ప్రెస్ నోట్ కొవ్వూరు 23. 08. 2021 ******************************
ఈరోజు 23.08.2021పౌర హక్కుల సంఘం అం దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో దళితుల హత్యలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయవిచారణ జరిపించాలని కొవ్వూరు ఆర్డిఓ ఆఫీస్ వద్ద ధర్నా జరిగింది ఈ ధర్నాలో రోజురోజుకూ పెరిగిపోతున్న దాడులు హత్యలు అత్యాచారాలు పై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించాయి. ఈ ధర్నా కార్య క్రమాన్ని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ ప్రారంభించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర భారత పాలనలో దళితులపై దాడులు హత్యలు అత్యాచారాలు జరగటం అత్యంత దుర్మార్గం దారుణం అని అన్నారు సాంఘిక వివక్ష వెళ్లి బహిష్కరణ అవమానం అం దేశ ములో ఎక్కడో ఒకచోట సెకనుకి ఒకటి చొప్పున జరుగుతున్నాయని ఇది పాలకుల వైఫల్యమే అని ఆరోపించారు పది సంవత్సరాల్లో అటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి చేయాలని రాజ్యాంగం నిర్దేశించిన అప్పటికీ హక్కులను చట్టాలను అమలు పరచటంలో వైఫల్యం చెందారని ఆరోపించారు విమర్శించారు పాలకుల చిత్తశుద్ధి లేదని అన్నారు అన్నారు స్వేచ్ఛ సమానత్వం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉందని దాన్ని అమలు చేయడంలో ఇన్నేళ్లు అధికారం వెలగబెట్టిన టువంటి పార్టీలు విఫలం చెందారని అని అన్నారు
దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజు రాజు మాట్లాడుతూ అగ్రవర్ణాలు దళితులపై దాడులు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు దళితులకు రక్షణ కల్పించడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆవేదన చెందారు హత్యకు గురైన కుటుంబాలకు న్యాయం చేయకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు దళిత రక్షణ దళం నాయకులు కొడమంచిలీ వెంకటరమణ మాట్లాడుతూ మూడు ఎకరాలు భూమిని ప్రతి దళిత కుటుంబానికి మంజూరు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు నక్క వెంకటరత్నం మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు దేశములో రక్షణ లేదని ఆవేదన చెందారు తక్షణం ఎస్సీ ఎస్టీ లకు రక్షణ కల్పిస్తూ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు మహిళా సంఘం నాయకురాలు ఏమని మల్లిక మాట్లాడుతూ దళిత మహిళలపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు తీవ్రమైన ఇటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు
మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ మహర్షి మాట్లాడుతూ దళిత విద్యార్థులకు ఫీజులు మాఫీ చేయాలని స్కాలర్షిప్లు మంజూరు చేయాలని పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు దళిత విద్యార్థులకు చదువు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ ధర్నాను ఉద్దేశించి ఐ.ఎఫ్.టి.యు మహేంద్ర దళిత ప్రజా వేదిక నాయకులు సురేష్ సుశీల మహిళా సంఘం నాయకురాలు నాగమణి పిడిఎస్యు నాయకులు మణికంఠ తదితరులు మాట్లాడారు. అనంతరం కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారికి విజ్ఞాపన పత్రం పలు డిమాండ్లతో సమర్పించారు.
ఇట్లు
నక్క వెంకటరత్నం.జిల్లా అధ్యక్షులు పౌర హక్కుల సంఘం. పశ్చిమగోదావరి జిల్లా శాఖ.
చోళ రాజు
రాష్ట్ర అధ్యక్షులు .దళిత ప్రజావేదిక
కొడమంచిలి వెంకటరమణ దళిత రక్షణ దళం. రాష్ట్ర నాయకులు.
ఈమని మల్లిక ప్రగతిశీల మహిళా సంఘం (పి ఓ డబ్ల్యు)
ఎన్ ఎస్ వి మహర్షి. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యు)
బి.మణన్ భారత కార్మిక సంఘాల సమాఖ్య
(ఐ ఎఫ్ టి యు).
Comments
Post a Comment