గిట్టుబాటు ధర కల్పించాలి | శ్రీకాకుళం జిల్లా

రైతుల దగ్గర నుండి జీడిపిక్కలు షావుకార్లు చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత బస్తా 80 కేజీలు 12 వేల రూపాయలు అయిపోయింది ఎనిమిది వేల రూపాయలకు కొన్నా మాకు గిట్టుబాటు అవటం లేదు అన్న వాదన నిజమా లేదా మోసమా ఖచ్చితంగా మోసమే ఇలాంటి మోసగాళ్ల తో మార్కెట్ను గుప్పెట్లో పెట్టుకున్న కార్పొరేట్ లతో చర్చించటం ఎవరి ప్రయోజనాల కోసం మనం అర్థం చేసుకోవాలి

ఈ మోసపూరిత షావుకార్లు ప్రపంచీకరణ కారుచౌకగా పిక్కలు దొరుకుతున్నాయి అనే తప్పుడు వాదనలు తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు ప్రభుత్వాలు పాలకులు గత యాభై ఏళ్ళ నుండి వీళ్ళను మోసుకొస్తూ ఉన్నారు అందుకే షావుకార్లు వ్యవస్థ రద్దు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అందుకు కు మార్క్ఫెడ్ ఏర్పాటుచేసి ఇతర పంటలు లాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలి ఇంతకుమించి గిట్టుబాటు ధర కు ప్రత్యామ్నాయం లేదు ఇందులో భాగంగానే ఈరోజు గరుడ భద్ర అక్కుపల్లి బాతుపురం చిన్నా వంక పల్లె సారధి గోకులపాడు లలో పర్యటించి సచివాలయాలకు మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రాం మొత్తం గిట్టుబాటు ధర పోరాట కమిటీ ప్రజా సంఘాల నాయకత్వంలో జరిగింది

మిత్రులారా రైతులారా ప్రజాస్వామికవాది లారా ఈ పోరాటాన్ని దశలవారీగా సంవత్సరం పొడుగునా కొనుగోలు కేంద్రాలకు వివిధ రకాల పోరాటాలలో అందరూ భాగస్వాములు కావాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం

Comments