*పౌరహక్కుల సంఘం నేతల డిమాండ్
పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు మహమ్మద్ ఫరూక్ సిబీ, మౌలానా హుస్సేన్ నన్ను వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ రవి శంకర్,జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డయ్య,రాష్ట్ర బీసీ నాయకులు నాగముని లు డిమాండ్ చేశారు.
బుధవారం వారు స్థానిక అంబేద్కర్ శిబిరం వద్ద నిరసన వ్యక్తం చేసి మీడియాతో మాట్లాడుతూ దువ్వూరుకు చెందిన అక్బర్ బాషా కుటుంబం తమకు జరిగిన అన్యాయంపై వీడియో ద్వారా ముఖ్యమంత్రి జగన్ తెలియజేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో స్పందించిన రాష్ట్ర మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మహమ్మద్ ఫారుక్,మౌలానా హుస్సేన్ లు దువ్వూరు కు చేరుకొని మైనార్టీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించిన ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన మైనార్టీ పరిరక్షణ సమితి నాయకులు కారుతో గుద్ధి చంపడానికి ప్రయత్నించారని వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు.
అక్బర్ బాషా కుటుంబాన్ని బెదిరించిన వారిని వదిలేసి అండగా నిలిచిన వారిపై అక్రమ కేసులు పెట్టడంపై పౌరహక్కుల సంఘం నేతలు మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలనుకోవడం ఈ ప్రభుత్వం చేతగానితనం అన్నారు.పోలీసుల కాల్పుల్లో బనాయించిన కేసులను బేషరతుగా వెంటనే ఎత్తివేసి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Post a Comment