బంద్ కు సంఘీభావ ప్రదర్శన | పచ్చిమ గోదావరి జిల్లా

ప్రెస్ నోట్ 27.09.2021కొవ్వూరు
****************************
పౌర హక్కుల సంఘ,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గులాబీ తుపాన్ వర్షం లో సంఘీభావ ప్రదర్శన.
*******************************

     ఆలిండియా రైతు సంఘాలు సమాఖ్య దేశవ్యాప్త బంద్ లో భాగంగా ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు లో పౌర హక్కుల సంఘం, IFTU, PDSU,POW,మార్కెట్ కమిటీ కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్గ్ యూనియన్ తదితర సంఘాల ఆధ్వర్యంలో గులాబి తుపాన్ వర్షం లో సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు,హైకోర్టు న్యాయ వాది నంబూరి. శ్రీమన్నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండి పట్టుదలను విడనాడి దేశవ్యాప్తగా రైతాంగం జరుపుతున్న ప్రజాస్వామిక ఉద్యమాన్ని గౌరవించి 3 వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 
     
       మార్కెట్ కమిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకట రత్నం మాట్లాడుతూ రైతు పచ్చ గా ఉంటేనే సమాజానికి అన్నం దొరుకుతుంది అని అన్నారు.రైతు కి ఉపయోగ పడే మార్కేట్ కమిటీలను కొనసాగించి రైతు అభివృద్ధి కి దోహద పడే విధంగా తీర్చిదిద్దాలి అని అన్నారు.   

    IFTU నాయకులు Ch రమేష్, చీర అప్పారావు మాట్లాడుతు 44 చట్టాలను రద్దు చేసి తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేఖ లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
       ప్రగతిశీల మహిళా సంఘం POW నాయకురాలు ఈమని మల్లిక మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ తో సహా దేశం లోని పరిశ్రమలు,పోర్ట్లు విమానాశ్రయాల అమ్మకాలు నిలుపుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.
       ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం PDSU రాష్ట్ర నాయకులు N.S.V. మహర్షి మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వలన విద్యార్థులు కి ప్రభుత్వ రంగం లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి అని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను సంక్షేమ ప్రభుత్వాలు పెంపొందించాలి. కానీ వాటిని ప్రైవేటీకరణ చేయటం మూసీ వేయటం,అమ్మివేయటం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. 
      ఇంకా ఈ కార్యక్రమంలో గోదావరి ఇసుక కార్మిక సంఘం, మార్కెట్ యార్డ్ కార్మికులు హమాలీలు,పట్టణ కార్మికులు Ch. సూరిబాబు,ఎం. రాజు,మార్కెట్ కమిటీ నాయకులు దాసరి. మోహన్,బయ్యే కుమార్, సుంకర హరికృష్ణ,చోళ వెంకట రాజు,పోలిశెట్టి శివ తదితరులు పాల్గొన్నారు.
                              ఇట్లు
నక్కా వెంకట రత్నం. రాష్ట్ర అధ్యక్షుడు
మార్కెట్ కమిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్.

 జిల్లా అధ్యక్షులు
పౌర హక్కుల సంఘం.
పశ్చిమగోదావరి జిల్లా.

Comments