ఆఫ్ఘనిస్తాన్‌ పరిస్థితులను ఎలా అర్ధం చేసుకోవాలి | అమన్

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల మెరుపుదాడి జరిగింది. వాళ్ళు  అధికారాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇది  విఫలమైన,  ప్రజలు అత్యంత అసహ్యించుకున్న యుఎస్ సామ్రాజ్యవాద యుద్ధం ముగింపుకు సూచన. యుఎస్ దళాలను ప్రణాళికాబద్ధంగా ఉపసంహరించుకోవడ మనేది ముందస్తు ప్రణాళిక. కేవలం ఒక వారం వ్యవధిలో రాజధాని నగరం కాబూల్‌లోకి  తాలిబాన్లు ప్రవేశించారు. అన్ని ప్రావిన్షియల్ రాజధానులు, నగరాలు, అన్ని సరిహద్దులును వాళ్లు దాటారు. 
 యుఎస్ ఆక్రమణ ఓటమిని అంగీకరించింది.  సెప్టెంబర్ 1, 21న యుఎస్ దళాలు తమ షెడ్యూల్ ఉపసంహరణను పూర్తి చేయకముందే తాలిబన్లు  దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తాలిబాన్  సాయుధ దళాలు  రాజకీయ ఆధిపత్యాన్ని కూడా సాధించాయి. మెజారిటీ  ప్రజల మద్దతును గెలుచుకోవడం వల్లే వారు అధికారాన్ని పొందగలిగారని చెప్పలేం. అమెరికా దురాక్రమణ వల్ల, సైనిక పాలన వల్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారు. అందువల్లే ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా ఆక్రమణ పూర్తిగా విఫలమయింది. యుఎస్ సామ్రాజ్యవాదులు మితిమీరిన సైనిక శక్తిని వినియోగించడం ద్వారా మాత్రమే 20 సంవత్సరాలు  ఆఫ్ఘనిస్తాన్ లో ఉండగలిగారు. 

 ఆఫ్ఘనిస్తాన్  విముక్తిదారులు తామే ననే యుఎస్ సామ్రాజ్యవాదులు  అబద్ధాలను ప్రచారం చేసుకున్నారు. ఇది అబద్దమని ప్రపంచానికి అర్ధమైంది.  యుఎస్ కౌంటర్ఇన్జెన్సీ పూర్తిగా ఓడిపోయింది. తమ స్వాతంత్య్రం కోసం పోరాడాలని ఆఫ్ఘనిస్తాన్ లోని కొంతమంది మత ప్రజలు నిశ్చయించుకున్నారు.  విదేశీ దురాక్రమణదారులు తమ శక్తిని ఎప్పటికీ కొనసాగించలేరని చరిత్ర మరొమారు  రుజువు చేసింది.

తాలిబాన్లు కాబూల్ దళాల నుండి కొద్దిగా సాయుధ వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అనేక యూ ఎస్ వ్యవస్థీకృత సైనిక విభాగాలు తమ ప్రాంతాలను విడిచిపెట్టాయి. అష్రాఫ్ ఘనీ  అవినీతి, నేరపూరిత విధానాలు ప్రజలను విసిగించాయి. యుఎస్ తోలుబొమ్మ ప్రభుత్వాన్ని  అసహ్యించుకునే ఆఫ్ఘన్ ప్రజల నుండి ప్రతిఘటన లేకుండా యూ ఎస్ సైనిక పాలన జరిగింది.  అమెరికా తోలుబొమ్మ పరిపాలన  వారికి భయం, ఆందోళన,  పేదరికం తప్ప మరేమీ మిగల్చలేదు.

తాలిబాన్లు ఎక్కువగా విజయం సాధించడానికి కొన్ని కారణాలు వున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ను తమలో తాము చెజిక్కించుకునేందుకు అనేక తెగలునాయకులు పోటీ పడుతున్నారు. వాళ్ల మొదటి శత్రువు అమెరికా సైన్యం. అందుకే వాళ్ళు వారి స్వంత జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవాలనే లక్ష్యంతో తాళిబాన్లకు మద్దతు ఇచ్చారు. స్వదేశీ విదేశీ పెట్టుబడిదారుల మద్దతు కూడా తాలిబాన్ లకు వుంది.

తాలిబన్లు తిరిగి రావడం నిస్సందేహంగా ప్రజల హక్కులను కాలరాస్థాయి. అయితే అమెరికా సైనిక పరిపాలన కన్నా ఇది మేలని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ప్రస్తుతానికి భావిస్తున్నారు. సామ్రాజ్యవాదులు ఆఫ్ఘనిస్తాన్  వనరులను దోచుకోవడానికి, ఆఫ్ఘన్ ప్రజలను దోపిడీ చేయడానికి,  పెద్ద పెట్టుబడిదారీ ప్రయోజనాల ప్రవేశానికి ఇది మార్గం సుగమం చేస్తుంది. తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం దేశాన్ని సమర్థవంతంగా నడిపించగలదా అనేది సందేహమే. చివరికి  యుద్దవీరులు తమ స్వప్రయోజనాలను కాపాడుకోవడానికే అధిక ప్రాధాన్యతనిస్తారు.

ఆఫ్ఘనిస్తాన్‌లోని కార్మికులు, రైతులు,   ప్రజలు జాతీయ  సామాజిక విముక్తిని ఆకాంక్షిస్తూనే ఉన్నారు. విప్లవాత్మక మార్పు కోసం ఆఫ్ఘన్ ప్రజల పోరాడటానికి, ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు అనుకూలంగా వున్నాయి.

  20 సంవత్సరాల పోరాటం తర్వాత కొద్ది రోజుల్లోనే తాలిబాన్లు శత్రువులను హైటెక్ ఆయుధాలతో ఎలా ఓడించారు. అఫ్గానిస్తాన్‌ను ఎలా స్వాధీనం చేసుకున్నారు అనేది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న.

ఇక్కడ కీలకమైనది విదేశీ ఆధిపత్యం. దీన్ని ప్రజలు వ్యతిరేకించారు.  అవినీతి తోలుబొమ్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడారు.  క్రూరమైన పట్టణ-ఆధారిత ప్రభుత్వానికి సమాంతరంగా గ్రామీణ-ఆధారిత ప్రభుత్వాన్ని తాలిబన్లు క్రమంగా అభివృద్ధి చేశారు.

ఇటువంటి సమాంతర ప్రభుత్వానికి రాజకీయ  నాయకత్వాన్ని తాలిబన్లు అందించారు. మతతత్త్వం,  తాలిబాన్ సైన్యం,  ప్రజా సంస్థలు,   స్థానిక సంస్థల మద్దతు ఇవన్నీ అనుకూలంగా మారాయి

తాలిబాన్ లది మతపరమైన, మతోన్మాద రాజకీయ పరిపాలన. అయితే  సామ్రాజ్యవాద, అవినీతి,  క్రూరమైన తోలుబొమ్మ ప్రభుత్వంపై పోరాడే సాపేక్షక  పాత్రను పోషించి విజయం సాధించారు. 1990 వ దశకంలో US మద్దతు ఉన్న ముజాహిదీన్  లు కూడా వీళ్ళే  కావడం గమనించాలి.

నిజానికి సెప్టెంబర్ 21, 2019 న అమెరికన్ల, తాలిబాన్ల మధ్య  "శాంతి చర్చలు" జరిగాయి.  తాలిబాన్ వాటిని "ఆఫ్ఘనిస్తాన్ నుండి విదేశీ దళాల ఉపసంహరణ కోసం చర్చలు" అని చెప్పింది.

ఆక్రమిత సామ్రాజ్యవాద శక్తుల అంతర్గత సారాంశం ఏంటంటే దాని అన్ని లక్షణాలతో సామ్రాజ్యవాదంగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉండటం. తోలుబొమ్మ పాలన  అంతర్గత సారాంశం  వలసవాద వ్యవస్థను కొనసాగించడం. తాలిబాన్ అంతర్గత సారాంశం సెమీ ఫ్యూడల్,  సెమీ-కలోనియల్ ను కొనసాగించడం. 

 తాలిబాన్  ఆలోచన,  సామ్రాజ్యవాద ఆక్రమణదారుల ఆలోచన,  తోలుబొమ్మ పాలన ఆలోచన మధ్య వైరుధ్యాలు వున్నాయి. వలసరాజ్యాల ప్రస్తుత పరిస్థితి, స్థానిక వైరుధ్యాలను పరిష్కరించడం లేదు.  ప్రస్తుత ప్రధాన వైరుధ్యానికి పరిష్కారం, తాలిబాన్ల రాజ్యం కాదు. ప్రాథమిక వైరుధ్యపు తుది పరిష్కారం వైపు సమాజాన్ని వీళ్ళు నడిపించలేరు.

మరో మాటలో చెప్పాలంటే, తాలిబాన్,  సామ్రాజ్యవాద ఆక్రమణదారుల మధ్య ప్రాథమిక వైరుధ్యం అక్కడి సమాజపు ప్రాథమిక వైరుధ్యానికి అనుగుణంగా లేదు. అందువల్ల, వాటి మధ్య మౌలిక వైరుధ్యం సమాజంలో ప్రాథమిక వైరుధ్యం కాదు. అదే విధంగా, మెజారిటీ ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేయలేదు. అందువల్ల తాలిబన్ల సాయుధ ప్రతిఘటన ఈ వైరుధ్యానికి పరిష్కారం కాదు. పాక్షిక,  అస్థిరమైన సాయుధ ప్రతిఘటన  చివరకు రెండింటి మధ్య రాజీ ద్వారా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది.

 వలస విధానం ,  పాక్షిక వలస పరిస్థితి అనేది సామ్రాజ్యవాద ఆధిపత్యపు రెండు విభిన్న పరిస్థితులు. ఇది సామ్రాజ్యవాదం నుండి నిజమైన స్వాతంత్ర్యంగా సారంలో ఉండదు.  వలస పరిస్థితుల మధ్య వున్న వైరుధ్యాలలోనే ప్రాథమిక వ్యత్యాసాలు వున్నాయి.  అందువల్ల, తోలుబొమ్మ పాలకుల,  తాలిబన్ల మధ్య యుద్ధం సమాజపు ప్రాథమిక వైరుధ్యం మీద ఆధారపడి ఉండదు. 

అమెరికన్ సామ్రాజ్యవాద ఆక్రమణదారుల, తాలిబాన్ల మధ్య చర్చల ప్రారంభం వారి మధ్య కుట్ర, సంక్లిష్టత ప్రక్రియకు ఒక రాజీ కావాలి. తాలిబన్,  తోలుబొమ్మ పాలన మధ్య వున్న సంక్లిష్టతను పూడ్చడానికి ప్రస్తుత పరిస్థితి కొంతమేరకు సామ్రాజ్య వాదులకు ఉపయోగకరమే.

 నిజానికి, తోలుబొమ్మ పాలకుల,  తాలిబన్ మధ్య ఎటువంటి తీవ్రమైన ప్రాథమిక వైరుధ్యం లేదు. అందువల్ల, రెండిటి మధ్య అనవసరమైన వైరుధ్యం ఇరుపక్షాల మధ్య కుట్ర, రాజీ ఆధారంగా పరిష్కరించబడుతుంది.

 దీనికి సామ్రాజ్యవాద శాంతి అని పేరు పెట్టుకున్నారు. ఏదేమైనా, ఈ శాంతి దేశ ప్రజల ప్రయోజనాలపై ఆధారపడి ఉండదు.  ఇది తప్పనిసరిగా భవిష్యత్తులో సామ్రాజ్యవాద,  ప్రతిచర్య యుద్ధాల కొనసాగింపుగా ఉంటుంది.

మరోవైపు, తోలుబొమ్మ పాలన (ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ఘనిస్తాన్),  తాలిబాన్ (ఆఫ్ఘనిస్తాన్  ఇస్లామిక్ ఎమారత్) మధ్య కుమ్మక్కయ్యే ప్రక్రియ కూడా వుంది. ఎందుకంటే రెండు దైవ పరిపాలననే అందిస్తాయి.

అమెరికా సామ్రాజ్యవాదుల ఉన్నత సైనిక  దౌత్య స్థాయిలలో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి సంబంధించి విభిన్న అభిప్రాయాలు వున్నాయి. రాజకీయ నాయకులకు ఎన్నికల పరిగణనలు ఉన్నాయి. యుద్ధపు ఆర్ధిక వ్యయాలను తగ్గించాలని అమెరికా భావిస్తోంది.

 అమెరికన్ సామ్రాజ్యవాద ఆక్రమణదారుల, తాలిబాన్ల మధ్య సంబంధాలు సైనిక ఘర్షణ నుండి రాజకీయ కుట్రకు మారాయి.




Comments