టీ నర్సాపురం ఎస్ఐ కొట్టిన సంఘటనపై నిజనిర్ధారణ | టి. నర్సాపురం, ప. గో జిల్లా

ప్రెస్ నోట్

టీ నర్సాపురం 29 08 20 21

 టీ నర్సాపురం ఎస్ఐ కొట్టిన సంఘటనపై పౌర హక్కుల సంఘం నిజనిర్ధారణ బృందం నివేదిక ప్రచురణార్థం పత్రికలకు విడుదల చేయుచున్నాము ఈనెల 25 0 8 20 21 అర్ధరాత్రి 12 గంటల సమయంలో జగ్గవరం వెళ్లి తిరిగి వస్తున్న మద్దాల ధనరాజ్ ని టీ నర్సాపురం ఎస్ఐ తీవ్రంగా కొట్టి గాయపరచిన సంఘటనపై పౌరహక్కుల సంఘం నిజ నిర్ధారణ బృందం ఈ రోజు టీ నర్సాపురం లో పర్యటించింది. బృందం సభ్యులు పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హై కోర్ట్ న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, న్యాయవాది కె.వి రత్నం, జిల్లా ఉపాధ్యక్షులు న్యాయవాది భాషా శ్యాంబాబు జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రత్నం లు బాధితుడిని ఆయన ఇంటి వద్ద కలిసి పరామర్శించడం జరిగినది.

సంఘటనకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా బాధితులు పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ బృందానికి తెలియజేశారు. రాజు బృంద సభ్యులతో మాట్లాడుతూ ఆ కారణంగా నన్ను ను తీవ్రంగా కొట్టి గాయపరిచారని తెలిపారు టీ నర్సాపురం ఎస్ఐ గారు కొట్టిన దెబ్బలు నా తలకు వీపు పైన చేతుల పైన పిరుదుల పైన తీవ్రమైన దెబ్బ తగిలి తల నుండి రక్తస్రావం జరిగిందని తెలిపాడు. తలకు తగిలి నటువంటి రక్తపు గాయాన్ని ఒంటి మీద ఉన్నటువంటి దెబ్బలను బృందానికి చూపించారు. న్యాయం చేయాలని కోరినారు. బృందం నిర్ణయం అన్ని విషయాలను పరిశీలించి నటువంటి నిజనిర్ధారణ బృందం టీ నర్సాపురం ఎస్ ఐ విధినిర్వహణలో అదుపుతప్పి మద్దాల ధనరాజ్ ను తీవ్రంగా గాయపరచడం జరిగిందని

ధనరాజ్ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకొని ధన్ రాజ్ ఆరోపణ నిజమైన దేనని అన్నారు. మద్దాల ధనరాజ్ గాయపరిచిన ఇటువంటి నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నమోదు చేసి తక్షణం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరినారు. ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం గాయపడిన వంటి బాధితునికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సబ్ డివిజన్ పోలీస్లు సబ్ డివిజన్ పరిధిలో ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతున్న వీటిని అరికట్టడంలో పోలీసులు విఫలం చెందారని పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ బృందం విమర్శించింది.

ఈ సంఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా ఇంత వరకు పోలీసులు రెవెన్యూ అధికారులు ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవటం ఆక్షేపించింది. కేసు నమోదు చేసిsc, st చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని పౌర హక్కుల సంఘం నిజనిర్ధారణ బృందం విజ్ఞప్తి చేసినది.

      ఇట్లు 
కె.వి రత్నం జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది 
భాషా శ్యాంబాబు. న్యాయవాది జిల్లా ఉపాధ్యక్షులు పౌర హక్కుల సంఘం పశ్చిమగోదావరి జిల్లా

Comments