70 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణపై నిజ నిర్ధారణ | ప్రజా సంఘాలు, నిజామాబాద్ జిల్లా

పౌర హక్కుల సంఘం, AIKMS,IFTU,POW సంఘాల ఆధ్వర్యంలో దూస్ గాం గ్రామంలో 70 దళిత (మాదిగ) కుటుంబాలను సాంఘిక బహిష్కరణ సంఘటనపై నిజ నిర్ధారణ బృందం తేదీ 29/08/2021 నాడు గ్రామాన్ని సందర్శించి సేకరించి,నిర్ధారించిన వివరాలు రిపోర్ట్.

     నిజామాబాద్ జిల్లా, డిచ్ పల్లి మండలం, దూస్ గాం గ్రామానికి చెందిన యస్ సి (మాదిగ) కులస్తులను గ్రామ అభివృద్ధి కమిటి(వి.డి.సి) సాంఘిక బహిష్కరణ చేసింది. వి.డి.సి లో పేరుకు మాత్రమే అన్ని కుల సంఘాలు అందులో ఉంటాయి.కానీ అగ్ర కులాల వారు మాత్రమే అధికారం చేలయిస్తాయి.నిజామాబాద్ జిల్లాలో ప్రత్యామ్నాయ పాలన కొనసాగిస్తారు.వారు చెప్పిన తీర్పే అంతిమం. దాన్ని తిరస్కరిస్తే ఎవరైనా ఎంతటి వారైనా సాంఘిక బహిష్కరణ కు గురి కావడం కాయం.

తేదీ 28/08/2021 నాడు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారిని సాంఘిక బహిష్కరణ చేసినందున వారికి న్యాయం చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ విషయం న్యూస్ మీడియా ద్వారా ప్రజలకు తెలిసింది. దూ స్ గాం గ్రామం నిజామాబాద్ నగరం నుండి 18 కిలోమీర్ల దూరంలో ఉన్నది. నేషనల్ హైవే కు 3 కిలోమీర్లు దూరంలో ఉంది. డిచ్ పల్లి మండల పరిషత్ అభివృద్ధి అధ్యక్షులు గద్దె భుమన్నది అదే గ్రామం. కానీ ఇప్పటికి ఆధిపత్య కులాలదే(రెడ్డి, మున్నార్ కాపు) రాజ్యం/ అధికారం.
    
ఇక్కడ కూడా గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటి (వి.డి.సి) ఉన్నది. అందులో మాదిగ కులం తరపున ఒక సభ్యుడు కూడా ఉన్నాడు. వి డి సి లో కోశాధికారి అగ్ర కులాల వారు మాత్రమే ప్రతి సంవత్సరం ఉంటున్నారు. దీనిని అన్నీ కులాల వారు ఒక్కొక్క సంవత్సరం చేపట్టాలని తేదీ 25/07/2021 న జరిగిన వి డి సి సమావేశంలో మాదిగ కుల తరపున ఉన్న సభ్యుడు ప్రతిపాధించాడు.దీనిని జీర్ణించుకోలేని అగ్ర కులస్తులు అయిన గ్రామ సర్పంచ్ శివయోల్ల శివారెడ్డి(రెడ్డి), మున్నార్ కాపు కులస్తులైన మంద జనార్ధన్, మంద లక్ష్మణ్, కర్ణశిమోల్ల మోహన్,బక్కనొల్ల రాజన్న లు మమ్ములనే ప్రశిస్తారా, కోశాధికారి పదవి కావాలని అడుగుతారా అని మాదిగ లంజాకొడుకు డుకులరా, లమిడి కొడుకులరా అంటూ బూతులు తిడుతూ, కులం పేరుతో వారిని అవమాన పరుస్తూ పట్ల కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారు.

మాదిగ కులస్తులు డప్పు కొట్టడం ప్రధాన వృతి. గ్రామంలోని కుటుంబాలు మంచి, చెడు కార్యక్రమాలకు డప్పు కొట్టడం కోసం మాదిగ కులస్తులను పిలుస్తారు. అందుకు కూలీ చెల్లిస్తారు. వి డి సి సమావేశంలో అన్ని వృతుల వారికి కూలీ పెంచి నట్లుగా డప్పు కొట్టినందుకు వారికి కూలీ పెంచాలని కోరినారు. దీన్ని ఒప్పుకోక పోగా, సర్పంచ్, పైన పేర్కొన్న మిగితా వారి పట్ల మరింత కక్ష పెంచుకొన్నారు. కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారు.గ్రామంలో 70 మాదిగ దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసినారు.

గ్రామంలో జరిగిన మంచి చెడు కార్యక్రమాలకు డప్పు కొట్టడం కై పిలువ కూడదని నిర్ణయించారు. అందులో భాగంగా బక్కనొల్లే రాములు నూతన గృహ ప్రవేశానికి డప్పులు కొట్టడానికి వారిని పిలువలేదు. అంతే గాక కులాస్ పూర్ గ్రామానికి చెందిన వారిని పిలుచుకొని డప్పులు కొట్టించు కొన్నారని . ఇంకా గ్రామంలో బక్కనోల్ల సాయిలు, భీమన్నోళ్ళ భీరయ్య, కర్ణశిమోళ్ళ మోహన్ (కేసులో ముద్దాయి) గృహప్రవేశాలు జరిగితే వారు కూడా డప్పులు కొట్టడానికి పిలువలేదని చెప్పారు.వీరు కూడా ప్రక్కన ఉన్న కూలస్ పూర్ గ్రామానికి చెందిన వారిని డప్పు కొట్టడానికి పిలుచుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యస్.సి వాడకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేశారు. గత కొంకాలంగా యస్.సి వాడకు ప్రభుత్వ వపరంగా వచ్చే నిధులతో రోడ్లు,మురికి కాలువలు అభివృద్ధికి నిధులు కేటాయించడంలో వివక్షత కొనసాగుతుంది. దాంతో యస్సి వాడల్లో రోడ్లు, మురికి కాలువలు హీనంగా ఉన్నాయి.

గ్రామంలో మాదిగ కులస్తులకు రెండు స్మశాన వాటికలు ఉండెను.ఇందులో రోడ్డు ప్రక్కన ఉన్న ఒక స్మశాన వాటికను వి.డి.సి స్వాధీనం చేసుకున్నది అని తెలిపినారు. ఇవి యస్.సి/ యస్.టి చట్టం ఉల్లంఘనే అవుతాయి. యస్.సి లు ప్రశ్నించినందన వారిని సాంఘిక బహిష్కరణ చేసింది ఎవరి దృష్టికైన తీసుకెళ్లితే మీ ప్రాణాలు దక్కవాని బెదిరింపులు చేసినారు అన్నారు. తేదీ 25/8/2021 న డిచ్ పల్లి పోలీసులకు పిర్యాదు చేశారు.తిరిగి పూర్తి వివరాలతో 28/08/2021 న పిర్యాదు చేశారు. కానీ పూర్తి వివరాలు లేని పిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ కూడా అన్యాయం జరిగింది. న్యాయం కోసం జిల్లా కలెక్టర్ నిజామాబాద్ గారికి పిర్యాదు చేశారు.పోలీసులు నేరస్తులను అరెస్టులు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. దీంతో కేసు బలహీన పడుతుంది. నేరస్తుల వలన వారికి ప్రమాదం ఉంది. రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మా జీవనోపాధికి , వృత్తికి అటంక పర్చడం వలన వారి హక్కులు హరించి పోతాయి.

ఇప్పటికైనా న్యాయం చేయాలని వారు కోరుచున్నారు. రక్షణ కల్పించాలని,నేరస్తులను అరెస్టు చేసి,నేర విచారణ నేస్తులకు శిక్ష పడే విధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

నిజ నిర్ధారణ బృందంకు ఈ క్రింది విషయాలు నిర్ధారణకు వచ్చింది.

1). వి.డి.సి లో కోశాధికారి పదవి అన్ని కులాలు ఒక్కొక్క సంవత్సరం చేపట్టాలని అడగడం వలన ఇప్పటి వరకు రెడీ, మున్నూరు కాపు కులస్తులకు హుకుం ను మాదిగ కులస్తులు దిక్కరంగా,ఇది పెను తుపాన్ గా మారే ప్ ప్రమాదంగా మారుతాయి అని భావించారు.
2). నిమ్న కులాలు, ఇతర కులాలు కుక్కిన పేను వలే ఉండాలని,ఓటు బ్యాంక్ కాకుండా దిక్కర స్వరంగా మార కూడదని రెడీ కులస్తుల ఆధిపత్య ధోరణి.
3).మాదిగలు చెప్పినట్లు వినడం లేదని వారి వాడలకు రోడ్లు, మురికి కాలువలు, వీధి లైట్లు అభివృద్ధికి నిధులు కేటాయించడంలో వివక్షత కొనసాగుతుంది.
4). మాదిగలను సాంఘిక బహిష్కరణ చేసింది వాస్తవం. గృహ ప్ ప్రవేశ శుభ కార్యాలు చేసినప్పుడు మాదిగ కులస్తులను డప్పు కొట్టడానికి ప్ పిలువలేదు.
5).పోలీసులు కేసు నమోదు చేయకుండ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనికి రాజకీయ కారణాలు ఉన్నాయి.
6). కేసులో ముద్దాయిలను అరెస్టు చేయకుండ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన మాదిగలు నిరాశకు గురయ్యా న్యాయం కోసం పోరాడకుండా, రాజీ పడాలని రాజకీయ నాయకులు కుట్ర.పార్టీలు వేరైనా భావం ఒక్కటే.
7). ప్రభుత్వం వెంటనే యస్.సి వాడకు, బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.
8). కేసు బలహీన పడకుండ నేరస్తులను అరెస్టు చేయాలి. లేనిచో వారు సాక్షాలను ప్రభావితం చేస్తారు.
9). స్మశాన వాటిక స్థలాన్ని తిరిగి మాదిగలకు ఇవ్వాలి.
10). వీధి లైట్లు, మురికి కాలువలు, రోడ్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
11). సాంఘిక బహిష్కరణ ఎత్తి వేసే టట్లు అధికారులు తీసుకోవాలి.
నిజ నిర్ధారణ బృందం లో సీ. యల్. సి నుండి అల్గొ ట్ రవీందర్, కొంగర శ్రీనివాస్ రావు, ప్రవీణ్, AIKMS నుండి సాయగౌడ్, మురళి, IFTU నుండి సుధాకర్, POW నుండి సంధ్య పాల్గొన్నారు.

Comments