ఈరోజు శ్రీకాకుళం జిల్లా పౌర హక్కుల సంఘం అలాగే ఒరిస్సాలోని రైతు కూలీ సంఘం హక్కుల సంఘాలు మొత్తం కలిపి శ్రీకాకుళం జిల్లా మందస మండలం సా బా కోట పంచాయతీ లో గల మధ్య కోలా గుడ్డి కోలా అలాగే మాణిక్యపురం గ్రామాలు నిజ నిర్ధారణ కోసం పర్యటించడం జరిగింది ఈ పర్యటనలో ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను పౌరహక్కుల సంఘం note చేసింది ముఖ్యంగా అక్కడి ప్రజలు భిన్నమైన అభిప్రాయాలు చెప్పారు కొద్దిమంది మేము ఆంధ్రప్రదేశ్లో ఉంటాము మరి కొద్ది మంది ప్రజలు మేము ఒరిస్సాలో ఉంటాము అని చెప్పారు మాణిక్యపురం లో స్కూలు ఇతర కొన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఒరియా అధికారులు ఉన్నారు అక్కడ స్కూలులో ఒరియా భాషలో నడుస్తుంది తిత్లీ తుఫాను మూలంగా ఒరిస్సా ప్రభుత్వమే ఇల్లు మంజూరు చేసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంగనవాడి భవనానికి శంకుస్థాపన చేస్తున్న అనేక ప్రశ్నలు అనేక అభిప్రాయాలు ప్రజలు చెప్పారు ముఖ్యంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు స్పష్టంగా కనబడుతుంది కేవలం ఓట్ల కోసమే ఈ రెండు రాష్ట్రాలు అక్కడ ప్రజలను ఉపయోగించుకునే తట్టుగా కనపడింది దశాబ్దాల కాలంగా రాష్ట్రాల సరిహద్దు ఏర్పాటు చేసుకోవటం చాలా బాధాకరం ముఖ్యంగా ఆ గ్రామం ఆంధ్రప్రదేశ్లోని పంచాయతి లో ఉంది అలాగే ఆ గ్రామంలో ఒరిస్సా ప్రభుత్వం కూడా కొన్ని అభివృద్ధి పనులు తీసింది ఎలా సాధ్యం రెండు ప్రభుత్వాలు ఓకే గ్రామంలో ఎలా అభివృద్ధి పనులు చేస్తున్నారు ఇది ప్రశ్న ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న పంచాయతీలో ఆ గ్రామం ఉన్నది
ముఖ్యంగా అక్కడ జీవిస్తున్న ఆదివాసులు వాళ్ల సాంప్రదాయాలు వాళ్ల సాంస్కృతిక విధానాలు ఒకే లాగా ఒక తెగకు చెందినదిగా కనపడుతుంది కావున రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా వెంటనే రాష్ట్రాల సరిహద్దులు ఏర్పాటు చేసుకోవాలి మేము ఒక ఆదివాసి అబ్బాయి అడిగినప్పుడు ఆ అబ్బాయి చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి ఒరిస్సా పోలీసులు నా ఆధార్ కార్డు తీసుకుని నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పాడు ప్రజలు ఎవరూ కూడా ముందుకు వచ్చి తమ అభిప్రాయాలు చెప్పటం లేదు చాలా భయాందోళనలు ఆ గ్రామం ఉన్నది పౌరహక్కుల సంఘం డిమాండ్ ఏమిటంటే శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేసి ప్రజలపై ఒత్తిడి లేకుండా చూడాలి అక్కడున్న ప్రజలు అన్ని మౌలిక అవసరాలు ఆంధ్ర ప్రదేశ్ పైన ఆధారపడి జీవిస్తున్నారు
చాలా మంది విద్యార్థులు టెక్కలి లో చదువుకుంటున్నారు అలాగే అదే ఊర్లో ప్రాథమిక పాఠశాల ఒడియా లో ఉంది కాబట్టి ఉన్నత అధికారులు ప్రభుత్వాలు తప్పనిసరిగా జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి కోరుతున్నాం
Comments
Post a Comment