న్యాయవాది మరియు పౌర హక్కుల నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం:పౌర హక్కుల సంఘం తెలంగాణ....
దండేపల్లి గ్రామము, ఎల్కతుర్తి మండలం, హన్మకొండ జిల్లా,తెలంగాణ రాష్ట్రం లో 14 సెప్టెంబర్,2021న గడ్డం సంజీవ్ కుమార్,న్యాయవాది మరియు పౌర హక్కుల నాయకులు తన మోటార్ బైక్ పై ఇంటికి వస్తుండగా,బొలేరో జీబు ద్వారా దండేపల్లి గ్రామపోలిమేరల్లో ఎల్లబోయిన రమేష్,సంజీవ్ మోటార్ బైక్ ను వెనుక నుండి ఢీకొట్టి హత్యా యత్నం చేసిన ఘటనపై పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటిమరియు పౌర హక్కుల సంఘం ఉమ్మడి వరంగాల్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో ఈరోజు 17 సెప్టెంబర్,2021,శుక్రవారం నాడు సంజీవ్ స్వగ్రామమైన దండేపల్లి లో అతన్ని ,కుటుంబసభ్యులను మరియు గ్రామస్తులను కలిసి సేకరించిన నిజనిర్దారణ వివరాలు.....
దళిత సామాజిక వర్గానికి చెందిన
గడ్డం సంజీవ్ కుమార్ గత10 సంవత్సరాల నుండి హన్మకొండ మరియు హుజురాబాద్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ పౌర హక్కుల సంఘం లో హక్కుల కార్యకర్తగా పనిచేస్తున్నాడు. దండేపల్లి మరియు చుట్టు పక్కల గ్రామాల్లో దళితులకు అణగారిన వర్గాలకు అండగావుంటూ న్యాయవాద వృత్తి కొనసాగిస్తున్నాడు.గత మూడు సంవత్సరాలు గా దండేపల్లి కి చెందిన ఎల్లబోయిన రమేష్ గ్రామంలో దాడులు చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్న సందర్భంగా, హుజురాబాద్ కోర్టులో రమేష్ నిందితుడుగా ఉన్న ఒక్క కేసు త్వరలో ట్రయల్ కి వస్తున్న పరిస్థితి మరియు మానవ హక్కుల కమిషన్,తెలంగాణ రాష్ట్రం,
హైదరాబాద్ లో మరొక్క కేసులో రమేష్ నిందితుడుగా ఉన్న నేపథ్యంలో,గత కొద్దిరోజులుగా రమేష్, సంజీవ్ ను హుజురాబాద్ కోర్టుకేసును వాదించొద్దని,
మానవ హక్కుల కమిషన్ కేసు నుంచి తప్పుకోవాలని,బెదిరింపులకు పాల్పడి గత కొద్దిరోజులుగా సంజీవ్ ను చంపాలని పథకాలు పన్ని,ఎల్కతుర్తి-బాహుపేట నుండి దండేపల్లి గ్రామం వరకు కపుకాసి,14 సెప్టెంబర్,2021న సాయంత్రం గడ్డం సంజీవ్ కుమార్ తన మోటార్ బైక్ పై ఇంటికి వస్తుండగా,బొలేరో జీబు ద్వారా దండేపల్లి గ్రామపోలిమేరల్లో ఎల్లబోయిన రమేష్,సంజీవ్ మోటార్ బైక్ ను వెనుక నుండి ఢీకొట్టి నాడు.ఈ ఘటనలో సంజీవ్ బైక్ పై నుండి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయం నుండి బయట పడి, చిన్నచిన్న గాయాలయ్యాయి. ఉద్దేశ్య పూర్వకంగా రమేష్, సంజీవ్ ను చంపాలనే కుట్రకు వెనుక మద్దతుగా బలమైన మాఫియా, అధికార TRS పార్టీ అండదండలతో కొనసాగింది. సంజీవ్ పై దాడికి నిరసనగా హుజురాబాద్ బార్ అసోసియేషన్ వెంటనే స్పందించి 15 సెప్టెంబర్,2021న హుజురాబాద్ కోర్ట్ బహిష్కరించి, సంజీవ్ కు అండగా హుజురాబాద్ బార్ అసోసియేషన్ మరియు హుజురాబాద్ న్యాయ వాదులు నిలబడి ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినారు.
మొదట రోడ్ ఆక్సిడెంట్ గా కేసు నమోదుకు ప్రయత్నం చేసింది రమేష్కు అండగా ఉన్న మాఫియా, కానీ హుజురాబాద్ బార్ అసోసియేషన్ మద్దతు వలన వెనక్కి తగ్గి హత్యాయత్నము కేసు రమేష్ పై నమోదు చేశారు.పౌర హక్కుల సంఘం సంజీవ్ పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది..
17 ఫిబ్రవరి,2021న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగమైన మంథని -పెద్దపెల్లి రోడ్డుపై కమాన్ పూర్ కల్వచెర్ల శివారులో హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామనరావు,గట్టు నాగలక్ష్మి దంపతులను అతి కిరాతకంగా పట్టపగలు నరికి చంపిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరిగిపోయాయి.హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యపై తెలంగాణ తో పాటు దేశ వ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలకు కొద్దిగా కూడా బయపడక ప్రభుత్వం అండదండలతో మాఫియా రెచ్చిపోతున్న సందర్భంగా లోనే గడ్డం సంజీవ్ పై హత్యాయత్నం జరిగింది.
ఈ ఘటనపై పౌర హక్కుల సంఘం హై కోర్ట్ మరియు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తులకు పిర్యాదు త్వరలో చేస్తోంది.
సంజీవ్ కు అండగా నిలబడిన హుజురాబాద్ బార్ అసోసియేషన్ ను న్యాయవాదులను ఈరోజు 2:30 గంటలకు పౌర హక్కుల సంఘం నిజనిర్దారణ నాయకులు కలిసి వారి నిరసనలకు కృతజ్ఞతలు తెలిపి సంజీవ్ పై దాడికి వ్యతిరేకంగా జరిగే పోరాటంకు అండగా ఉంటామని సంఘీభావం తెలిపాము.
ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రజా సంఘాలు సంజీవ్ పై దాడి ఖండించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది..
సంజీవ్ పై హత్యాయత్నం కు ప్రధాన నిందితుడు ఎల్లబోయిన రమేష్ తో పాటు అతనికి వెనక సహకారాన్ని అందించిన మాఫియా పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఆపివేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కార్యాచరణ చేపట్టాలి.....
నిజానిర్దారణ లో పాల్గొన్న వారు..
1)మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పౌరహక్కుల సంఘంతెలంగాణ.
2)GAV ప్రసాద్, అధ్యక్షులు ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం
3)శ్రీపతి రాజగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.
4.పోగుల రాజేశం, E C మెంబర్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.
5..కడ రాజయ్య, E C మెంబర్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.
6.బొడ్డుపెల్లి రవి, E C మెంబర్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.
7.బాలసాని రాజయ్య, విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా.
8.K. రవిందర్, ప్రజా సంఘాల నాయకులు..
మరియు పౌర హక్కుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు....
దండేపల్లి,హన్మకొండ జిల్లా..
హుజురాబాద్ కరీంనగర్ జిల్లా..
సాయంత్రం 4:40గంటలు..
17 సెప్టెంబర్,2021,శుక్రవారం..
Comments
Post a Comment