Press not కొవ్వూరు. 20.08.2021. ***********************
ఈరోజు పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క వెంకటరత్నం అధ్యక్షతన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితుల హత్యలపై నిరసన ఆందోళన కార్యక్రమం కొవ్వూరు ఆర్ డి ఓ ఆఫీసు వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు న్యాయవాది నంబూరు శ్రీమన్నారాయణ పాల్గొని ప్రసగించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల్లో ముగ్గురు దళితులు హత్యకు గురి అయ్యారని అన్నారు. ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని ఆరోపించారు. దళిత మహిళ రమ్యశ్రీ ని పట్టపగలు సీఎం గారి ఇంటికి దగ్గర లొనే అత్యంత కిరాతకంగా కత్తి తో పొడిచి చంపారు అని అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం ముండూరు లో దళిత రైతు భీమడోలు వీర రాఘవులు భూమి పొలానికి నీళ్లు పెట్టే దగ్గర పొలంలో వేసి తీవ్రంగా కొట్టి చంపేశారు అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం లో దళిత పాలేరు ముప్పిడి రాజుని అత్యంత కిరాతకంగా కొట్టి చంపి చెరువులో పడేశారని అన్నారు. పెనకనమెట్ట గ్రామంలో దళితులపై దాడి చేసి కొట్టారని అన్నారు దళితులపై జరుగుతున్న దాడులు హత్యలపై ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత జుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తక్షణం హత్యలకు గురి అయినటువంటి కుటుంబాలకు కు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దళితులకు జీవనోపాధి లేకపోవటంవల్ల అగ్రవర్ణాల పై ఆధారపడి జీవించవలసి వస్తుందని ఫలితంగా అగ్రవర్ణాలు అవమానకరంగా దళితుల పట్ల వ్యవహరిస్తున్నారని అన్నారు. వారి జీవన భద్రత కోసం రాష్ట్రంలోని నిరుపేదలు అయినటువంటి దళిత కుటుంబాలకు ఐదు ఎకరాల చొప్పున భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులు పై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని, దళితులకు రక్షణ కల్పించాలని ఐ ఎఫ్ టి యు పి ఓ డబ్ల్యు ప్రజాసంఘాల నాయకులు సిహెచ్ రమేష్ ఈమని మల్లిక తదితరులు మాట్లాడుతూ డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో మెమోరాండం సమర్పించారు
ఇట్లు నక్క వెంకటరత్నం జిల్లా అధ్యక్షులు పౌరహక్కుల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా
Comments
Post a Comment