ముప్పిడి రాజును హత్య చేసినవారిని అరెస్టు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం | జంగారెడ్డిగూడెం, ప గో జిల్లా

తేదీ  24-8-2021
జంగారెడ్డిగూడెం
                                     
       శ్రీనివాసపురం దళిత యువకుడు ముప్పిడి రాజు హత్య పై చర్యలు తీసుకోకపోవడం వల్ల రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు దళిత సంఘాల ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం అందుగుల ఫ్రాన్సిస్, ఎస్ రామ్మోహన్, బి శ్యాంబాబు, జొన్నకూటి శ్రీను, కలపాల రాజ్ కుమార్ ల  అధ్యక్షతన జరిగింది.  ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయవాది, పౌర హక్కుల సంఘం  CLC  రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ శ్రీనివాసపురంలో హత్యకు గురైన ముప్పిడి రాజు తో పాటు గతంలో జరిగిన 4 హత్యలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసును హైకోర్టు పర్యవేక్షణలో  సిబిఐ కి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ముప్పిడి రాజు హత్య ను సాక్ష్యాలను తారుమారు చేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది అన్నారు. నిందితులు కేసును పక్కదారి  పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు అని అన్నారు.

కేసును ను వేరే వాళ్ల మీద కి మళ్లీ ఇస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. జిల్లా కలెక్టరు సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ జోక్యం చేసుకొని విచారణ పారదర్శకంగా జరిపించాలని  వారు కోరినారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగినట్లు అయితే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంది అన్నారు .ఈ సమావేశం అనంతరం ఏలూరు రోడ్డు పంగిడి గూడెం సెంటర్ వద్ద నిరసన ఆందోళన నిర్వహించారు. ఈ అఖిలపక్ష కమిటీ   "ఎస్సీ, ఎస్టి హత్య ,అత్యాచార న్యాయ పోరాట కమిటీ" ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఐదుగురు కన్వీనర్లుగా సంఘాని ఒకరు కో కన్వీనర్ గా మిగతావారు సభ్యులుగా 24 ప్రజా సంఘాల రాజకీయ పార్టీలతో ఈ కమిటీ నిర్మాణం చేశారు.

పౌర హక్కుల సంఘం నుండి న్యాయవాది బి. శ్యాంబాబు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నుండి కె.వి.రమణ సిపిఎం జీవరత్నం కాంగ్రెస్ నుండి ముప్పిడి శ్రీనివాస రావు బహుజన సమాజ్ వాది పార్టీ కే రాజ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుండి.J  శ్రీనివాసరావు  పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ఎస్ రామ్మోహన్ కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర అఖిలభారత రైతుకూలి సంఘం  AIKMS  జిల్లా అధ్యక్షులు వెట్టి సుబ్బన్న. సిపిఎం పట్టణ కార్యదర్శి మాణిక్యాలరావు పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి ఈపిచర్ల. భూషణం ,న్యాయవాదులు జువ్వల బాబ్జి ,కిషోర్ , ప్రజా సంఘాల నాయకులుKNPS జాన్ రాజ్ , అఖిల భారత రైతు కూలి సంఘం  రాజశేఖర్,మాలమహానాడు లీగల్ కార్యదర్శి తుర్లపాటి శ్రీనివాస్, అంబేద్కర యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పొలిమేర శ్రీనివాస్, నాగరాజు , మృతుడు ముప్పిడి రాజు తండ్రి ముప్పిడి యేసు, తల్లి ముప్పిడి మరియమ్మ , మేనత్త సుశీల, మానవ హక్కుల సంఘం రాజేష్, రోహిత్ లు కూడా పాల్గొన్నారు. ముప్పిడి రాజు ను హత్య చేసిన నిందితులను అరెస్టు చేసే వరకూ జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని నాయకులు అన్నారు.  ఈ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని నాయకులు నిర్ణయం తీసుకున్నారు.
              ఇట్లు
 S రామ్మోహన్, బి శ్యాంబాబు,అందుగుల ఫ్రాన్సిస్,జొన్నకూటి శ్రీను,కలపాల. రాజ్ కుమార్.      కన్వీనర్లు.                                                          ఎస్సి,ఎస్టి హత్య,హత్యాచార వ్యతిరేక న్యాయ పోరాట కమిటీ. శ్రీనివాసపురం. జంగారెడ్డిగూడెం మండలం పశ్చిమగోదావరి జిల్లా 

Comments