పోలీసులు అదపులో ఉన్న మహేందర్, కిరణ్ లను కోర్టులో హజరు పరచాలి | పౌర హక్కుల సంఘం

 గత రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నా మావోయిస్టు నేతలను వారిపై ఎటువంటి కేసులు లేకుంటే వెంటనే వదిలి పెట్టాలని డిమాండ్ చేస్తున్నం.తీవ్ర అనారోగ్యంతో బాదపడుతూ గత కొంతకాలంగా ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లా బైతులగూడా బ్లాక్, కాటపాడు పంచాయతీ పరిధిలోని కొడవ బాతి గ్రామంలో చికిత్స పోందుతుండగా పోలీసులు అఇద్దరు మావోయిస్ట్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

అనారోగ్యంతో ఉన్న వారు స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ మహేందర్ , ఏరియా కమిటీ కీ చెందిన కిరణ్ లు. ఒరిస్సా పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నావారిని..

ఇప్పటి రెండు రోజులు కావస్తున్నా కోర్టులో కాని, మీడియా ముందు వారిని ప్రవేశ పెట్టక పోవటంతో రక్త బంధువులు వారిని ఎన్ కౌంటర్ పేరుతో హత్య చేసే అవకాశం ఉందని ఆంధోళన చెందుతున్నారు.ఆంద్ర ఒరిస్సా సంయుక్త పోలీసు బృందం వెంటనే మహేందర్, కిరణ్ లను సంభందిత కోర్టులో హాజరు పరచాలి!

 వారికి ఎలాంటి ప్రాణ హాని తలపెట్టవద్దని కోరుతున్నాము.
   
V.చిట్టి బాబు,అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం,ఆంధ్రప్రదేశ్.

 చిలుక.చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం,ఆంధ్రప్రదేశ్

ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం తెలంగాణ.

N. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం తెలంగాణ.

Comments