఎల్ సి ఏపీ కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ తదితరులు పాల్గొంటారని తెలియజేశారు.

గోడ, ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్య, డి టి ఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎస్ లక్ష్మారెడ్డి, కుల నిర్మూలన పోరాట సమితి బత్తుల విల్సన్, సి ఎల్ సి నాయకులుN V. నరసింహారావు, B. విజయభాస్కర్, ఐ.ఎఫ్.టి.యు రెడ్డి శ్రీను, ఎస్ ఎన్ పి ఎస్ ఆశీర్వాదం, ఏపీ సాట్ రమణయ్య, పి డి ఎస్ యు నాయకులు యు గని రాజు తదితరులు పాల్గొన్నారు

Comments