ప్రచునార్థం..
ప్రజా న్యాయవాది బొజ్జా తారకం గారి ఆశయాలను కొనసాగిద్దాం...
దుడ్డు ప్రభాకర్ రాష్ట్ర అధ్యక్షులు KNPS
1969 తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన తారకం గారు మరణించే వరకూ పీడిత ప్రజల పక్షపాతిగా పేదల న్యాయవాదిగా జీవించేవారు.1985 కారంచేడు దళితులపై అగ్రకుల దూరహంకారుల హత్యాకాండ తరువాత హైకోర్టు ప్రభుత్వ న్యాయవాద పదవికి రాజీనామా చేసి దళిత మహాసభకు వ్యవస్థాపక అధ్యక్షులయ్యారు. అప్పటి నుండి నిన్న మొన్నటి లక్షింపేట నరమేధం వరకూ జరిగిన అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. పోలీసులు అరెస్ట్ చేస్తే(1979) దగ్గర ప్రారంభమైన ఆయన రచనలు దళితులు-రాజ్యం, చరిత్ర మార్చిన మనిషితో ముగిసినట్లే అంబేడ్కర్ యువజన సంఘాల ఏర్పాటుతో ప్రారంభమైన ఆయన ఉద్యమ ప్రస్థానం కారంచేడు , చుండూరు,,వేంపెంట మీదుగా లక్షింపేట చేరింది. దశాబ్ద కాలంగా దళితోద్యమానికి - విప్లవోద్యమానికి వారధి కట్టే ప్రయత్నం చేశారాయన.
ఈ దేశంలో అగ్రకుల భూస్వామ్య పాలకులు సామ్రాజ్య వాదులు ,పీడిత ప్రజలపై సామాజిక ఆర్థిక రాజకీయ అణిచివేత దాడులు తీవ్రతరమౌతున్న ప్రస్తుత దశలో అనేకమంది తారకులు అవసరం.తారకం గారి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడమే ఆయనకందించే ఘనమైన నివాళి.
16.09.2021 గురువారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం లోని క్రాంతి భవన్ లో బెలమర ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సభలో బెందాలం కృష్ణారావు (జర్నలిస్ట్ రఛయత) ,కోత ధర్మారావు (డి టి ఎఫ్ నాయకులు),వేడంగి చిట్టిబాబు (ఏపీ సి ఎల్ సి రాష్ట్ర అధ్యక్షులు), మిస్కా కృష్ణయ్య (కే ఎన్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు) , కె కృష్ణ (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎన్ పి ఎస్)
జగన్నాధం (కె ఎన్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి), తదితరులు వక్తలుగా పాల్గొని ప్రసంగించారు .
Comments
Post a Comment