న్యాయవాది( ఓపీడీఆర్ ) శివశంకర్ ,సదానందం ల పై పెట్టిన ఉపా కేసును ఎత్తి వేయాలి | ఉపా రద్దు పోరాట కమిటీ, ఆంధ్రప్రదేశ్

ప్రెస్ నోట్ విజయవాడ 18.08.2021 ************************

న్యాయవాది( ఓపీడీఆర్ ) శివశంకర్ ,సదానందం ల పై బనాయించిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కేసును తక్షణం ఎత్తి వేయాలి.

************************
ఉపా రద్దు పోరాట కమిటీ. ఆంధ్రప్రదేశ్. AP.
************************

యూసిసిఆర్ఐ(ఎం. ఎల్)కిషన్ పార్టీ కార్యదర్శి జి. సదానందం, ఓపిడిఆర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు అడ్వకేట్ శివశంకర్ పై ఉపా చట్టం కింద పెట్టిన అక్రమ కేసును వెనక్కి తీసుకోవాలని ఉపా రద్దు పోరాట కమిటి. ఆంధ్రప్రదేశ్ AP డిమాండ్ చేస్తుంది. మావోయిస్టు పార్టీ తో సంబంధాలున్నాయని చెప్పి నిరాధార ఆరోపణలు చేసి ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం అత్యంత దుర్మార్గం.దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నిరసిస్తు న్నాము. వాస్తవం గా వారిద్దరు మావోయిస్టులు కాదు. మావోయిస్టులు తో సంబంధాలు లేవు. ఇది ప్రజలు అందరికి తెలిసిన విషయమే.తక్షణమే కేసును ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపా రద్దు పోరాట కమిటి డిమాండ్ చేస్తోంది. వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపా రద్దు పోరాట కమిటీ డిమాండ్ చేస్తున్నది.

శివ శంకర్ వరంగల్ కాజీపేట లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు అదేవిధంగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు గా పని చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం వారు కృషి చేస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా హక్కుల పరిరక్షణ కోసం పని చేస్తున్నా న్యాయవాదులు పైన ప్రజల హక్కుల కోసం పని చేసే వామపక్ష పార్టీ నాయకుడైన సదానందం పైన తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ఉపా చట్టం ప్రకారం కేసు నమోదు చేయడం ప్రభుత్వ దమన నీతికి నిదర్శనం. వారు ప్రజల సమస్యల కోసం మాట్లాడే ప్రజాస్వామిక వాదులు. వారి పై నిర్భధం, అణచివేత అప్రజాస్వామికం.వారి గొంతును నొక్కేయడం బాధా కరం. 

దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపా రద్దు పోరాట కమిటీ తీవ్రంగా నిరశిస్తుంది. ఇదేనా ప్రజాస్వామ్య పాలన అంటే అని ప్రశ్నిస్తుంది. తక్షణం వారి పై కేసుని ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం ని ఉపా రద్దు పోరాట కమిటి. ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తోంది.ప్రభుత్వాలు ని ప్రజల తరపున ప్రశ్నించే మేధావులు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు మేధావులు పైన ప్రభుత్వాలు ఉపా చట్టాన్ని ప్రయోగిస్తూ అణచి వేస్తున్నారు.దేశ ప్రజల్ని నేరస్తులు గా మార్చే ఉపా చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.

 ఇట్లు. చిలుకా చంద్రశేఖర్. కన్వీనర్ నంబూరి. శ్రీమన్నారాయణ కో- కన్వీనర్. ఉపా రద్దు పోరాట కమిటీ. ఆంధ్రప్రదేశ్.

Comments

Post a Comment