*కార్పొరేట్ మెడికల్ మాఫియా దోపిడీకి వత్తాసుగా వున్న ప్రభుత్వ విధానాలను ఎండగడదాం*
*సంఘటితంగా కరోనాను తరిమి కొడదాం*
*జీవించే హక్కుకోసం పోరాడుదాం*.
-----------------------------*-------
*ప్రజా పార్లమెంట్*
---------------------------
తే.15-08-2021. ఆదివారం
సమయం =ఉ: 10గంటల నుండి, సా :5గం :వరకు
స్థలం :టౌన్ హాల్, నెల్లూరు.
నిర్వహణ :పౌర హక్కుల సంఘం (నెల్లూరు జిల్లా కమిటీ )
********************
ముఖ్య వక్తలు :
1)చిలుక చంద్రశేఖర్. CLC.
2)వీరమాచినేని రామకృష్ణ,
3)Dr. మువ్వా రామారావు,
Dr. గోపళం శివన్నారాయణ.
ప్రజలారా!ప్రజాస్వామికావాధులారా!!
*ఆరోగ్యం మనహక్కు*
*ప్రజలందరికి వైద్యం ప్రభుత్వాల బాధ్యత*.
నేడు ప్రపంచమంతా కరోనా బారినపడి లక్ష లాది మంది చనిపోవడం, కోట్లాదిమంది వ్యాధి గ్రాస్తులయ్యి శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా కుంగిపోతున్నారు.మన కళ్ళముందే తల్లి తండ్రులను కోల్పోయిన చిన్నారులు, భార్యలను కోల్పోయిన భర్తలు, భర్తలను కోల్పోయిన భార్యలు, ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులను మనం చూస్తున్నాం.ఫస్ట్ వేవ్ లో ప్రభుత్వాలు ఎంతోకొంత స్పందించినా, సెకండ్ వేవ్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా చేతులెత్తేసి ప్రజలను గాలికొదిలేసాయి.
ఫలితంగా పేద, మధ్య తరగతి ప్రజలు ఆసుపత్రుల పాలై, ఉన్న అరకొర ఆస్తులు సైతం అమ్ముకొని ఆక్సిజన్ అందక మరణించారు. మరోవైపు *ఆసుపత్రికి వచ్చి చేరితేతప్ప బ్రతకరు* అనే ప్రచారంతో *కార్పొరేట్ మెడికల్ మాఫియా* కోట్లాది రూపాయలు ప్రజల నుండి లూటీచేసింది. కమిషన్లకు కక్కుర్తి పడ్డ *బ్రోకర్లు రంగం మీదకొచ్చి పేషంట్లను వారికనుకూలమైన ఆసుపత్రులకు తరలించి దొరికినకాడికి దోచుకున్నారు. మరోవైపు మందుల కంపెనీల మాయాజాలం ప్రజలపాలిట విశవాలయంగా మారి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసి *జీవించే హక్కుకు* సవాలు విసురుతున్నది. కళ్ళముందు జరుగుతున్న ఈ ఘోరాన్ని కళ్ళప్పగించి చూస్తున్న ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల తీరు బాధాకరం
*ప్రభుత్వాసుపత్రికి పొతే ప్రాణాలు పోతాయ్, ప్రైవేట్ ఆసుపత్రికి పొతే ప్రాణాలతో పాటు ఆస్తులు కూడా పోతాయ్* అనే భయాందోళనలతో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. *థర్డ్ వేవ్* రాబోతుందని, భవిషత్తులో అనేక వేరియాంట్లు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం *ప్రకృతి సమతుల్యం దెబ్బతినడమేనని* శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వైరస్ లు ఇప్పుడు కొత్తగా పుడుతున్నవి కాదు. కొన్ని లక్షల ఏళ్లుగా జంతువులు, పక్షుల్లో ఉన్నవే. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపు మార్చుకుంటున్నవే.
మరి ఇప్పుడు కొత్తగా ప్రభావం చూపించడానికి ప్రధాన కారణం *పర్యావరణ విధ్వంసం*. ఈ విషయాన్ని ప్రభుత్వాలు చెప్పవు, శాస్త్రవేత్తలు హెచ్చరించినా దాన్ని వెలుగులోకి రానీయవు. ఎందుకంటే *దొంగ దొరికిపోతాడు* పర్యావరణ విధ్వంసం గురించి మాట్లాడాలంటే ఈ దేశంలో జరుగుతున్న అడవుల నరికివేత, అక్రమ మైనింగ్ గురించి మాట్లాడాలి, దీన్ని అడ్డుకుంటున్న ఆదివాసీ ల గురించి మాట్లాడాలి, ఆదివాసీలపై ప్రభుత్వాలు చేస్తున్న హత్యకాండ గురించి మాట్లాడాలి, ఈ దుర్మార్గం ఏమిటని, ఇదెక్కడి దేశభక్తి అని ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాలపై, హక్కుల సంఘాలపై పెడుతున్న *దేశద్రోహం* కేసుల గురించి మాట్లాడాలి. దీన్ని దారిమళ్ళించేందుకే *దీపాలు వెలిగించండి, చప్పట్లు కొట్టండీ* అంటూ లాక్ డౌన్ ల తో, మానవ సంబంధాలను ధ్వంసం చేస్తూ, మనుషుల్ని సామజికంగా ఒంటరిని చేస్తున్నారు. వాక్సినేషన్ కూడా మందకొడీగా జరుగుతున్నది. ఇంకోవైపు వాక్సినేషన్ వల్ల భయంకరమైన అనార్ధాలు ఉన్నాయని ప్రచారంచేయడం, ఆందోళనలు చేయడం చూస్తున్నాము. కోవిషీల్డ్ శక్తివంతంగా పనిచేస్తుందని, కోవాక్సిన్ సమర్ధవంతంగా పనిచేయడం లేదనే అనుకూల, వ్యతిరేక ప్రచారాలను ప్రజలనుండి వింటున్నాం. ప్రపంచ వ్యాపితంగా అన్ని దేశాలలో వాక్సినేషన్ ఆయా ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరుగుతుంటే, మనదేశం లో మాత్రం ప్రయివేట్ కంపెనీలకు అప్పగించారు.
ప్రజల ఆరోగ్యాన్ని కార్పొరేట్లకు అప్పగించడం దుర్మార్గమనీ, ఇవి ప్రజా సంక్షేమ ప్రభుత్వాలు చేయాల్సిన పని కాదనీ, *వైద్యాన్ని జాతీయం చేయాలనీ* 2009నుంచి *పౌర హక్కులసంఘం* ఆధ్వర్యంలో దశల వారీగా అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. *అయినా నిద్ర నటిస్తున్నవాడిని ఎలా లేపగలం?*
ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్ -19 మీద ప్రజలలో సరైన అవగాహనా కలిగించేందుకు, ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల ముందుంచి *ప్రజలు కేంద్రంగా ప్రభుత్వాల ప్రజరోగ్య విధి విధానాలు ఉండాలనీ, వైద్యాన్ని జాతీయం చేయాలనీ* ప్రభుత్వాలను నిలదీసేందుకు, కార్పొరేట్ మెడికల్ మాఫియా క్రూర కబంధ హస్తాలనుండి ప్రజలను బయట పడవేసేందుకు, నిజానిజాలను, సాధ్యాసాధ్యలను చర్చించుకొనేందుకు ఈ *ప్రజాపార్లమెంటు* కు అందరినీ సాధరంగా ఆహ్వానిస్తున్నాము.
మీ అనుభవాలను, సూచనలు, సలహాలను తెలియచేసి, భవిష్యత్ ఉద్యమంలో మీరంతా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
*ప్రజా పార్లమెంటు* లో ప్రజలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాలు, వైద్యులు, మేధావులు, సామజిక కార్యకర్తలు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము.
*పౌర హక్కుల సంఘం*
నెల్లూరు జిల్లా కమిటీ.
Comments
Post a Comment