ఫాదర్ స్టాన్ స్వామి సంతాప సభ | తూ గో జిల్లా

ప్రెస్ నోట్: 21 ఆగస్టు 20 21 శనివారం, కాకినాడ!

ఉపా చట్టం రద్దుకై పోరాడుదాం!
ఫాదర్ స్టాన్ స్వామి సంతాప సభలో వక్తల పిలుపు!

ఉపా రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ గాంధీ భవన్ లో శనివారం ఉదయం ఫాదర్ స్టాన్ స్వామి సంతాప సభ జరిగింది. ఈ సభకు ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేడంగి చిట్టిబాబు, అఖిల భారత రైతు- కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండవ దుర్గాప్రసాద్, పీ వై ఎల్ జిల్లా కార్యదర్శి వి చిట్టి బాబు, ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ అయితా బత్తుల రామేశ్వరరావు, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకులు కాశి బాలయ్య, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ఎం ఏసు, అరుణోదయ జిల్లా కార్యదర్శి వి భీమశంకర్, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ తిరుపతిరావు, చైతన్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కె రమ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి శేష బాబ్జి, పలివెల వీరబాబు, సామాజిక విప్లవ వేదిక నాయకులు దీపాటి శివప్రసాద్, పి డి ఎం నాయకులు కే గంగరాజు, కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు కోనాల లాజరు, ఏ ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ఆర్ సతీష్, ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా నాయకులు గెద్దాడ సూరిబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు- కూలిసంఘం నాయకులు మచ్చ నాగయ్య, బొడ్డు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ముందుగా ఫాదర్ స్టాన్ స్వామికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

ఈ సభలో వేడంగి చిట్టిబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛను, రాజకీయ స్వేచ్ఛ ను, జీవించే హక్కును హరిస్తున్నాయి అని విమర్శించారు. మేధావులను, న్యాయవాదులను, పౌరహక్కుల నేతలను, కవులను, రచయితలను, జర్నలిస్టులను, ప్రజా ఉద్యమకారులను ఉపా చట్టం కింద అరెస్టు చేసి, బెయిలు లేకుండానే నిర్బంధిస్తున్నారని విమర్శించారు. విచారణ లేకుండా నిర్బంధించడం సుప్రీం కోర్ట్ నిబంధనలకు విరుద్ధం అన్నారు. స్టాన్ స్వామి తో సహా 16 మందిని కేంద్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా బెయిల్ లేకుండా జైల్లో నిర్బంధించారని విమర్శించారు. క్రిమినల్స్ ను పార్లమెంటు లలోనూ, అసెంబ్లీ లలోను పెట్టుకొని, బ్యాంకులు లూటీ చేసే వారిని విదేశాలకు పంపి వేసి, దేశ ప్రజల కోసం మాట్లాడుతున్న వారిని జైల్లో నిర్బంధించడం గర్హనీయం అన్నారు.

 మండవ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ తీవ్రవాదులను, నక్సలైట్లను నిర్బంధించే పేరుతో ఉపా చట్టాన్ని తీసుకు వచ్చి, ఆదివాసీల మీద, రైతు మీద, కార్మికుల మీద, ప్రజా ఉద్యమకారుల పైన ఉపా చట్టం ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఉపా చట్టం, 124 (A) రాజద్రోహం నేరాలను రద్దు చేసే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.

Comments