హక్కుల అవగాహన ఎలా ఏర్పడుతుంది
ఆలోచనలు, అభిప్రాయాలు అభివృద్ధి చేయబడే భౌతిక పరిస్థతులు ఉండాలి. అదే భావజాలం అని పిలువబడే ప్రాథమిక ఆకారాన్ని తీసుకుంటుంది. ఎవరైనా సహజంగానే అలాంటి ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. ఆలోచన ప్రక్రియ సహజంగానే పౌరులు అనుభవించిన దృగ్గోచ్చర అనుభవాల ద్వారా నిర్ణయించబడుతుంది.
ఆగష్టు 1794 లో ఫ్రెంచ్ సైన్యాలు ట్రైయర్ అనే పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. పౌర పరిపాలనను ఏర్పాటు చేశాయి. ఫ్రెంచ్ విప్లవపు ఆలోచనలను తీసుకువచ్చాయి. 1815 లో ఫ్రాన్స్ లో నెపోలియన్ ఓడిపోయిన తరువాత ఈ పట్టణం ప్రష్యన్ రాజు చేతుల్లోకి వెళ్ళింది. సహజంగానే ఈ కాలంలో పుట్టిన వారు ఫ్రెంచ్ విప్లవాత్మక ఆలోచనల ఖచ్చితమైన ప్రభావాన్ని కలిగి ఉంటారు.
ట్రైయర్ జనాభా 12,000. ఇది ప్రధానంగా చుట్టుపక్కల ప్రాంతానికి మార్కెట్ ప్రాంతం. ఇక్కడ పౌర సేవకులు, పూజారులు, చిన్న వ్యాపారులు, హస్తకళాకారులు మొదలైనవారు వుంటారు. ఇక్కడ పారిశ్రామిక విప్లవానికి కావలసిన అనువైన పరిస్థితులు లేవు. ప్రజలు ఆర్థికంగా వెనుకబడి వున్నారు. పేదరికం విలయ తాండవం చేస్తోంది. 1830 లో అధికారిక గణాంకాల ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరు నిరుద్యోగిగా వున్నారు.
బిచ్చగాళ్ళు, వేశ్యలు, దొంగలు పేదరికం వల్ల ఎక్కువుగా తయారయ్యారు. ఈ పరిస్థితుల్లో పుట్టినవారు సహంజగానే ప్రజల కష్టాలను చూస్తారు. వాళ్ల హక్కుల కోసం పోరాటం చేయాలని అనుకుంటారు.
జర్మన్ తత్వవేత్త ఫ్రెడరిక్ హెగెల్ అనుచరులు, బెర్లిన్ విశ్వవిద్యాలయంలో 1830 ప్రాంతంలో ఉండేవాళ్ళు. వీళ్ళను లెఫ్ట్ హెగెలియన్స్ అని పిలుస్తారు. వీరికి నాయకుడు బ్రూనో బాయర్ అనే ప్రొఫెసర్. నాస్తిక ఆలోచనల వల్ల బాన్ విశ్వవిద్యాలయం నుండి బాయర్‌ను తొలగించాలని రాజు స్వయంగా ఆదేశించాడు. ఫ్రెంచ్ భూస్వామ్య వ్యతిరేక సంస్కరణల విముక్తి ప్రభావాన్ని అనుభవించిన కొన్ని ప్రావిన్సులు ప్రష్యన్ రాజుకు వ్యతిరేక ప్రధాన కేంద్రాలుగా మారాయి. పారిశ్రామికీకరణ బూర్జువా వృద్ధికి దారితీసింది. ఫ్యూడల్స్ అధిక నియంత్రణలతో విసిగిపోయిన పారిశ్రామికవేత్తలు రాడికల్ ప్రతిపక్ష ఉద్యమానికి బలమైన మద్దతునిచ్చారు. వాళ్ల హక్కుల కోసం పోరాడటం ప్రారంభించారు.
1841 తర్వాత లుడ్విగ్ ఫ్యూయర్‌బా రాసిన ది ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అనే పుస్తకం విద్యార్థులను బాగా ప్రభావితం చేసింది. ఇది హక్కులను భౌతిక వాద దృష్టితో చూడటానికి అవకాశం కల్పించింది. మతం వల్ల హక్కలను కోల్పోతున్న ప్రజలకు మద్దతుగా నిలవడానికి ఈ భావన ఉపయోగ పడింది.
ఫ్రెడెరిక్ ఎంగెల్స్ 1820 నవంబర్ 28 న ప్రుస్సియాలోని రైన్ ప్రావిన్స్‌లోని బార్మెన్ అనే వస్త్ర పట్టణంలో జన్మించాడు. అతని తండ్రి పత్తి-స్పిన్నింగ్ మిల్లు సంపన్న యజమాని. ఇతను ప్రొటెస్టంట్ క్రైస్తవుడు.
ఈ నగరం ఇరవై సంవత్సరాలు ఫ్రెంచ్ ఆక్రమణలో వుంది. కొంతమంది ఈ కాలంలో ప్రగతిశీల ప్రభావాలను కూడా కలిగి వున్నారు. ఇది అతిపెద్ద రెనిష్ పారిశ్రామిక కేంద్రాలలో ఒకటి. ఆ విధంగా ఎంగెల్స్ చాలా చిన్న వయస్సు నుండే కార్మికవర్గపు తీవ్రమైన పేదరికం, దోపిడీని చూశాడు. ఫ్యాక్టరీ పోటీల నుండి బయటపడటానికి హస్తకళాకారులు ఉదయం నుండి రాత్రి వరకు పని చేయవలసి వచ్చేది. వాళ్ళు తమ కష్టాల్ని మర్చిపోవడానికి తాగేవారు. బాల కార్మికులు ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడేవారు.
పాఠశాలలోనే ఎంగెల్స్ బ్యూరోక్రసీకి వ్యతిరేకంగా పోరాడాడు. ఎదిగిన యువకుడిగా అతను బూర్జువా ప్రజాస్వామ్య విప్లవపు తీవ్రమైన ప్రజాస్వామ్య ఆలోచనల పట్ల ఆకర్షితుడయ్యాడు. యంగ్ జర్మనీ సాహిత్య సమూహం విద్యార్థులను బాగా ఆకర్షించేది. అది తీవ్రమైన రాజకీయ అభిప్రాయాల కోసం నిలబడింది. బార్మెన్, ఎల్బర్‌ఫెల్డ్‌లోని కార్మికులు తీవ్ర దోపిడీని ఎదుర్కొనేవారు.
అతను మార్క్స్ వున్న యంగ్ హెగెలియన్ సమూహంతో సన్నిహిత సంబందాన్ని నెరిపాడు. మార్క్స్ మాదిరిగా అతను కూడా ఆ సంవత్సరంలో వచ్చిన ఫ్యూర్‌బా పుస్తకంలోని భౌతికవాద అభిప్రాయాలతో బాగా ప్రభావితం అయ్యాడు.
ఇంగ్లాండ్‌లో ఎంగెల్స్ అనుభవాలు అతన్ని కమ్యూనిస్టుగా మార్చాయి. అతను మాంచెస్టర్ కార్మికులతో, అలాగే విప్లవాత్మక కార్మికుల చార్టిస్ట్ ఉద్యమ నాయకులతో సన్నిహిత సంబంధాలను పెంచుకున్నాడు. ప్రపంచంలోని ఆధునిక వస్త్ర పరిశ్రమకు మాంచెస్టర్ ప్రధాన కేంద్రంగా ఉండేది. త్వరలో ఎంగెల్స్ కార్మికుల పని విధానం, హక్కుల పరిస్థితుల గురించి లోతైన అధ్యయనం చేపట్టాడు. ప్రత్యక్ష జ్ఞానం పొందడానికి అతను క్రమం తప్పకుండా కార్మికవర్గ ప్రాంతాలను సందర్శించేవాడు.
హక్కుల చైతన్యానికి కావలసిన సిద్ధాంతాన్ని మార్క్స్, ఎంగిల్స్ తయారు చేయడం ప్రారంభించారు. బాయర్, యంగ్ హెగెలియన్ కు వ్యతిరేకంగా వారు రచనలు చేశారు.
ది జర్మన్ ఐడియాలజీ అనే చారిత్రాత్మక పుస్తకం రాయబడింది. అయితే ఇది దాదాపు వంద సంవత్సరాల తరువాత మాత్రమే ప్రచురించబడింది. దీనినే మార్క్సిజం అని పిలుస్తారు.
హక్కులకు కావాల్సిన తాత్విక భూమిక అద్భుతమైన మెదడుల ఆలోచనల నుండి అకస్మాత్తుగా ఉద్భవించినది కాదు. ఆ కాలపు సామాజిక ఆర్థిక మార్పులు నిజమైన శ్రామికుల భావజాల ఆవిర్భావానికి ఆధారాన్ని అందించాయి. ఆ కాలపు ముఖ్యమైన ఆలోచనా రంగాలలో చేసిన పోరాటాల ఉత్పత్తి అది.
అందువల్ల మనం హక్కులను సరైన పద్దతిలో అవగాహన చేసుకోవడానికి తాత్విక పునాది అవసరం.
మెరుగైన హక్కుల ఆలోచనకు మొదటి మూలం జర్మన్ క్లాసికల్ ఫిలాసఫీ. ఏదైనా భావజాలం తత్వశాస్త్రంలో దాని ఆధారాన్ని కలిగి ఉండాలి.
జర్మన్ తత్వశాస్త్రం, 1760 నుండి 1830 మధ్య కాలంలో, యూరోపియన్ తత్వశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైనదిగా వుంది.
భూస్వామ్య సమాజాన్ని సమర్థించిన అన్ని ప్రగతిశీల వ్యతిరేక అంశాలను కార్మికులు తిరస్కరించాల్సి వచ్చింది. ఎందుకంటే హక్కుల హననానికి భూస్వామ్య సమాజం ఆటంకంగా వుంది.
ఇంగ్లీష్ పొలిటికల్ ఎకానమీ హక్కుల చైతన్యానికి ఇంకో ముఖ్యమైన వనరు. పారిశ్రామిక విప్లవానికి ఇంగ్లాండ్ కేంద్రంగా వుంది. ఆర్థిక వ్యవస్థ, దాని చట్టాల అధ్యయనం ఈ దేశంలో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది ప్రాథమికంగా ఆధునిక పెట్టుబడిదారీ విధానపు పెరుగుదలతో ప్రారంభమైంది. ఇది ఆధునిక పారిశ్రామిక బూర్జువాతో దాని దృఢమైన ఆధారాన్ని కలిగి ఉంది. పెట్టుబడిదారీ విధానాన్ని పెంచడానికి ఉపయోగ పడింది.
ఇంగ్లాండ్‌లో 1776 లో ప్రపంచ ప్రఖ్యాత పుస్తకం ది వెల్త్ ఆఫ్ నేషన్స్ భిన్నమైన హక్కుల అవగాహనకు ఉపయోగ పడింది. ఆడమ్ స్మిత్ పెట్టుబడిదారీ విధానం పెరగడానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే అది గొప్ప పురోగతికి దారితీస్తుందని వాదించాడు. పెట్టుబడిదారీ వర్గంపై భూస్వామ్యవాదుల నియంత్రణలను తగ్గించాలని ఆయన వాదించాడు.
డేవిడ్ రికార్డో మరొక ప్రసిద్ధ శాస్త్రీయ ఆర్థికవేత్త. అతను భూస్వాములతో బూర్జువా యుద్ధాలలో కీలక పాత్ర పోషించాడు. పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందుతున్నప్పుడు పెట్టుబడిదారుల లాభాల సగటు రేటు పడిపోయిందని ఆయన ఎత్తి చూపారు. ఇది అన్ని ఆర్థిక విలువలను శ్రమ ద్వారా సృష్టించినట్లు చూపించింది. తరువాతి ఆర్థికవేత్తలు పెట్టుబడిదారీ విధానంలో ఆర్థిక సంక్షోభానికి కారణాలను విశ్లేషించారు. అప్పుడే ఆర్థిక హక్కులు కూడా పౌరలకు అవసరమనే వాదన బయలు దేరింది.
చారిత్రక భౌతిక వాద దృక్పధంతో రాయడం బాగుంది
ReplyDelete