ఫాదర్ స్టాన్ స్వామి సమస్మరణ సభ | శ్రీకాకుళం జిల్లా

22ఆగస్ట్ 2021న, ఉదయం 10గం "లకు ఫాదర్ స్టాన్ స్వామి సమస్మరణ సభ, క్రాంతి భవన్, శ్రీకాకుళం లో ఉపా రద్దు పోరాట కమిటీ "ఆధ్యర్యంలో నిర్వహించారు ఈ సభకు వక్తలను మిస్కా కృష్ణయ్య(knps) ఆహ్వానించారు.సభకు పత్తిరి దానేష్ (clc)అధ్యక్షత వహించారు.జగన్నాధం hrf, జర్నలిస్టవేదిక నల్లి ధర్మారావు, తాండ్ర ప్రకాష్ న్యూడెమోక్రసీ, గణేష్ లిబరేషన్, ప్రభాకర్ knps, ఈశ్వరావుadvocate, అరుణ, వీరాస్వామి, pkm నీలకంఠ, దుర్యోధన ప్రసంగించారు. ధర్మారావు మాట్లాడుతూ రాజద్రోహం నేరం అప్రజాస్వామికమని దాన్ని రద్దు చేయాలని, మేధావులు, రచయిత లు, విలేకరులు, ప్రొఫెసర్స్, లాయర్లు, పోరాడే, మాట్లాడే నాయకులపై ఉపా చట్టం తో అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని, ఆ చట్టాలను రద్దుచేసి బేషరతుగా విడుదల చేయాలని అన్నారు.

మాట్లాడిన వక్తలందరు అప్రజాస్వామిక చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. వేడంగి చిట్టిబాబు పౌరహక్కులసంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఫాదర్ స్థాన్ స్వామి ని స్మరించుకొంటూ, ఆయన్ని జైలు అధికారులు, nia పోలీస్ అధికారులు, బెయిల్ రాకుండా నిరాకరిస్తున్న కోర్టులుఆయన మరణానికి బాధ్యత వహించాలని. జ్యూడిషల్ కష్టడి మరణం గ పరిగనించాలని, మరణానికి బాద్యులైన వారిపై కేసు కట్టి శి క్షించాలని, జార్ఖండ్ రాష్ట్రంలో స్థాన్ స్వామి ఆదివాసి ప్రాంతంలో నివసిస్తూఆదివాసీలతో మమేకమై వాళ్ళ హక్కుల చైతన్యాన్ని పెంపోందిస్తూ,5th షెడ్యూల్డ్ గురుంచి, పంచాయితీ రాజ్ చట్టం గురుండి,
ఆదివాసి కౌలుదారి రక్షణ చట్టాల గురుండి, సహజవనరులు దోపిడీకి వ్యతిరకంగా చైతన్యపరిచి నందుకు, అయనను భీమాగొరిగావ్ కేసులో అక్రమంగా ఇరికించి జైల్లో నిర్భందించి 84సం "ల వృద్ధుడిమరణానికి కారకులైనారు. అయన చేసిన నేరం ఆదివాసులకు చట్టాల చైతన్యాన్ని కలుగచేసినందుకు. రాజద్రోహం, చట్ట వ్యతిరేక కార్య కాలాపాల నిరోధక చట్టం "ఉపా "సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం, కేసు విచారణ పద్ధతులు, సాక్షులకు సంబంధించి అసాధారణ అంశాలు పైన మాట్లాడారు.

 ఉపా చట్టాన్ని,124(a)రాజద్రోహం లాంటి క్రూర చట్టాలు రద్దుకై ఉద్యమించాలని, అక్రమంగా జైల్లో వున్న వారందరిని విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు.

Comments