దళితులు పై దాడులు ఆగేదెప్పుడు | నంబూరి శ్రీమన్నారాయణ

ఇదేనా ప్రజాస్వామ్యం! దళితులు పై దాడులు, అత్యాచారాలు, హత్యలు ఆగేదెప్పుడు....? పౌర హక్కుల సంఘం CLC.

 ************************

 నేరమే అధికార మై న్యాయాన్ని బలి తీస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రతివారు నేరస్తులే. 15ఆగస్ట్2021 గుంటూరు జిల్లా మంగళగిరి లో బీటెక్ విద్యార్థి రమ్యశ్రీ ని పట్టపగలు నడిబజారులో కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. హంతకుడు ఆ విద్యార్థి ని పట్టుకుని కత్తితో పొడుస్తుంటే దారిలో వెళ్ళే వారు, షాపుల్లో ఉన్న వారు కాని ఆ కిరాతకుడు ని మందలించి అడ్డుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఒక వయసు మళ్ళిన పెద్దాయన ప్రయత్నం చేస్తుంటే అతనికి సంబంధించిన యువకులు మనకు ఎందుకు అని వారించారు.

హంతకుడు మాత్రం పట్టపగలు హత్య చేసి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.దళిత బిడ్డ కిరాతకుడు పొడిచిన కత్తి పోట్ల నొప్పి భరించలేక ఎంతో భాధ తో రోడ్డు మీద గిల గిల కొట్టుకుంటూ ప్రాణాలు వదిలింది.సీసీ ఫుటేజ్ చూస్తుంటే ఆడ బిడ్డ ఉన్న ప్రతి తల్లిదండ్రులు రోడ్ మీద కు వెళ్లే తమ ఆడకూతురు గుర్తుకు వచ్చి తీవ్ర భయానికి, ఆందోళనకు గురైనారు. ప్రతి ఆడ బిడ్డ కి మానవ మృగాళ్ల నుండి సమాజం లో రక్షణ లేదు. మానవ సమాజంలో మానవీయ విలువలు అడుగంటి పోతున్నాయి. 4ఆగస్ట్2021 పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం ముండూరు గ్రామములో దళిత రైతు భీమడోలు వీర రాఘవులు అర ఎకరం వరి పొలానికి నీరు పెడుతుంటే అగ్రవర్ణ కమ్మ అహంకారులు ఇద్దరూ అర్థగంట ఆగలేక పొలములో పడేసి కర్రలతో తీవ్రంగా కొట్టి చంపేశా రూ ఆ దళిత రైతు వారి మధ్యలో భూమి ఉండటం గిట్టడం లేదు ఎప్పుడూ గొడవ పడుతుంటే నేల కోసమే గొడవ అని అనుకున్నారు

 కానీ చంపు తారని కుటుంబం సభ్యులు ఊహించలేకపోయారు వెంటనే పోలీసులకు లొంగిపోయిన హంతకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి అక్కడ ఉన్న అధికార పక్షం వారి సామాజిక వర్గమే అవ్వడం వలన ఇష్టపడలేదు కేసును మాఫీ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. పౌర హక్కుల సంఘం clc, దళిత సంఘాల, ప్రజా సంఘాలు అండగా నిల బడి స్పందించి ఉద్యమించడంతో వారికి సాధ్యం కాలేదు. పోలీసులు మాత్రం నిందితుల పనిచేస్తున్నట్లు ప్రజలు అనుమానిస్తున్నారు.13 ఆగస్టు 20 21న జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో దళిత పాలేరు హత్య చేశారు సంఘటనలో దళిత హక్కుల ప్రజా సంఘాలు స్పందించి ఉద్యమించాయి అయినా పోలీసులు అధికార పక్షం లో ఉన్నటువంటి అగ్రవర్ సామాజిక కులం వారి ప్రభావానికి గురై ఇంత ఎవరినీ అరెస్టు చేయలేదు ఇది చాలా బాధాకరం విషాదకరం

శ్రీనివాసపురం గ్రామంలో ఇప్పటివరకు ఐదుగురు దళితుల హత్య చేసినట్లు ముప్పిడి రాజు హత్య తో వెలుగులోకి వచ్చాయి కొవ్వూరు డివిజన్లో పెనకనమెట్ట గ్రామంలో మహేష్ బాబు ఫ్లెక్సీ కడతారని తెలిసి ముందు గా వేసుకున్న పథకం ప్రకారం గొడవపడి సుమారు నలభై మంది దాడి చేసి దళితులను తీవ్రంగా గాయపరిచారు. దీనిపై ఎం.ఎల్.సి గా కేసు నమోదు చేయబడింది. మరుసటి రోజున దళితులపైన అగ్రవర్ణ కాపులు కౌంటర్ కేసు పెట్టారు. బాదిత వర్గాల పైన పోలీసులు కౌంటర్ కేసు నమోదు చేయటం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. దళిత సమాజం పై భారతీయ సమాజంలో ప్రతి సెకండ్ కి ఎక్కడో ఒక చోట అవమానాలు, దాడులు, వివక్షతలు, హత్యలు, అత్యాచారాలు వెలి, బహిష్కరణ కు గురి అవుతున్నారు. దళితులపై దాడులు ఆగే దెప్పుడు? 75 సంవత్సరాల భారత దొరల పాలనలో దళితులు నిత్యం గాయాలకు గురి అవుతున్నారు. వారి రక్తం తో భారత దేశం నేల ఇంకా ఎంత కాలం తడవాలి? ఎస్సీ ఎస్టీ లకు బీసీలకు మహిళలకు ముస్లిం మైనార్టీలకు స్వేచ్ఛ స్వాతంత్రం లేదు. భారతీయ సమాజ నిర్మాణం లో కష్ట జీవులైన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, మహిళల పాత్ర గణనీయమైనది.వారు సమాజంలో సమాన విలువ, గౌరవం, హోదా పొంద కుండా భారత దేశం సమానత్వం సాధించటం పూర్తి కాదని భారత రాజ్యాంగ నిర్మాత dr. బి.ఆర్.అంబేడ్కర్ ప్రకటించారు.

 Sc,St ల రక్షణ,భద్రత కోసం ప్రాధమిక హక్కులు, ఆదేశిక సూత్రాలలో పలు అధికరణలు ని ఆయన డ్రాఫ్టింగ్ కమిటీలోను, రాజ్యాంగ సభలోను చర్చించి పొందుపరిచారు.ఇవి అన్ని పూలే,పెరియార్ తదితర బాధిత సమాజం ప్రజాస్వామిక పోరాటాల నుండి వచ్చిన ప్రజల డిమాండ్స్. ఆ పోరాటాలను ఆకళింపు చేసుకుని ప్రత్యక్షం గా ఉద్యమించారు dr బి.ఆర్ అంబెడ్కర్.అందుకే బాధిత బలహీన వర్గాల తో పాటు దేశం లో ప్రతి పౌరుడు సంక్షేమం కోసం ఆయన రాజ్యాంగం లో కొన్ని హక్కులను పొందుపరచటం జరిగింది.ఇందులో ఆర్టికల్ 12 to 21 వరకు చాలా ముఖ్యమైనవి.స్వేచ్ఛ,సమానత్వం,వాక్,సభా,స్వాతంత్ర్య లు, రాజకీయ స్వేచ్ఛ జీవించే హక్కులు అందులో ఉన్నవి. ఇవి ప్రతి పౌరుడు కి అవసరం.కాని 75 వసంతాలు స్వతంత్ర పాలనలో నేటికి Sc, St,బడుగు బలహీన వర్గాలు, మహిళకు, ముస్లిం, మైనార్టీలకు ఈ హక్కులు దక్కటం లేదు.

ప్రధానం గా దళితులు నేటికి దేశం లో అంటరానితనం, వివక్షత, వెలి, బహిష్కరణ, దాడులు, అత్యాచారం, హత్యాలు కి గురవుతున్నారు. రాజ్యాంగ హక్కులు,చట్టాలు కాగితాలకే పరిమితం. అవి ఏవి అమలు కి నోచుకోవడం లేదు.సమాజం లోను, పోలీస్ స్టేషన్లు,కోర్ట్ లలోను ఆదివాసి దళిత వెనుకబడిన ముస్లిం మైనార్టీ వర్గాలకు న్యాయం అందని ద్రాక్షపండు.హత్యలు చేయటం మా మాటవినక పోతే మిగతా వారిని కూడా చంపుతాం అని భయ పెడుతున్నారు. నయాన భయాన లొంగ తీసుకోవటం సాధారణ వ్యవహారంగా మారిపోయింది.

దుర్మార్గపు,ఆరాచకపు పనులకు అగ్రవర్ణ దురహంకారంతో ఒడిగడుతున్నారు.కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. అధికారాన్ని ఉపయోగించి శవాలు సాక్షి గా సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు.కేసు నమోదు చేసి విచారించే పోలీసుల నుండి శవ పంచనామా,పోస్ట్ మార్టం,ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చే రెవెన్యూఅధికారులు, డాక్టర్లు ని కూడా రాజకీయ అధికారం కలిగిన అగ్రవర్ణ దురహంకారులు ప్రభావితం చేస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా ఇదేనా అతి పెద్ద రాజ్యాంగానికి ఇచ్చే విలువ? రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చి రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు. అధికార బలం, ఆర్ధిక బలం, అండబలం లేని Sc,St బాధిత సమాజం. దుర్మార్గపు అగ్రవర్ణ పెత్తందారీ మూర్ఖత్వం కి బలైపోతుంది

తరతరాలుగా బలిదానాలు చేస్తూనే ఉన్నారు చైతన్యవంతమైన పోరాడే మహిళ, యువత రక్తానికి రక్తం కోరుతుంది.ప్రాణానికి ప్రాణం అడుగుతుంది. ఇది చట్టం కాదు. వారి ఆవేదన. ఈ పరిణామాలు కి బాధిత సమాజానికి న్యాయం చేయటం లో విఫలమైన రాజ్యమే భాద్యత వహించాలి. న్యాయం చేయటం లో విపలమైనప్పుడు భాదితులు న్యాయం పొందటానికి చట్టాన్ని అతిక్రమించే అవకాశాలు ఉన్నాయి. అది వారి ప్రజాస్వామిక హక్కు గా వారు భావిస్తున్నారు. వారి నినాదాలు బాధితుల ఆవేదన, ఆక్రందన ల నుండి వెలువడుతున్నాయి అని అర్ధం చేసుకోవాలి. అలాంటి చర్యలకు ప్రజలు పాల్పడకుండా చిత్తశుద్ధితో పోలీసులు, ప్రభుత్వం తక్షణం భాదితులకు చట్ట ప్రకారం న్యాయం చెయ్యాలి. హంతకులను,దోషులను తక్షణం అరెస్ట్ చేసి శిక్షించాలి. భాదితులకు న్యాయం జరగక పోతే పెద్ద ఎత్తున అన్ని దళిత,హక్కుల,ప్రజా సంఘాలు తో రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం గా ఉద్యమిస్తామని తెలియ చేస్తున్నాము.

*Sc,St లపై దాడులు,హత్యలు,అత్యాచారాలు అరికట్టాలి.* బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యాలి. ప్రజలు,ప్రజాస్వామిక వాదులు,హక్కుల సంఘాలు, దళిత సంఘాలు,ప్రజాసంఘాలు వీలున్న మేరకు దళితులపై దాడులు,హత్యలు,హత్యాచారాలు నిరసిస్తూ వివిధ రూపాల్లో కార్యక్రమాలు భాదితులు కి న్యాయం జరిగే వరకు నిర్వహించాలి అని పిలుపు ఇస్తున్నాము. *డిమాండ్స్. *శ్రీనివాసపురం లో ముప్పిడి రాజు తో సహా జరిగిన 5 హత్యల పై జ్యూడిసియల్ విచారణ హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో జరిపించాలి. *Sc,St లకు రక్షణ,జీవన భద్రతకల్పిచాలి.* *మహిళపై జరుగుతున్న అత్యాచారాలు నివారించాలి.* *భూమి లేని ప్రతి పేద Sc St కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలి.* *చదువుకున్న ప్రతి దళిత విద్యార్థి కి ఉద్యోగం ఇవ్వాలి* *Sc, St లకు ప్రైవేట్ పరిశ్రమలలో రిజర్వేషన్లు కోటా ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి.* *హత్యకు గురైన గుంటూరు జిల్లా మంగళగిరి లో బి.టెక్ విద్యార్థి రమ్యశ్రీ, పశ్చిమగోదావరి మొండూరు లో దళిత రైతు భీమడోలు వీర రాఘవులు, శ్రీనివాసపురం లో ముప్పిడి. రాజు బాధిత కుటుంబాలు కి 50 లక్షలు రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. పెనకన మెట్ట లో అగ్రవర్ణాల దాడికి గురై గాయపడిన వారికి 25 లక్షలు ఏక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించి ఇవ్వాలి. సంఘటనలు జరిగిన గ్రామం లోని SC, St పేటలలో పాస్ట్ ట్రాక్ కోర్ట్ లను ఏర్పాటు చేసి విచారించి దోషులకు చట్ట ప్రకారం కఠిన శిక్షలు విధించాలి.

 -పౌర హక్కుల సంఘంCLC. నంబూరి. శ్రీమన్నారాయణ. 94938619875.

Comments