ప్రియమైన ప్రజలారా! ప్రజాస్వామిక వాదులారా!
సరిగ్గా 36 సంవత్సరాల క్రితము ఇదే రోజు (1985,3,సెప్టెంబర్) డాక్టర్ రామనాదము మధ్యాహ్నము 12 నుండి 1 గంటల మధ్య వరంగల్ JPN Road లొని తన ప్రజావైద్యశాలలో గుర్తు తెలియని హంతక మూక చేతిలో హత్యకు గురయ్యారు. ఆ హంతక మూకను ఇప్పటివరకు గత మూడున్నర దశాబ్దాలుగా ఈ వ్యవస్త శిక్షించ లేదు. భవిష్యత్తులొ శిక్షిస్తదనె నమ్మకము ప్రజలకు లేదు.
ఎందుకంటే వ్యవస్థలో భాగమైన ఈ హంతక మూక ప్రజాదన దోపిడి వర్గాల సేవలో మునిగి ఉన్నది. డాక్టర్ రామనాదము గారు నాటి పాలకవర్గాల దోపిడిని ఎదురిస్తూ ప్రజలవైపు గిరిగీసి నిలబ డీన విప్లవుద్యమము మీద పాలకవర్గాలు యన్.టి. రామా రావూ నాయకత్వములో కొన సాగిస్తున్న దుర్మార్గదాడీని పౌరహక్కులనేతగా తీవ్రంగా వ్యతిరెకిస్తూ ప్రజాస్వామిక పద్ధతుల్లో రాజ్యంగ బద్దముగా పోరాడిన గొప్ప హక్కుల ఉద్యమకారుడు.
అప్పటికే ఐదు సంవత్సరాలుగా వరంగల్లు లొ ఉదృతముగా కొనసాగుతూన్న విద్యార్థి ఉద్యమములొ బాగస్వామ్యముగా ఉన్న నేను డాక్టర్ గారి పెరు విన్నాను కాని,ఎన్నడూ ముఖాముఖిగా చూడలేదు. ఎందుకంటే నాటి విద్యార్థి ఉద్యమ వెళ్లువ విషాలమైనది,విస్తృత మైనది.సభలలో,సమావేశాలలో సార్ పాల్గొనెవారు కాని స్పీకర్ గా నేను ఎన్నడూ చూడలేదు. కాని గొప్ప మానవత వాదిగా,వరంగల్ ప్రజలు ఆప్యాయముగా పిలుచుకునె ప్రజల డాక్టర్ గా,పసిపిల్లల డాక్టర్ గా,హాక్కులనెతగా పీడీత ప్రజల మనసుల్లో నిలిచిపొయారు. డాక్టర్ గారి త్యాగము హిమా లాయాలకన్న ఉన్నతమైనది.
డాక్టర్ గారిని పాషవికముగా చంపిన దుర్మార్గ మూక బతుకు,చావు రెండూ గడ్డి పొచ కన్న హేనమైనది. డాక్టర్ గారి దుర్మార్గ హాత్యతొ నాలుగు సంవత్సరాలు పౌరహక్కుల సంఘ కార్యకాలాపాలు నిలిచిపోయి,మల్లి 1989 చివరన వరంగల్ లొ పౌర హక్కుల సంఘము జిల్లా కమిటి కన్వినర్స్ గా అమరులు నర్రప్రబాకర్ రెడ్డి,బుర్ర రాములు గారి నాయకత్వములో ఏర్పడినది. అందులొ భాగస్వామ్యమయినాము. డాక్టరు గారికి
తెలంగాణప్రజస్వామిక వేదిక అషృణివాలి అర్పిస్తున్నది-
- కన్వినర్స్ కమిటి,తెలంగాణప్రజస్వామిక వేదిక.
Comments
Post a Comment