ఖార్‌గోన్‌లో పోలీసు కస్టోడిలో జరిగిన ఆదివాసీ చిత్రహింస, మరణానికి నిరసనగా వేలాదిమంది ఆదివాసీల నిరసన*.
--------------------------- దోషులైన పోలీసు సిబ్బందిపై చర్యలు చేపట్టకపోతే సహించబోమని రాష్ట్రప్రభుత్వానికి హెచ్చరిక
దోషులైన పోలీసు సిబ్బందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని, మరియు బిసాన్ s/o హబు మరణానికి కారణమైన వైద్యులను అరెస్టు చేయాలని 3000 మందికి పైగా ఆదివాసీలు డిమాండ్ చేశారు.
ఖార్‌గోన్ జిల్లా, బిస్తాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, ఖేర్కుండి గ్రామానికి చెందిన బిసాన్‌ను మరో ముగ్గురిని దొంగతనం చేశారనే అనుమానంతో ఆగస్టు 31 రాత్రి పోలీసు అధికారులు పట్టుకుని - వారి అక్రమ నిర్బంధం, చిత్రహింసలకు వ్యతిరేకంగా కోర్టులో అరెస్టయిన వారి కుటుంబాలు పిటిషన్ దాఖలు చేసే వరకు వారిని అక్రమ కస్టడీలో ఉంచారు.
అధికారికంగా అరెస్ట్‌ను సెప్టెంబర్ 4 న మాత్రమే నమోదు చేసారు, అయితే ఎవరినీ 24 గంటలు కంటే ఎక్కువ తమ కస్టడీలో ఉంచడానికి పోలీసులకు హక్కు లేదు. బిసాన్, మరో ముగ్గురిని రెండు రోజుల పాటు పోలీసు రిమాండ్‌లో ఉంచారు, ఆ సమయంలో బిసాన్, భావసింగ్ s/o ఫూల్సింగ్ లను దాడి, హింసలకు గురిచేశారు.
వారి పోలీసు రిమాండ్ ముగిసాక జైలుకు తీసుకెళ్లినప్పుడు, జైలు అధికారులు పద్ధతి ప్రకారం సరిగానే పోలీసుల చిత్రహింసల వల్ల కలిగిన తీవ్ర గాయాలకు వైద్య చికిత్స లేకుండా వారిని జైల్లోకి తీసుకోడానికి నిరాకరించారు.
బిసాన్ గాయాన్ని డాక్టర్ జెపి బడేరియా "చిన్నది" అని చెప్పి, చికిత్స చేయడానికి నిరాకరించాడు, ఇది చివరికి బిసాన్ మరణానికి దారితీసింది. బిసాన్‌ని ఎంత తీవ్రంగా కొట్టారంటే, అతని పిరుదులపై మాంసం ఎముక నుండి వూడిపోయింది. దాంతో సెప్సిస్/సెప్టిక్ షాక్‌కు దారితీసి బీసన్ మరణించాడు.
అలాంటి సంఘటనల్లో నిందితులను మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతూండడం వల్ల రాష్ట్రంలో ఆదివాసీలపై హింసాత్మక ఘటనలు నిరంతరం పెరుగుతున్నాయని ఆదివాసులు పేర్కొన్నారు. ఆదివాసీ సమాజం అటువంటి అన్యాయాన్ని చూస్తూ వూరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
ఆదివాసుల డిమాండ్స్:
1. బిసాన్ మరణానికి పాల్పడిన పోలీసు అధికారులపై FIR నమోదు చేయాలి. బిసాన్ పై హింస, హత్యలకు పాల్పడినందుకు వారిని వెంటనే అరెస్టు చేయాలి.
2. తప్పుడు MLC లను దాఖలు చేసినందుకు, బిసాన్‌కు మరణానికి దారితీసిన తీవ్ర గాయాలైనప్పటికీ చికిత్సను తిరస్కరించినందుకు డాక్టర్ జెపి బదేరియాను, బిస్తాన్ మెడికల్ ఆఫీసర్లను వెంటనే సస్పెండ్ చేయాలి. బిసాన్ మరణానికి ఈ అధికారులను కూడా ఎఫ్ఐఆర్‌లో పేర్కొనాలి, తదనుగుణంగా అరెస్టు చేయాలి.
3. బిస్తాన్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసు సిబ్బందిని తక్షణమే బదిలీ చేయాలి, ఖేర్కుండి నిందితులను హింసించడంలో వారి ప్రమేయం గురించి క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి, వారిపై అవసరమైన శిక్షా చర్యలు తీసుకోవాలి.
4. బిసాన్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం తప్పనిసరిగా ఇవ్వాలి.
ఈ డిమాండ్లపై చర్య తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా పాలనా యంత్రాంగాలు విఫలం అవుతే ఆదివాసీ సమాజం తమ డిమాండ్లన్నీ నెరవేరే వరకు మరింత పెద్ద ఆందోళన చేపడతామని ఆగ్రహంతో ఉన్న ఆదివాసులు హెచ్చరించారు.
Comments
Post a Comment