ఏ అధిపత్య వ్యవస్థలోనైనా హక్కులు మెజారిటీ ప్రజలకు నిరాకరించ బడతాయు. ఐరోపాలోని రాజకీయ పరిస్థితులలో ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయించింది. ఇది పెరుగుతున్న పెట్టుబడిదారీ తరగతి నేతృత్వంలో జరిగింది. అక్కడ ధనవంతుల హక్కులకే ఎసరు ఏర్పడింది. బూర్జువా ప్రజాస్వామ్య విప్లవాలు జరగడానికి ఆ పరిస్థితులు ఉపయోగ పడ్డాయు. వీటిలో ముఖ్యమైనది 1789 ఫ్రెంచ్ విప్లవం.
ఫ్రెంచ్ విప్లవం ఫ్రాన్స్‌లో అనుకున్న విధంగా సమూలమైన మార్పులను తీసుకురాలేదు. అక్కడ ఫ్రెంచ్ బూర్జువా సైన్యాలు యూరప్ మొత్తాన్ని దాదాపుగా జయించాయి. వారు ఎక్కడికి వెళ్లినా భూస్వామ్యాన్ని రద్దు చేశాయి. ఆ విధంగా వారు రాజులకు, పాత భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా నిలిచారు. ఫ్రెంచ్ సైన్యాలు తరువాత ఓడిపోయాయి. పాత పాలకవర్గాలు తమ పాత స్థానాన్ని తిరిగి పొందలేకాపోయాయి.
హక్కులు ఒక మేరకు ఏర్పడిన తర్వాత అవి మళ్ళీ తొలగించ బడ్డానికి కొంత సమయం పడుతుంది. అయితే పాత వ్యవస్థ కన్నా, కొత్త వ్యవస్థలో హక్కులు కొంచెం మెరుగ్గా కల్పించ బడతాయి.
ఆధునిక బూర్జువా అనేక ఇతర బూర్జువా విప్లవాలతో తన విప్లవాత్మక ప్రహసనాన్ని కొనసాగించింది. దీని ఫలితంగా భూస్వామ్య వర్గాలు ఓటమిని అంగీకరించాయి. తమ ఆధిపత్యం కొనసాగదని తెలిసిన తర్వాత వాళ్ళు పెట్టుబడి దారులుగా మారడానికి ప్రయత్నించారు. ఈ వ్యవస్థలో హక్కులు కార్మికులకూ, శ్రామికులకు కల్పించ బడ్డాయి. ప్రపంచ వ్యవస్థగా పెట్టుబడిదారీ విధానం విజయం సాధించింది.
ఈ విధంగా ఆర్థిక, రాజకీయ స్థాయిలో హక్కులను గూర్చిన అవగహన ఏర్పడింది. ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ఆధిపత్య దేశాలలో ఈ అవగాహన మరింత పెరిగింది.
ఇది బూర్జువా వర్గాలకు పురోగతి కాలమే. ఈ కాలంలో హక్కుల కోసం పోరాడటం మరింత పెరిగింది. కార్మికవర్గ స్పృహ పెరగడం తో పాటు, శ్రామికవర్గం స్వతంత్రంగా, స్వయంగా ఉద్భవించడానికి ప్రయత్నించిన కాలం ఇది.
ఇది సహజంగానే అభివృద్ధి సాధించిన ప్రదేశాలైన ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌లలో జరిగింది. ఎందుకంటే ఈ రెండు దేశాలలో ఆధునిక పరిశ్రమ ప్రారంభించ బడింది. ఆధునిక పరిశ్రమ బూర్జువా వర్గాలకు గొప్ప సంపదను ప్రొగు చేసింది. హక్కుల కోసం మరింతగా పోరాడాల్సిన పరిస్థితిని కల్గించాయి.అదే సమయంలో కార్మికవర్గానికి అత్యంత అమానవీయమైన పని నెత్తిన పడింది. జీవన పరిస్థితులు మరింతగా దిగజారాబడ్డాయి.
హక్కులు నిరాకరించ బడ్డ జనాభా పెరిగింది. శ్రామికశక్తిలో దాదాపు మూడొంతుల మంది మహిళలు పిల్లలే. పిల్లల హక్కులు పూర్తిగా నిరాకరించ బడ్డాయి. ఆరు సంవత్సరాల వయస్సు నుండి పిల్లలు స్పిన్నింగ్ మిల్లులలో పదహారు గంటలు పని చేయవలసి వచ్చింది. ఒకవైపు ధనిక వర్గం ఎక్కువ లాభాలను ఆర్జిస్తోంది. మరోవైపు కార్మిక జనాభా జీవించే హక్కు నిరాకరించ బడింది. ముఖ్యంగా స్పిన్నింగ్మి మిల్లు యజమానులు తమ మూలధనాన్ని బాగా పెంచు కున్నారు.
అందువల్ల శ్రామికవర్గం తమ హక్కులను సాధించు కోవాలంటే పోరాటాలు తప్పనిసరి. అని భావించాయి..అయితే అలాంటి పోరాటాలు స్పష్టమైన దిశ లేకుండా జరిగాయి. ఇంగ్లాండ్‌లో 1810-11 నాటి మెషీన్ బ్రేకింగ్ ఆందోళన ఇందుకు ఉదాహరణ. నేత కార్మికులు టెక్స్‌టైల్ మిల్లులపై దాడి చేశారు. ఆధునిక యంత్రాలను పగులగొట్టారు. ఇది సాంకేతికతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు. ఇది వారి జీవనోపాధిని నాశనం చేస్తున్న ఆధునిక పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన. హక్కులను నిజంగా కాలరాస్తున్న శక్తులను గుర్తించాలి. ఇటువంటి నిరసనలకు స్పష్టమైన దిశ లేదు. అందువల్ల కార్మికుల హక్కుల పోరాటం తీవ్రంగా అణచివేయబడింది.
యంత్రాలను ధ్వసం చేయడం ఈ నాటికీ ఒక నిరసన పద్ధతిగా కొనసాగుతోంది. యంత్రం చాలా మంది పనిహక్కును మింగేస్తుంది. ఉపాధిని కల్పించడంలో పాలక వర్గాలు విఫలం అవుతున్నాయు. అందువల్ల మెజారిటీ కార్మికులు పని హక్కును కోల్పోతున్నారు.
నైపుణ్యం కలిగిన కార్మికులకు మాత్రమే మునుపటి యూనియన్లు పరిమితం అయ్యాయి. ఇవి 1818 నుండి ప్రారంభమయ్యాయి. దీనివల్ల అందరు కార్మికులు ఒకచోట చేర్చ బడ్డారు. పారిశ్రామిక విప్లవం జరిగిన ఇంగ్లాండ్ లోనే ఇది సాధ్యపడింది. ఇంగ్లాండ్‌లో ఈ తరహా యూనియన్ల పెరిగాయి. అందులో భాగంగా హక్కుల చైతన్యం పెరిగింది. జాతీయ స్థాయి యూనియన్‌ను ప్రారంభించడానికి ఒక ఉద్యమం ప్రారంభమైంది. 1833-34 నాటికి 500,000 సభ్యత్వానికి జాతీయ స్థాయి యూనియన్ చేరుకుంది.
హక్కుల చైతన్యం ఇంగ్లాండ్ నుండి ప్రపంచం అంతా పాకింది.
హక్కుల చైతన్యం మరిన్ని హక్కుల కోసం పోరాడాలని చెపుతుంది. బ్రిటన్‌లోని కార్మికులు ఎన్నికల హక్కులను కోరుతూ 1837 లో చార్టిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది రాజకీయంగా శ్రామికుల విప్లవాత్మక హక్కుల ఉద్యమం. వీళ్ళు సామూహిక పిటిషన్ల పద్ధతిని ఒక నిరసన ఆయుధంగా ఉపయోగించారు. ఈ పిటిషన్లు 5 మిలియన్ల కార్మికుల సంతకాలను సేకరించాయి. వీటిని పార్లమెంట్ కు పంపారు. చార్టిస్ట్ వీధి ప్రదర్శనలలో 3,50,000 మంది పాల్గొన్నారు.
ఇది కార్మికుల సంఘటిత బలాన్ని చూపించింది. హక్కుల ఉద్యమాలు ఎప్పుడైనా తీవ్ర నిర్భందాన్ని ఎదుర్కోక తప్పదు. అయితే ఉద్యమ బలం పెరిగే కొద్ది నిర్బంధం పెరుగుతుంది. ఇది 1850 నాటికి అణచివేయబడింది.
హక్కుల ఉద్యమాలను నిర్భంధాలు ఆపలేవు. హక్కుల చైతన్యం ఎప్పుడూ అభవృద్ధివైపే పయనిస్తుంది. ఈ కాలంలో కార్మికుల ఉద్యమం ముదిరి కార్మికుల తిరుగుబాట్లకు దారితీసింది. ఇవి కూడా క్రూరంగా అణచివేయబడ్డాయి. 1816 లో లండన్‌లో జరిగిన తిరుగుబాట్లను అణిచివేశారు. 1819 లో మాంచెస్టర్, 1831- 1834 లో ఫ్రాన్స్ లోను కార్మికుల తిరుగుబాట్లు అణచి వేయ బడ్డాయి. జర్మనీలోని సిలేసియాలో (చేనేత) నార-నేత కార్మికుల తిరుగుబాటు జరిగింది.
ఈ విధంగా1840 ల నాటికి, శ్రామికుల ఉద్యమం అనేక పారిశ్రామిక దేశాలలో బలంగా వ్యాపించింది. హక్కుల చైతన్యం తో పాటు, దాన్ని సాధించే నిబద్దతను కార్మికులు సాధించాలి. అందుకు వాళ్లకు రాజకీయ చైతన్యం అవసరం. కార్మికుల హక్కుల పోరాటం ఆధిపత్య పెద్ద బూర్జువాకు, పాత భూస్వామ్య పాలకవర్గాలకు ముప్పు కలిగించే స్థాయిలో ఇంకా బల పడలేదు. అయితే శ్రామికవర్గం స్వతంత్ర వర్గ శక్తిగా అవతరించడం గొప్ప ముందడుగు. శ్రామికవర్గం భౌతిక ఉనికిలోకి రావడం కూడా అదే మొదటి సారి.
ఈ సమయంలో వాళ్ళకి రాజకీయ సిద్ధాంతాన్ని మార్క్సిజం పరిచయం చేసింది. 1840 లలో మొదటిసారిగా, ఒకే ఆర్థిక పరిస్థితుల నుండి అనేక సిద్ధాంతాలు ఉద్భవించాయి. మార్క్సిజం మాత్రమే ఈ పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోవడానికి, వాటిని మార్చడానికి కావాల్సిన సాధనాలను అందించింది
Comments
Post a Comment