దళితుల హత్యల పై జ్యూడిషయల్ విచారణ జరిపించాలని ధర్నా | నిడదవోలు, ప గో జిల్లా

ప్రెస్ నోట్ .నిడదవోలు 19. 08. 2021.
*****************************************

రాష్ట్రం లో జరుగుతున్న దళితుల హత్యల పై జ్యూడిషయల్ విచారణ సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి తో జరిపించాలి అని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ డిమాండ్ చేశారు. ఈ రోజు పౌర హక్కులు సంఘం, sc, st న్యాయవాదులు సంఘం, నిదడవోలు బార్ అసోసియేషన్, KNPS, KVPS, IFTU, CITU,PDSU,దళిత సంఘాలు,ప్రజా సంఘాలు రాష్ట్రంలో జరిగిన దళితుల హత్యలు కి నిరసనగా నిడదవోలు తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు.గుంటూరు లో బి.టెక్ విద్యార్థి రమ్యశ్రీ,పశ్చిమ గోదావరిలో మోన్డూరు లో దళిత రైతు భీమడోలు వీర రాఘవులు, శ్రీనివాసపురం లో దళిత పాలేరు ముప్పిడి రాజు హత్యలు,పెనకన మెట్ట గ్రామం లో కొంతమంది అగ్ర వర్ణ ఆరాచకులు దళితుల పై దాడి సంఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి అని ఆవేదన చెందారు.

రాష్ట్రంలో దళితులు పై జరుగుతున్న హత్యలు దాడులు పై జ్యూడిసియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని, దళితులకు రక్షణ కల్పించాలని,బాధిత కుటుంబాలకు 5 ఎకరాలు భూమి ,కుటుంభం లో ఒకరికి ఉద్యోగం కల్పిచాలని ప్రభుత్వం ని డిమాండ్ చేశారు.

నాయకులు. న్యాయవాద సంఘం అధ్యక్షుడు మత్తి అర్జునుడు, sc,st న్యాయవాద సంఘం అధ్యక్షుడు ch. విజయకుమార్, KVPS జువ్వల. రాంబాబు,IFTU ఈమని గ్రీష్మ కుమార్, KNPS ఎం. జాన్ రాజు,PKS మస్తాన్,CITU రవి, PDSU మహర్షి, సారధి తదితరులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ గంగరాజు గారికి మెమోరాండం సమర్పించారు. ఇట్లు.నంబూరి. శ్రీమన్నారాయణ. రాష్ట్ర ఉపాధ్యక్షులు,హైకోర్టు న్యాయవాది. 9493861875

Comments