సెప్టెంబర్ 12ఆదివారం ఉ"10గం'లకు, శ్రీకాకుళం జిల్లా,కాశీబుగ్గ -పలాస నగరంలో సూడికొండ పరిరక్షణ కమిటీ, శ్రీకాకుళం ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సూ ది కొండని పరిరక్షించు కోవటానికి, కొండ తవ్వకాలను ఆపాలని, మైనింగ్ లీజు ను రద్దు చేయాలని డిమాండ్ తో బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు పోతనపల్లి అరుణ( ఉత్తరాంద్ర మహిళసంఘం )అధ్యక్షత వహించారు. ప్రజాసంఘాల నాయకులు, స్థానికప్రజలు పాల్గొన్నారు. మానవహక్కుల వేదిక నాయకులు జగన్నాధం మాట్లాడుతూ కొండ తవ్వకాల వలన పర్యావరణం నాశనమవుతుందని, దాన్ని అడ్డుకోవాలని అన్నారు.
విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ కొండ లను, గుట్టలను, అడవులను పాలకులుకబ్జాదారులు నాశనం చేయటం ద్వారా పర్యావరణo ధ్యంసమైయిందని, పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భావితరాలకు మంచి భవిష్యత్ ఇవ్వగలమని అందుకోసం సూదిగొండ తవ్వకాలు ఆపేవరకు అందరం కలసి ఉద్యమించాలని అన్నారు.పౌరహక్కుల సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు వేడంగి చిట్టిబాబు మాట్లాడుతూ భూమి, నీరు, గాలి, వృక్షాలు, జంతువులు కలిస్తేనే పర్యావరణం. బొగ్గు, చమురు, సహజ వాయువులను అక్రమంగా వాడటం వలన పకృతికి ముప్పుపొంచివుంది. పెరుగుతున్న భూతాపం వల్ల వాతావరణం వే గంతో మార్పులకు లోనవుతుంది.గాలికాల్యూషం, నీటికాలుష్యం, ధ్వని కాలుష్యం, ఓజాన్ పొ ర ప్రమాదం,అభిరుద్ది పేరుతొ పోర్టుల నిర్మాణం రాబోయే 20ఏళ్ళ నాటికి 220మీటర్లముందుకు సముద్రం వస్తుందని ఇండమర్ నివేదిక హెచ్చరిస్తుంది.
శుభ్రమైన ఆరోగ్యాకరమైన వాతావరణం మానవహక్కుగా గుర్తింపు పొందింది, ఆరోగ్యకరమైన వాతావరణం జీవించేహక్కులో బాగాంగా కోర్టులు గుర్తించాయి. మంచినీటిని, మంచిగాలిని,మంచిరోగ్యాన్ని పొందాలంటే పర్యావరణాన్ని పరిరక్షణ కోసం అందరం కలసి ఉద్యమించాలని,సూది కొండ, నెమలికొండ తవ్వకాలు పర్యావరణానికి హానికరమణి, తవ్వకాల లీజు రద్దు అయ్యేవరకు ఉద్యమిద్దామని, రాజ్యాంగం
లోని ఆర్టికల్ 48-a, ఆర్టికల్ 51(a)అమలుకు పోరాడాలనిన్నారు. ఈ సభలో ప్రజాకళామాండాలి నీలఖంటు బృందం ఉత్తేజకరమైన పాటలు పాడి సభను ఆలోచింపచేశారు.
అరుణ అధ్యక్ష ఉపన్యాసంలో సూదికొండ తవ్వకాలు ఆపి, లీజు రద్దుయ్యేవరకు ఉద్యమాన్ని నడిపిద్దామని పిలుపునిచ్చారు.
Comments
Post a Comment